వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్
స్వీడన్‌లోనూ వెలుగు చూసిన కేసు
సిడ్నీ: ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. కాంగోలో 450 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధ్య, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్ దేశమైన స్వీడన్‌లోనూ ఒక ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది!
దీని వ్యాప్తిని అడ్డకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. ఎంపాక్స్‌లో క్లేడ్–2 కంటే క్లేడ్–1 ప్రమాదకరం. గత సెపె్టంబర్‌లో క్లేడ్–2బీ వేరియంట్ పుట్టుకొచి్చంది. ఎంపాక్స్ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులపై కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. బాధితులతో లైంగిక సంబంధాలు, దగ్గరగా వెళ్లడం, శ్వాస పీల్చడం వల్ల వైరస్ సోకుతుంది. ప్రతి 100 కేసుల్లో కనీసం నలుగురు మరణించే ప్రమాదముంది. ఎంపాక్స్ నియంత్రణకు వ్యాక్సిన్ వచి్చనా అది పరిమితంగానే లభిస్తోంది. కాంగో, బురుండి, కెన్యా, రువాండాలకు వ్యాపించింది. ఎంపాక్స్‌ను ఇంకా మహమ్మారిగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment