
వాషింగ్టన్: అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్ ఇర్మా, మరియా తుఫాను బాధితులకు చేయుతనిచ్చేందుకు ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికపై కలిశారు. తుఫాను బాధితులకు సాయంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గోల్ఫ్ కప్-2017 టోర్నమెంట్‌ను మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్‌బుష్, బిల్‌క్లింటన్‌లు గురువారం ప్రారంభించారు. ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలి సారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ద్వైపాక్షిక టోర్నమెంట్‌లో అమెరికా జట్టు.. ఇతర దేశాలతో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడనుంది. జెర్సీ సిటీలోని లిబర్టీ నేషనల్ గోల్ఫ్ కోర్సులో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ప్రారంభ మ్యాచ్‌ను ఈ మాజీ దేశాధ్యక్షులు ఈ వేదికపై నుంచే తిలకించారు. గతంలో వీరు హరికేన్ ఇర్మా తుఫాను బాధితులను ఆదుకోవాలని అమెరికన్లను కోరుతూ ఓ వీడియా సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తుఫాను బాధితులకు సాయంగా అందించనున్నారు.