కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు క్యూబా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాయుధ విప్లవం ద్వారా క్యూబాలో అధికారం చేపట్టిన ఫెడల్ క్యాస్ట్రో సామ్యావాద పంథాలో దేశాన్ని అభివృద్ధి చేశారు. అదేక్రమంలో అమెరికా సామ్రాజ్యవాదానికి సవాలుగా నిలిచారు. ఫెడల్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కుగదీసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.