ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్‌వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.
దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.
2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్‌డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్‌లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, 2023లో హిమాచల్‌లోని లెప్చాలో పర్యటించారు.
Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB
— Narendra Modi (@narendramodi) October 31, 2024
Comments
Please login to add a commentAdd a comment