అక్కడ... 56 ఏళ్ల తర్వాత! | 56 years ofter there...! | Sakshi
Sakshi News home page

అక్కడ... 56 ఏళ్ల తర్వాత!

Published Sat, Jan 9 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

అక్కడ... 56 ఏళ్ల తర్వాత!

అక్కడ... 56 ఏళ్ల తర్వాత!

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్... హాలీవుడ్ సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లలో ఇది ఒకటి. లేటెస్ట్‌గా వచ్చిన ఈ సిరీస్‌లోని ఏడో భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో మొత్తం అందరి దృష్టీ తరువాయి భాగంపై పడింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ చిత్రం విడుదలకు ముందే హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనుంది. అదెలా అంటే... ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఎనిమిదో భాగం షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూబాలో షూటింగ్ ప్రారంభించనుంది చిత్ర బృందం. అదే ఇప్పుడు విశేషమైంది.
 
  హాలీవుడ్ ఫిలిమ్‌మేకర్స్ ఇప్పటివరకు తమ షూటింగ్స్ కోసం వదలని ప్రదేశం లేదు. మొత్తం ప్రపంచ దేశాలను చుట్టేసిన హాలీవుడ్ కొన్నేళ్ళుగా ఒక దేశం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఆశ్చర్యంగా ఉందా! 1960లో ‘ఎమ్బార్గో’ చిత్రం తర్వాత మళ్లీ ఏ హాలీవుడ్ చిత్రం క్యూబాలో షూటింగ్ జరుపుకోలేదు. 56 ఏళ్ల తర్వాత అక్కడ చిత్రీకరణ జరుపుకోనున్న హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8’ కావడం విశేషం. రానున్న రోజుల్లో ఈ సీక్వెల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement