మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది.
మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. డబ్ల్యూహెచ్‌ఓ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
పేరు మార్పు ఎందుకు?
ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్‌లైన్‌లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కొత్తపేరును ఖరారు చేసింది.
చదవండి: 3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
Comments
Please login to add a commentAdd a comment