nanrendra modi
-
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్‌కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్‌లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, 2023లో హిమాచల్‌లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
మోదీని కలిసిన సీఎం రేవంత్
-
అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు...
-
మోదీ తెలంగాణ పర్యటన వేళ కేసీఆర్ స్టాండ్ ఏంటి ?
-
మళ్లీ వీదేశాల టూర్ లో ప్రధాని
-
కాగితంతోనైనా విమానం చేశారా?
మహాసముంద్/బలౌదా బజార్: రఫేల్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును అనుభవం ఉన్న ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని హెచ్ఏఎల్కు కాకుండా, ఏ అనుభవమూ లేని రిలయన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారనీ, అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసలు అనిల్ అంబానీ ఎప్పుడైనా కాగితంతోనైనా విమానం తయారు చేశారో లేదో అని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో ఎన్నికలు జరగనున్న మహాసముంద్, బలౌదా బజార్ జిల్లాల్లో రాహుల్ మంగళవారం ప్రచారం నిర్వహించారు. రఫేల్ కుంభకోణంపై విచారణకు సిద్ధమవుతున్న కారణంగానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అత్యవసరంగా అర్ధరాత్రి విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారని రాహుల్ అన్నారు. ‘సీబీఐ విచారణ జరిగితే రెండే పేర్లు బయటకొస్తాయి. ఒకటి నరేంద్ర మోదీ, రెండు అనిల్ అంబానీ. విచారణ అంటే మోదీకి భయం’ అని ఆయన పేర్కొన్నారు. ‘మోదీ చెబుతున్నదాని ప్రకారం 2014కు ముందు దేశంలో ఎక్కడా అభివృద్ధే లేదు. ఆయన ప్రధాని అయ్యాకే అభివృద్ధి మొదలైందట. దేశం ప్రజలతో ముందుకెళ్తుంది తప్ప ఒక్క వ్యక్తితో కాదనే చిన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ప్రజలను ఆయన అవమానిస్తున్నారు’ అని రాహుల్ అన్నారు. మోదీ ప్రజల వద్ద నుంచి డబ్బును లాక్కుని నోట్లరద్దు ద్వారా నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి మోసగాళ్ల జేబులు నింపారని రాహుల్ ఆరోపించారు. నోట్లరద్దు ద్వారా దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే అవకాశాన్ని మోదీ కల్పించారనీ, ఈ చర్య వల్ల సామాన్యులు తీవ్రంగా బాధలకు గురైతే ధనవంతులు మాత్రం లాభపడ్డారని అన్నారు. -
పాఠశాల విద్యార్థులతో మోదీ
-
బిల్‌గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ శుక్రవారం సమావేశం అయ్యారు. క్లీన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలో చేపట్టబోయే పారిశుద్ధ్య ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బిల్‌గేట్స్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో బిల్‌గేట్స్ భాగస్వామ్యంలో పాలుపంచుకుంటామన్నారు. పారిశుద్ద్యంపై అవగాహన పెంచేందుకు చర్యలు చేపడతామని వెంకయ్య నాయుడు తెలిపారు. మంత్రిత్వ శాఖలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని బిల్‌గేట్స్ తెలిపారు. అంతకు ముందు బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్.... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.