వరదల కారణంగా నిరాశ్రయులైన వేలాదిమంది కాశ్మీరీలకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించాలని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: వరదల కారణంగా నిరాశ్రయులైన వేలాదిమంది కాశ్మీరీలకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. దీపావళి సందర్భంగా కాశ్మీర్ వరద బాధితుల మధ్య తాను గడపాలని నిర్ణయించుకున్నట్లు మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 23న శ్రీనగర్ వెళ్లనున్నట్లు తెలిపారు. గత నెలలో భారీ వరదల కారణంగా కాశ్మీర్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ సంభవించనంతటి భారీ వరదల కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో నష్టం ఏర్పడడంతో బాధితుల పునరావాసం కోసం వెయ్యి కోట్ల రూపాయలను ప్రధాని ఇదివరకే ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
బార్ రూమ్‌లలో పెళ్లిళ్లు చట్టబద్ధం కాదు
చెన్నై: న్యాయువాదుల కార్యాలయూల్లో, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహస్య పెళ్లి ప్రవూణాలతో జరిగే వివాహాలు, హిందూ వివాహ చట్టం పరిధిలోకి రావని, వాటిని వివాహాలుగా పరిగణించడానికి వీల్లేదని వుద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో వుహిళలే నష్టపోతున్నందున, ఆ వివాహాలను సవాలుచేస్తూ తగిన కోర్టు వుుందు వుహిళలు పిటిషన్ దాఖలు చేయువచ్చని తెలిపింది. అడ్వకేట్లు జారీచేసే సర్టిఫికెట్‌ను వివాహానికి రుజువుగా గుర్తించలేవుంటూ తీర్పు చెప్పింది. కాగా, మరో కేసులో మొదటి పెళ్లి జరిగిన 23 రోజులకే ఆ విషయం దాచి రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ ...రెండో భర్త వేధిస్తున్నాడంటూ గృహ హింస చట్టం కింద కేసు పెట్టి భరణం కోరగా అందుకు ఢిల్లీలోని ఓ కోర్టు నిరాకరించింది. భరణం చెల్లింపు ఆదేశాలిచ్చి ఇటువంటి బహు భర్త ల/భార్యల సంబంధాలకు ఆమోదం తెలపలేమని స్పష్టం చేసింది.