దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్‌లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.
కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.
ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా
ఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment