క్యూబా నేర్పుతున్న పాఠం | Opinion on Obama tour in Cuba by Dr.AP Vital | Sakshi
Sakshi News home page

క్యూబా నేర్పుతున్న పాఠం

Published Wed, Apr 20 2016 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

క్యూబా నేర్పుతున్న పాఠం

క్యూబా నేర్పుతున్న పాఠం

‘ఎప్పటినుండో మిమ్మల్ని తప్పకుండా చూడాలని, వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవం తులు మీరు!’ అని నెహ్రూజీ తొలి సారి క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రోను కలుసుకున్న సందర్భంగా అన్న మాటలివి! ప్రపం చాన్ని శాసించగల స్థాయిలో ఉన్నానన్న అహంకారంతో - ‘ఏమిటి ఈ కాస్ట్రో! ఒక ఎర్ర జెండా భుజాన వేసుకుని, పెద్ద మొనగాడల్లే ఊరేగుతు న్నాడు! అమెరికాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉందని మర్చిపోతున్నట్లున్నాడు ఈ బుడత విప్లవకారుడు!’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తే, అమెరికాకు క్యూబా 90 మైళ్ల దూరంలో ఉంటే, ‘క్యూబాకు అమెరికా కూడా 90 మైళ్ల దూరంలోనే వుందన్న ప్రాథమిక సత్యాన్ని అమెరికా అధ్యక్షుడు మరిచినట్లున్నాడు’ అని హెచ్చరిస్తూ బదులి చ్చిన ధీశాలి కాస్ట్రో.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా క్యూబా పర్యటనకు వెళ్లిన వార్తతో పాటు ఈ ఉదంతం గుర్తుకొ చ్చింది. అంతేకాదు, ‘అమెరికా అధ్యక్షునిగా ఒక నల్ల జాతీ యుడు ఎన్నికయితే క్యూబా అమెరికా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఏర్పడతాయి’ అని కూడా కాస్ట్రో నాడు తెలిపిన అభిప్రాయం, భవిష్యద్దర్శనమా అన్నట్లు నిజమయింది. ఈ తరుణంలో, నా 37వ ఏట.. 1978లో ప్రపంచ యువజన మహాసభల సందర్భంగా భారతదేశ ప్రతినిధి బృందంలో ఒకరిగా, నా క్యూబా పర్యటనలో  నేను గమనించిన క్యూబా విప్లవానికి సంబంధించిన కొన్ని అంశాలను భూమికగా ప్రస్తావించదలిచాను.

క్యూబా విప్లవం జయప్రదం అయ్యేనాటికి దానిని కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన జరిగిన విప్లవంగా ప్రకటించే పరిస్థితి లేదు. క్యూబన్ కమ్యూనిస్టు తొలి మహాసభ విప్ల వానంతరం సంవత్సరం తర్వాత జరిగింది! క్యూబాలోని సామ్రాజ్యవాద అమెరికన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కాస్ట్రో నేతృత్వాన ఓడించకముందు, అలాంటి దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు రావడం అరుదేమీ కాదు. ఆ తర్వాత తిరుగు బాటు నేతను కూడా అమెరికా కొనేసి, దారికి తెచ్చుకుని తిరిగి తన కీలుబొమ్మగా మార్చుకోవడం జరిగేది. అలాగే కాస్ట్రో నేతృత్వాన రగులుకొంటున్న విప్లవాన్ని కూడా మరో సాధారణ తిరుగుబాటుగా వ్యవహరించవచ్చులే అని అమె రికన్ పాలకులు కొంత నిర్లక్ష్యం చేసి విప్లవ అణచివేత దిశగా ముందుగా మేల్కొనలేదు. తీరా విప్లవం జయప్రదం కాబోయే సమయానికి, అది అమెరికా చేయి దాటి క్యూబా చరిత్రలో, లాటిన్ అమెరికాలో తొలి ప్రజావిప్లవంగా నిలిచి పోయింది. ఇదొక ప్రత్యేకత! క్యూబా విప్లవాన్ని ఒక వాస్త వంగా అంగీకరించడానికి అమెరికా సిద్ధపడకపోగా పురిటి పసికందును అంతమొందించాలని, అనాగరిక ఆంక్షలకు ఆజ్యంపోసి, క్యూబాకు జీవనావసరాలను సైతం అంద కుండా చెయ్యాలని ఎంతో దుష్టయత్నం చేసింది.

ఆ సమయానికే అంతర్జాతీయంగా సోవియెట్ యూనియన్ నేతృత్వాన సోషలిస్టు శిబిరం ఏర్పడింది. యు.ఎస్. ఎస్.ఆర్, చైనా మొదలగు దేశాలతో కూడిన సోషలిస్టు శిబిరం అండదండలతో క్యూబా నిలదొక్కుకోగలిగింది.  అయితే సోవియెట్ యూనియన్  నేతృత్వంలోని సోషలిస్టు శిబిరం ఎంతగా సహకరించినా, క్యూబా ప్రజానీకంలో అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ చైతన్యం ప్రధాన కారణం కావాలి! అప్పుడే క్యూబన్ విప్లవానికి గ్యారంటీ! అందుకే ఆ విప్లవ చైతన్యాన్ని ప్రజలలో అంతర్ముఖం చేసేందుకు కాస్ట్రో సోషలిస్టు పాలన ఎంతో ప్రయత్నం చేసింది. అంత ర్జాతీయ సోషలిస్టు సిద్ధాంత ఘర్షణల ఆటుపోట్ల మధ్యనే క్యూబా తన విప్లవాన్ని కాపాడుకున్నది. అమెరికన్ ఆంక్షలనే కాదు - సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై అక్కడ సోషలిజం అంతరించినా చైనాలో ‘డెంగ్’  సంస్కరణల పాలన సాగినా, క్యూబా విప్లవం నిల దొక్కుకున్నది. లాటిన్ అమెరికా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. నిన్నమొన్నటి ‘చావేజ్’ కూడా క్యూబా ప్రభావితుడే!
 
ప్రపంచంలోనే ఆరోగ్య రంగాన అగ్రగామిగా వున్న దేశం క్యూబా. 27 దేశాలలో క్యూబా వైద్యులు తమ ప్రభుత్వం తరఫున వెళ్లి వైద్య సహాయం అందిస్తున్నారు. క్యూబాకు ఆయిల్ సరఫరాలు నిలిచిపోయేలా అమెరికా ఆంక్షలు విధిస్తే - అత్యంత తీవ్రమైన పరిస్థితిలో తిరిగి గుర్రాలతో వ్యవసాయాన్ని (ట్రాక్టర్ల స్థానంలో) సాగించి, అమెరికాకు లొంగేది లేదని స్పష్టం చేసింది క్యూబా. తన దేశ ప్రజల ప్రయోజనాలకు, తన ఆర్థిక వనరులకూ అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలకు తాకట్టు పెట్ట కుండా, ప్రగతి పథాన సాగుతున్నది గనుకనే అమెరికన్ సామ్రాజ్య వాదం సైతం బలప్రయోగంతో, క్యూబాను కబళింపవచ్చు నన్న అహంకారం పనిచేయదని గ్రహించింది. ఒకనాడు కాస్ట్రో జోస్యం చెప్పినట్లు - డెమొక్రటిక్ పార్టీ తరఫున నల్ల జాతీయుడైన ఒబామా అధ్యక్షులుగా వుండి అక్కడి పాలక వర్గం ప్రస్తుత పరిస్థితిలో అనుమ తించిన పరిధిలో, క్యూబాతో సత్సంబంధాల ఆవశ్యకత గుర్తెరిగి తానూ స్నేహ హస్తం అందించాడు. ఆ విజ్ఞతకు ఒబామా సైతం అభినందనీయుడే!

క్యూబా మన దేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. అయినా, మార్క్సిజాన్ని ఒక రూళ్ల కర్ర సిద్ధాంతంగా కాకుండా, సోషలిస్టు శిబిరం ఉన్న నాటి పరిస్థితులు -ఆ శిబిరం విచ్ఛిన్నమైన పరిస్థితులు- అమెరికన్ సామ్రాజ్య వాద తీవ్ర వ్యతిరేకత. అలాగే లాటిన్ అమెరికన్ జాతీయ సంస్కృతీ నాగరికతలు, విభిన్న భౌతిక రాజకీయ పరిస్థితు లకు అనుగుణంగా మార్క్సిజం వెలుగులో తన ప్రత్యేక తలతో తన పయనం సాగించింది. అది క్యూబా కమ్యూ నిస్టు పార్టీ నుంచి మన కమ్యూనిస్టులు వినమ్రంగా స్వీక రించదగిన పాఠం. మార్క్సిజాన్ని ఒక పిడిసూత్రంగా కాక ఆచరణకు మార్గదర్శకంగా అన్వయించుకోగలగాలి. పుచ్చ లపల్లి సుందరయ్య ఒక సందర్భంలో చెప్పినట్లు ఈ సమా జం ప్రస్తుత దశనుంచి పురోగమన దిశగా ఎంతో కొంతైనా పయనించేటట్టు కృషి చేయడం.. ఏ స్థితిలో ఉండినా కమ్యూనిస్టుల కర్తవ్యం. కనీసం సమాజం మరింత  తిరోగ మనానికి దారితీయకుండా, కనీసం ఆ  స్థాయిలోనైనా నిలబెట్టగలగాలి. ఇప్పుడున్న స్థితిలో వర్గపోరాట రూపం ఒక్కటే ఏకైక పోరాటరూపంగానూ, వర్గవైరుధ్యం ఒక్కటే ఏకైక వైరుధ్యంగానూ భావించి వ్యవహరించడం మన భౌతిక వాస్తవికతకు
అనుగుణంగా వ్యవహరించినట్లు కాదు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్, పూలే వంటి వారి అనుయాయులను, ఇతర సామాజిక శక్తులను, వ్యక్తు లను కలుపుకుని ముందుకు సాగాలి. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక దోపిడీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్ మను గడకు మన ప్రత్యేకతలో నిర్దేశించగలవు.

(వ్యాసకర్త: ఎ.పీ. విఠల్, ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement