క్లింటన్ పై ఒబామా గట్టిగా అరిచారు! | Barack Obama invites Bill Clinton loudly at runway | Sakshi
Sakshi News home page

క్లింటన్ పై ఒబామా గట్టిగా అరిచారు!

Published Sun, Oct 2 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

క్లింటన్ పై ఒబామా గట్టిగా అరిచారు!

క్లింటన్ పై ఒబామా గట్టిగా అరిచారు!

వాషింగ్టన్: ఇజ్రాయెల్ నేత సిమోన్ పారిస్ అంత్యక్రియల సందర్భంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్లారు. అక్కడ సిమోన్ అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అధ్యక్షుడు ఒబామా అప్పటికే విమానంలోకి చేరుకుని క్లింటన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపు ఎదురుచూసినా.. క్లింటన్ ఇంకా రన్‌వేపై ఎవరితోనే మాట్లాడుతుండటంతో అసహనానికి లోనైన ఒబామా ‘బిల్.. వెళదాం పద’ అంటూ బిగ్గరగా పిలిచారు. అది వినిపించుకోని క్లింటన్ ఇంకా మాటలు కొనసాగించారు. దీంతో విమానం డోర్ వద్దకు వచ్చి ఒబామా మరోసారి ‘బిల్.. నేను నిన్ను ఇంటికి తీసుకెళతా’ అని అన్నారు. అయినా క్లింటన్ ఆ మాటలు వినిపించుకోలేదు. దాంతో మరోసారి ‘బిల్ ఇక వెళదాం పద..’ అంటూ కాస్త కోపంతో ఒబామా బిగ్గరగా అరిచారు. అప్పుడు క్లింటన్ తాపీగా విమానంలోకి చేరుకున్నారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement