41 Dead In Migrant Shipwreck Off Lampedusa Island In Italy - Sakshi
Sakshi News home page

పడవ బోల్తా.. 41 మంది మృతి..

Aug 9 2023 4:58 PM | Updated on Aug 9 2023 5:11 PM

41 Dead In Migrant Shipwreck Off Italy - Sakshi

మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి ప్రాణాలతో చేరారు. అనంతరం పడవ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. 

45 మందితో ప్రయాణించిన పడవ.. మధ్యదరా సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరూ మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 

సంక్షోభంతో నిండిపోయిన ట్యూనీషియా నుంచి 45 మందితో పడవ ప్రయాణించినట్లు తెలుస్తోంది. పడవ మొదలైన కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఆ భయానక దృశ్యాల గురించి తెలిపారు. 

ఇదీ చదవండి: 'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement