లఢక్: దీపావళి సంబరాలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని మోదీ సందర్శించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదలు చేకూరాలని ఆకాంక్షించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు.
"సైన్యం సరిహద్దుల్లో హిమాలయంగా స్థిరంగా ఉన్నంతకాలం దేశం భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో భారత్‌పై నమ్మకం పెరిగింది. దేశ సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి. అందుకే దేశంలో శాంతి నెలకొంది. ఇందుకు సైన్యం పాత్ర ఎనలేనిది" అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali with Army personnel in Himachal Pradesh's Lepcha pic.twitter.com/ff23aUxgqe
— ANI (@ANI) November 12, 2023
ప్రధాని మోదీ ప్రతి ఏడాది దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి దీపావళి వేడుకలతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. గత ఏడాది కార్గిల్‌లో జరుపుకున్నారు.
Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL
— Narendra Modi (@narendramodi) November 12, 2023
ఇదీ చదవండి: కుప్పకూలిన చార్‌దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది
Comments
Please login to add a commentAdd a comment