shipwrecks
-
దక్షిణ చైనా సముద్రంలో కలకలం
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.అసలేం జరిగింది?నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్‌కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. -
పడవ బోల్తా.. 41 మంది మృతి..
మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి ప్రాణాలతో చేరారు. అనంతరం పడవ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. 45 మందితో ప్రయాణించిన పడవ.. మధ్యదరా సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరూ మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సంక్షోభంతో నిండిపోయిన ట్యూనీషియా నుంచి 45 మందితో పడవ ప్రయాణించినట్లు తెలుస్తోంది. పడవ మొదలైన కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఆ భయానక దృశ్యాల గురించి తెలిపారు. ఇదీ చదవండి: 'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..' -
పడవ మునక.. 21 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు. -
తుపాను కారణంగా రెండు ముక్కలైన ఓడ... 12 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాకాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్లు (296 కిలోమీటర్లు) దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతైయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుపాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తుపాను గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో 12 మంది మృతదేహాలను రెస్కూ సిబ్బంది గుర్తించారు. అదీగాక అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు, తీవ్ర గాలులు కారణంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టడం కష్ట తరంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం ముగ్గురిని రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సుమారు ఏడు విమానాలు, దాదాపు 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు గల్లంతైన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్కూ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by 政府飛行服務隊GovernmentFlyingService (@governmentflyingservice) (చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి) -
గ్రీసులో మరో వలస విషాదం
ఏథెన్స్: ఏజియన్ సముద్రంలో రెండు పడవలు మునిగిపోయిన ఘటనలో 42 మంది వలసదారులు మృతి చెందారు. టర్కీ నుండి గ్రీసుకు సామర్థ్యానికి మించి వలసదారులతో పడవలు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. గ్రీసు ద్వీపం కలోలిమ్నస్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 34 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఫార్మకోనిసి ద్వీపం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. గల్లంతైన వారికోసం గ్రీసు తీరప్రాంత భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇరాక్, సిరియా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది కాలంగా పది లక్షల మందికి పైగా ప్రజలు యూరప్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఏజియన్ సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 700 మంది వలసదారులు మృతి చెందారు. గతంలో టర్కీకి చెందిన అలాన్ కుర్థి అనే బాలుడు విగత జీవిగా గ్రీసు తీరానికి కొట్టుకురావడం ప్రపంచవ్యాప్తంగా కలచివేసిన విషయం తెలిసిందే.