బ్రిటీష్‌ ప్రధానికి భారత్‌ దీపావళి కానుక | EAM S Jaishankar Meets UK PM Rishi Sunak On Diwali, Gifts Him Bat Signed By Virat Kohli - Sakshi
Sakshi News home page

Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్‌ ప్రధానికి భారత్‌ దీపావళి కానుక

Published Mon, Nov 13 2023 7:31 AM | Last Updated on Mon, Nov 13 2023 10:31 AM

Jaishankar met British pm Rishi Sunak Gifted a Bat - Sakshi

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్‌కు  వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. 

జై శంకర్‌ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు  ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్‌కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్‌ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. 
ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement