వలసజీవి ప్రాణాలు కోల్పోయింది ఈ ఛానెల్ టన్నెల్ లోనే
పాస్- డి- కాలిస్: ఆకలి మనిషితో ఎంతటి సాహసం చేయిస్తుందో.. ప్రాణాలు నిలుపుకోవాలనే కోరిక ఎంత దుర్బలమైనదో తెలియజేసే వార్త ఇది. అంత్యుద్ధాలతో అట్టుడికిపోతోన్న లిబియా, ఎరిత్రియా, సోమాలియాల నుంచి ఫ్రాన్స్, ఇంగ్లాండ్లకు వలసపోతోన్న ఆఫ్రికన్లు ఎంత ప్రమాదకరమై మార్గాలద్వారా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 3 వేల మంది వసలదారులు రబ్బరు బోట్లు, చేపలుపట్టే పడవలద్వారా వలసవెళ్లగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. వాటిలో ఒకటి.. ఛానెల్ టెన్నల్.
మంగళవారం ఆ సొరంగం గుండా రహస్యంగా ప్రయాణిస్తూ మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్కు చేరుకుంటాడనగా.. ప్రమాదవశాత్తు ఓ వలసజీవుడు దుర్మరణం చెందాడు. మృతుడ్ని ఎరిత్రియా పౌరుడిగా పోలీసులు భావిస్తున్నారు. అతడి శవాన్ని మొదట ఓ రైలు డ్రైవర్ గుర్తించాడు. అయితే మృతుడు పట్టాలు దాటుతున్నాడా, లేక రైలుపైన లేదా అడుగు భాగంలో దాక్కొని ప్రయాణిస్తున్నాడా అనే విషయాలు తెలియాల్సిఉంది. డ్రైవర్ రైలును నిలిపివేయడంతో దాదాపు ఐదుగంటలపాటు రైలు, రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు
టన్నెల్ గుండా ప్రయాణం ఎలా?
డోవర్ జలసంధి.. ఇంగ్లాండ్- ఫ్రాన్స్ లను విడదీసే 53 కిలోమీటర్ల సముద్ర శాఖ. ఇరుదేశాలను కలుపుతూ నిర్మించిన ఛానెల్ టెన్నెల్.. ప్రపంచంలోనే పొడవైన సముద్ర నిర్మిత సొరంగంగా ప్రసిద్ధి చెందిందింది. ఫ్రాన్స్ వైపు నుంచి పాస్- డి- కాలిస్ ప్రాంతంలో ఆ చానెల్ లోకి ప్రవేశం ఉంటుంది. ప్రశాంతమైన సరిహద్దుగా పేరుపొందిన ఆ చోటు గడిచిన రెండేళ్లనుంచి మాత్రం పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రబ్బరుబోట్లు, చేపల బోట్ల తర్వాత ఇంగ్లాండ్ లోకి ప్రవేశించేందుకు ఆఫ్రికా వసలజీవులు ఆ టెన్నెల్ గుండా ప్రయాణించడమే అందుకు కారణం. పై చిత్రంలోలాగా ట్రక్కులు, ఇతర వాహనాల కింద రహస్యంగా దాక్కొని ఇంగ్లాండ్ లోకి ప్రవేశించే దుస్సాహసం చేస్తున్నారు వలసజీవులు. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 5 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.