
దీపావళి.. భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే సంస్థలు తమ ఉద్యోగులకు బహామతులు ,బోనస్‌లు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఓ యజమాని మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్‌ని తన ఉద్యోగులకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్‌లోని శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్టర్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల కంపెనీల్లో ఒకటి.
దీని యజమాని గోవింద్ ధోలాకియా. ఆయన గతంలో కార్లు, ఇళ్లు అంటూ తన ఉద్యోగులకు అనేక బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బహామతులను ఇవ్వదలచుకున్నాడు. అయితే అది జీవితాంతం గుర్తుండడంతో పాటు వాళ్లకు ఉపయోగపడేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారి కంపెనీలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులకు దీపావళి కానుకగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను అందించారు. దీని ద్వారా వారికి జీవితకాలం కరెంట్ ఉచితంగా అందించాలనుకున్నాడు. ఇప్పటికే 550 మంది ఉద్యోగులకు ఈ గిఫ్ట్ అందించినట్లు మిగిలిన వాళ్లకి కూడా అతి త్వరలో అందజేయనన్నారు.
పర్యావరణానికి కూడా ఇది బోనస్!
ధోలికియా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్ల కేవలం ఉద్యోగులు లాభపడటమే కాక.. పర్యావరణానికి సైతం మేలు జరగుతంది. ఇంతకు ముందు కూడా SRK నాలెడ్జ్ ఫౌండేషన్ ద్వారా SRK ఎక్స్‌పోర్టర్ సాంఘిక సంక్షేమ విభాగం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు.
చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ!
Comments
Please login to add a commentAdd a comment