జెనీవా: ప్రపంచదేశాలను ప్రస్తుతం మంకీపాక్స్ వణికిస్తోంది. ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దవారిలో ఎంపాక్స్ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
కాగా, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నందున వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని వెల్లడించింది. ఇక, తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
మరోవైపు.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అంటువ్యాధులను నివారించడానికి, వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి, వ్యాక్సిన్‌లు అత్యంత అవసరం అని అన్నారు.
Kasama na sa prequalification list ng World Health Organization #WHO ang #mpox vaccine ng Denmark-based Bavarian Nordic.
Ito ang kauna-unahang beses na inaprubahan ng ahensya ng #UN ang isang bakuna kontra mpox. #News5 | via Reuters pic.twitter.com/FoqBdJqxUm— News5 (@News5PH) September 13, 2024
ఇది కూడా చదవండి: గూఢచర్యం ఆరోపణలు..బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా
Comments
Please login to add a commentAdd a comment