పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
భారత్‌లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది.
ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట.
ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు.
కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment