Pharmaceutical Company
-
అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు
దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్‌లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటాఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది. -
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
ఐపీవోకు బ్లూజెట్ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ కంపెనీ బ్లూ జెట్ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు అక్షయ్ భన్సారీలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా దాదాపు 2.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా రూ. రూ. 1,800– 2,100 కోట్ల మధ్య సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై కంపెనీ బ్లూ జెట్ ప్రధానంగా స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ సంబంధ ఇన్‌గ్రెడియంట్స్, ఇంటర్మీడియట్లను రూపొందిస్తోంది. ఇన్నోవేటర్ ఫార్మాస్యూటికల్, మల్టీనేషనల్ జనరిక్ కంపెనీలకు ప్రత్యేకతరహా ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. గతేడాది(2021–22) ఆదాయం 37 శాతం ఎగసి రూ. 683 కోట్లను అధిగమించింది. నికర లాభం 34 శాతం జంప్‌చేసి దాదాపు రూ. 182 కోట్లకు చేరింది. కంపెనీ రుణరహితంకాగా.. మహారాష్ట్రలోని షహద్, అంబర్నాథ్, మహద్లలో మూడు ప్లాంట్లను కలిగి ఉంది. -
డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు!
డోలో-650 టాబ్లెట్ అంటే తెలియని వాళ్లు ఉండరు. ఎందుకంటే కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న సమయంలో ప్రజలకు డోలో కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా ఆదాయపు పన్నుల శాఖ జరిపిన సోదాల అనంతరం డోలో 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్‌పై ఆరోపణలు చేసింది. ఆ సంస్థ అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది. మైక్రోల్యాబ్స్ వారి ఔషదాల ప్రచారం కోసం వైద్య నిపుణులు, డాక్టర్లకు సుమారు రూ.1000 కోట్లను బహుమతుల రూపంలో, వాళ్ల టూర్ల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపింది. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కంపెనీ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సంస్థకు చెందిన 36 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. సోదాల అనంతరం.. కొన్ని డ్యాకుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో ఉన్న పలు సాక్ష్యాలు పరిశీలించగా మైక్రోల్యాబ్స్ సంస్థ అవినీతికి పాల్పడినట్లు తేలింది. వీటితో పాటు రూ. 1.20 కోట్లు లెక్కల్లో చూపించని నగదు, రూ. 1.40 కోట్ల బంగారం, నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 2022 నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే! -
ఇంజెక్టబుల్స్ సామర్థ్యం పెంచుతున్న అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్‌లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్‌కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్‌లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు. -
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది. విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం. విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది. -
భారత్, చైనా సహకారం తప్పనిసరి
ప్రపంచంలో పెద్ద ఔషధ కంపెనీలన్నీ అమెరికా, యూరప్‌కు చెందినవే. ఇందులో టాప్ ఐదు: ఫైజర్ (యూఎస్), రాష్, నొవార్టిస్ (రెండూ స్విట్జర్లాండ్), మెర్క్ (యూఎస్), గ్లాక్సోస్మిత్‌క్లైన్ (యూకే). ఈ కంపెనీలు కూడా ఇతర దేశాల సరఫరా గొలుసు మీద ఆధారపడే పని చేస్తాయి. ముఖ్యంగా క్రియాశీల పదార్థాలు(ఏపీఐ), తుది ఔషధాల తయారీ విషయంలో ఇండియా, చైనా కీలకపాత్ర పోషిస్తు న్నాయి. కోవిడ్–19కు వ్యాక్సిన్‌గానీ, మందుగానీ కనుక్కోవడం ఈ సరఫరా వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుత ఔషధంగా అభివర్ణించిన హైడ్రాక్సిక్లోరోక్విన్ కావచ్చు; తీవ్రమైన కోవిడ్–19 కేసుల్లో ఉపయోగి స్తున్న యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ కావొచ్చు; లేదా భవిష్యత్ వ్యాక్సిన్ కావొచ్చు; మొత్తంగా ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక ఆరోగ్యం ఈ ఔషధ కంపెనీల మీద ఆధారపడివుంది. అందునా ఈ మహమ్మారిని అరికట్టడంలో ఇండియా, చైనా సహకారం తప్పనిసరి. క్రియాశీల ఔషధ పదార్థాలను ఉత్పత్తి చేయడం (ఏపీఐ), వాటిని రోగి వాడుకునే విధంగా మాత్ర, సిరప్, ఆయింట్మెంట్ తదితర రూపాల్లోకి తేవడ మనే రెండు దశలుంటాయి ఔషధ తయారీలో. అమెరికా దిగుమతి చేసుకునే ఏపీఐల్లో చైనా, ఇండియా ఉమ్మడి వాటా 75–80 శాతం. వీటిని 1990ల మధ్య వరకూ అమెరికా, యూరప్, జపాన్ 90 శాతం వాటి కవే తయారు చేసుకునేవి. కానీ ప్రపంచీకరణ ఈ స్థితిని మార్చేసింది. పరిమాణం పరంగా ఔషధ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. జెనరిక్ మందుల ఎగుమతుల్లో ప్రపంచంలో 20 శాతం వాటా ఇండియాదే. మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ సంస్థ ఇండియాను అభివృద్ధి చెందు తున్న ప్రపంచానికి ఔషధాగారం అని అభివర్ణిం చింది. సిప్లా, అరబిందో, ఎమ్క్యూర్, హెటిరో, మక్లౌడ్స్, మాట్రిక్స్, రాన్‌బాక్సీ, స్రై్టడ్స్ లాంటి భారత కంపెనీలు– ఎయిడ్స్, టీబీ, మలేరియా మీద పోరా టానికిగానూ గ్లోబల్ ఫండ్ కోసం యాంటీ రెట్రో వైరల్, యాంటీ మలేరియల్ ఔషధాల్ని సరఫరా చేయడంలో బ్రహ్మాండమైన పాత్రను పోషిస్తున్నాయి. అలాగే ఆర్థిక రూపేణా వ్యాక్సిన్ తయారీలో జీఎస్కే, సనోఫి, మెర్క్, ఫైజర్ పెద్ద కంపెనీలు అయివుం డొచ్చుగానీ, పరిమాణం పరంగా అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఇండియాకు చెందిన సీరమ్ ఇన్స్టి ట్యూట్. పుణేలో ఉన్న ఈ కంపెనీ యేటా 150 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 80 శాతం ఎగు మతి అవుతాయి. యునిసెఫ్‌కు అతిపెద్ద వ్యాక్సిన్ సరఫరాదారు ఇండియానే. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన డీపీటీ, టీబీ వ్యాక్సిన్లలో 65 శాతం, మశూచి వ్యాక్సిన్లలో 90 శాతం ఇండియా నుంచే వస్తున్నాయి. అయితే, ఔషధ పరిశ్రమ ప్రపంచీకరణకు గురయ్యాక, సరఫరా గొలుసు మీద అతిగా ఆధార పడటం భయాందోళనల్ని కలిగిస్తోంది. అమెరికాలో చివరి ఆస్పిరిన్ తయారీ పరిశ్రమ 2002లో, చివరి పారాసిటమాల్ తయారీ పరిశ్రమ యూరప్‌లో 2008లో మూతపడ్డాయి. ‘ఏపీఐ’ల విషయంలో ప్రస్తుతం ఇండియా కూడా చైనా మీద 70 శాతం ఆధారపడివుండటం భారత ప్రభుత్వం పట్టించు కోవాల్సిన అంశం. బాగా తెలిసిన పారాసిటమాల్, ఎమోగ్జిసిలిన్, ఐబూప్రొఫేన్ లాంటి వాటికైతే నూరు శాతం చైనా మీద ఆధారపడివుంది ఇండియా. కోవిడ్ లాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఇతర దేశాల అవసరాలను తీర్చడం కన్నా చైనా తన నిల్వల్ని తన పౌరుల కోసం వాడుకోవడం సహజం. ఈ అతి కేంద్రీ కరణ ప్రపంచీకరణ, జాతీయవాదాల మధ్య ఘర్ష ణకు కారణమవుతోంది. ఏపీఐల విషయంలో చైనా మీద ఆధారపడటాన్ని భారత ప్రభుత్వం తరచి చూస్తోంది. అతి పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఔష ధాల విషయంలో ఈ ఆధారపడటాన్ని నివారించడా నికిగానూ మార్చి 21న మూడు ఔషధ పార్కులు,53 ప్రాధాన్యమున్న ఏపీఐల తయారీ కేంద్రాలకు సహ కారం అందించడం కోసం 14 కోట్ల అమెరికన్ డాల ర్లతో పథకం ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన మైలాన్ సంస్థ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉత్పత్తిలో 70 శాతం ఇండియాదే. ఈ ఔషధ పనితనం మీద చర్చలు సాగుతున్నప్పటికీ, ఒకటి మాత్రం నిజం. ఏ కోవిడ్ ఔషధ తయారీలో నైనా అది ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి కోసమైనా, తక్కువ ఖర్చుతో చేయడం కోసమైనా ఇండియా, చైనా భాగస్వామ్యం తప్పనిసరి. వ్యాసకర్త: రోరీ హార్నర్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ సీనియర్ లెక్చరర్ -
రూ.300 కోట్లతో బీఈ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ బయాలాజికల్–ఇ (బీఈ) లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్ వ్యాలీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. 2017 బయో ఆసియా కార్యక్రమం సందర్భంగా ఈ ప్లాంటుకు పునాది రాయి వేశామని.. 2020 బయో ఆసియాలో ప్రారంభోత్సవం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. కాగా, 29 ఎకరాల విస్తీర్ణంలోని ఈ తయారీ కేంద్రానికి బీఈ సుమారు రూ.300 కోట్లు వెచ్చిం చింది. కొత్త ఫెసిలిటీ ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ఎండీ మహిమ దాట్ల వెల్లడించారు. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఇటలీకి చెందిన జీఎస్కే వ్యాక్సిన్స్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. సింజీన్ ఆర్అండ్డీ కూడా.. కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న సింజీన్ ఇంటర్నేషనల్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించారు. తొలి దశలో 52,000 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. 2020 చివరికల్లా 94,000 చ.అ. విస్తీర్ణంలో సిద్ధం కానున్న ఈ సెంటర్‌కు రూ.167 కోట్లు వెచ్చిస్తున్నట్టు సింజీన్ సీఈవో జోనాథన్ హంట్ వెల్లడించారు. సైంటిస్టుల సంఖ్య ప్రస్తుతమున్న 150 నుంచి 270కి చేరనుంది. -
రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
వాషింగ్టన్: హాంకాంగ్‌కు చెందిన ఓ 24ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించాడు. వివరాల్లోకి వెళ్తే సైనో బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీ పింగ్, చేంగ్ లింగ్ చెంగ్‌ల కుమారుడు ఎరిక్ త్సేకు కంపెనీలో ఐదవ వంతు మూలదన షేర్లను అంటే సుమారు 3.8బిలియన్ డాలర్ల రూపాయలు లభించాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫోర్బ్స్ ప్రకటించిన 550 అత్యంత ధనవంతుల జాబితాలో చోటు లభించడం విశేషం. అయితే, సంపన్న జాబితాలో ఇతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రఖ్యాత దర్శకుడు స్పీల్‌బర్గ్‌ల కంటే కూడా ముందు వరుసలోకి వచ్చేశాడు. ఎరిక్ త్సే సయోటల్‌లో జన్మించాడు. తన విద్యాభ్యాసాన్ని బీజింగ్, హాంగ్‌కాంగ్‌లో పూర్తి చేశాడు. ఇతడికి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కమిటీలో చోటు లభించింది. కాగా, సంవత్సరానికి ఐదు లక్షల డాలర్లను బోనస్‌గా పొందనుండడం విశేషం. మరోవైపు ఎరిక్ త్సేకు కుబేరుల జాబితా పట్ల పెద్దగా ఆసక్తి లేదట. -
అమెరికా మార్కెట్.. సవాలే!
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు ధరల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ... సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వృద్ధి అవకాశాలు ఇకముందు కూడా సవాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) ఆమోదం కొన్ని నెలలుగా మెరుగుపడింది. ప్రస్తుత తీరు ప్రకారం 2017–18 సంవత్సరంతో పోలిస్తే 2018–19లో ఏఎన్‌డీఏ ఆమోదాలు 38 శాతం పెరుగుతాయని ఐఐఎఫ్ఎల్ అనలిస్ట్ పేర్కొన్నారు. యూఎస్ఎఫ్డీఏ ఇకముందూ ఏఎన్‌డీఏల అనుమతుల వేగాన్ని పెంచనుందని అనలిస్టుల అంచనా. దీనివల్ల అమెరికా జనరిక్ మార్కెట్ వాతావరణం మెరుగుపడుతుందని, మొత్తం మీద జనరిక్స్ అనుమతులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మొదటి సారి (ప్రత్యేకమైన) జనరిక్స్ అనుమతులు పెరుగుతాయని అంచనా. భిన్నమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులు, బయోసిమిలర్ల పరంగా ఉన్న అవకాశాల వైపు కంపెనీలు చూస్తున్నాయని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కపాడియా తెలిపారు. పోటీ కంపెనీలతో పోలిస్తే కాంప్లెక్స్ ఉత్పత్తులు ఉన్న కంపెనీల పట్ల బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. వీటికి అధిక వ్యాల్యూషన్ ఇస్తున్నాయి. అమెరికా మార్కెట్లో ప్రత్యేక ఉత్పత్తులు సన్‌ఫార్మా పట్ల సానుకూలంగా ఉండేందుకు స్పెషాలిటీ ఉత్పత్తులే కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. ఆంకాలజీ ఔషధం యోన్సా, సోరియాసిస్ చికిత్సలో వినియోగించే ఇలుమ్యాలను 2018–19 మొదటి అర్ధ సంవత్సరంలో సన్ ఫార్మా అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. కంటి చికిత్సకు సంబంధించి గ్జెల్ప్రోస్ను మూడో త్రైమాసికంలో లాంచ్ చేసింది. అలాగే, ప్రస్తుత త్రైమాసికం (మార్చి ముగిసేలోపు)లో సీక్వాను విడుదల చేయనుంది. ఇక జనరిక్స్ పరంగా ఎక్కువగా ధరల ఒత్తిడి చవిచూడని దిగ్గజ కంపెనీల్లో అరబిందో ఫార్మా కూడా ఒకటి. ఏ ఉత్పత్తిపైనా ఎక్కువగా ఆధారపడి లేకపోవడం కంపెనీకి కలిసొచ్చిందన్నది విశ్లేషణ. పైగా ఇంజెక్టబుల్స్ వంటి పరిమిత పోటీ ఉన్న ఉత్పత్తులపైనే కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా సానుకూలించింది. దీనికి అదనంగా కొనుగోళ్ల ద్వారా వృద్ధి అవకాశాల పెంపుపై కంపెనీ దృష్టి సారించడం గమనార్హం. యూరోప్‌లో ఇటీవలే అపోటెక్స్ కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను అరబిందో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఎబిట్డాకు ఐదు రెట్లు, అమ్మకాలకు ఒక రెట్టు మాత్రమే ఖర్చు చేసి చౌకగా ఈ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. అమెరికాలో శాండజ్‌కు చెందిన డెర్మటాలజీ వ్యాపారాన్ని ఏకీకృతం చేసే పనిని కూడా చేపట్టింది. దీనివల్ల 2019–20లో కంపెనీ షేరువారీ ఆర్జన 15–20% పెరుగుతుందని ఎలారా క్యాపిటల్ అంచనా. అమెరికా వ్యాపారం బలంగా ఉండటం, యూరోపియన్ యూనియన్‌లో వృద్ధి చెందుతుండటం, ఆపరేటింగ్ మార్జిన్లను ప్రతికూలం నుంచి రెండంకెల లాభదాయకత దిశగా తీసుకెళ్లడం వంటివి అరబిందో వృద్ధి అవకాశాలను పెంచేవిగా విశ్లేషకుల అంచనా. ఇక లుపిన్ కూడా అమెరికా మార్కెట్లో వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్యావిస్ను 2015లోనే 880 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఓపియోడ్ ఔషధాల పరంగా 2018–19 ఆరంభంలో రూ.1,464 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. కొన్ని మాలిక్యూల్స్ పరంగా పనితీరు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ మాజీ సీఎఫ్‌వో రమేష్ స్వామినాథన్ తెలిపారు. -
సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్లదక్షిణాఫ్రికా రాండ్ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సిప్లా షేర్ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది. -
రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి జినోమ్ వ్యాలీలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఫెరింగ్ ఫార్మాసూటికల్ కంపెనీకి శనివారం ఆ సంస్థ సీఈఓ సురేశ్ పట్టతిల్తో కలసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. జినోమ్ వ్యాలీలో అనేక బయోటెక్ పరిశ్రమలు ఉన్నాయని, ఫెరింగ్ ఫార్మాసూటికల్స్‌ను ఇక్కడ నిర్మించడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు లార్స్ పీటర్ బ్రూన్స్, వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, సర్పంచ్ కిశోర్‌యాదవ్, ఎంపీటీసీ ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సిగలో ప్రతిష్టాత్మక సంస్థ
∙ ఫార్మా కోపియా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ∙ ముచ్చింతల్‌లో స్థల పరిశీలన.. ∙ రూ.200 కోట్లు కేటాయింపు ∙ రాష్ట్ర ప్రభుత్వం లేఖతో అనుమతి ఇచ్చిన కేంద్రం ∙ దేశంలోనే తొలి అకాడమీ ఇది ∙ ఔషధరంగ సంస్థ అభివృద్ధికి ఉపయోగం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. జాతీయ ఫార్మా కోపియా కమిషన్ ప్రాంతీయ కార్యాలయం జిల్లాలో ఏర్పడనుంది. ఔషధరంగ అభివృద్ధికి ఈ సంస్థ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర సర్కారు సానుకూలంగా స్పందించింది. ‘జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ, జాతీయ ఫార్మా కోపియా కమిషన్ రెండో కార్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు సంస్థల స్థాపనకు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించిన కేంద్రం... తక్షణమే భూములను కేటాయించాలని కోరింది. జాతీయ డ్రగ్స్ కంట్రోల్ అకాడమీ మందుల నియంత్రణ విధానాలు, ప్రమాణాలు, సంస్కరణలపై అధ్యయనం చేయడమేగాకుండా.. బోధనలు పర్యవేక్షిస్తోంది. దేశంలోనే తొలి అకాడమీ ఇదే. ఈ రంగంలో కోర్సుల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఫార్మా కోపియా కమిషన్ (ఐపీ) ప్రధాన విధి మందుల గుర్తింపు, తయారీ, ప్రభావం, ప్రమాణాలు, మోతాదు, నిల్వ తదితర అంశాలపై నిరంతరం మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఈ సంస్థ నిబంధనల ప్రకారమే మందులను తయారు చేయాల్సి ఉంటుంది. జీవరాశికి సంబంధించిన ప్రతి మందు ఐపీ పొందుపరిచిన నియామవళికి అనుగుణంగానే ఉత్పత్తి జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫార్మారంగంలో కీలక భూమిక పోషించే ఐపీ సంస్థను ముచ్చింతల్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లాలో సుమారు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధనగరిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలకు జిల్లాకు తరలిరావడం ఫార్మా రంగానికి మరింత ఊపునిస్తోంది. ఐపీ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే మందుల తయారీ నాణ్యతా ప్రమాణాలను కూడా పరిశీలించనుంది. -
నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ కంపెనీ అమెరికాకు చెందిన సెలెక్సిస్ ఫార్మాస్యూటికల్స్ కార్ప్‌ను కొనుగోలు చేసింది. ఈ అమెరికా కంపెనీని 66.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్లు నొవార్టిస్ తెలిపింది. ఆఫ్రికా ప్రజల్లో సాధారణంగా వచ్చే రక్తహీనత చికిత్సలో ఉపయోగించే సెల్జీ1 ఔషధాన్ని సెలెక్సిస్ పార్మా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి లక్షలాది ప్రజలను బాధిస్తోందని, కానీ ఈ వ్యాధి వల్ల తలెత్తే నొప్పులను నివారించే ఔషధాలు తక్కువగా ఉన్నాయని, అందుకే ఈ కంపెనీని కొనుగోలు చేశామని నొవార్టిస్ సీఈఓ(ఆంకాలజీ) బ్రూనో స్ట్రింజిని పేర్కొన్నారు. -
బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు..
♦ గడిచిన నాలుగు నెలల్లో మూడు డీల్స్ ♦ జాబితాలో సన్, స్ట్రైడ్స్, పిరమాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా విదేశాల్లో విస్తరణ కోసం కంపెనీల కొనుగోలు లేదా జనరిక్స్ మార్గాన్ని ఎంచుకునే దేశీ ఫార్మా కంపెనీలు ప్రస్తుతం రూటు మారుస్తున్నాయి. పేరొందిన ఔషధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ మొదలుకుని ఇటీవలి సన్ ఫార్మా, స్ట్రైడ్స్ షసన్ దాకా చాలా మటుకు దేశీ సంస్థలు గత కొన్నాళ్లుగా ఈ తరహా డీల్స్ కుదుర్చుకున్నాయి. ఫార్మా దిగ్గజం సన్ .. స్విట్జర్లాండ్ ఫార్మా సంస్థ నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. దీని విలువ దాదాపు రూ. 1,900 కోట్లు (సుమారు 293 మిలియన్ డాలర్లు). వివిధ చికిత్సల్లో ఉపయోగపడే ఈ బ్రాండ్స్ అన్నింటి వార్షికాదాయాలు 160 మిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటాయి. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద ఔషధ మార్కెట్ కావడంతో పాటు అత్యధికంగా నియంత్రణలు కూడా ఉండే జపాన్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి సన్ ఫార్మాకు ఈ డీల్ ఉపయోగపడనుంది. జపాన్ ఔషధ మార్కెట్ ఏకంగా 73 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా. 1 లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో జపాన్‌కు దాదాపు 7 శాతం వాటా ఉంటుంది. ఇక మరోవైపు, స్వీడన్‌కు చెందిన మోబర్గ్ ఫార్మా నుంచి స్ట్రైడ్స్ షసన్ .. జాయింట్ఫ్లెక్స్, ఫెర్గాన్, వ్యాంక్విష్ అనే మూడు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం 10.4 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మోబర్గ్ బ్రాండ్ల కొనుగోలు.. అమెరికా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) ఔషధాల విభాగంలో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తోడ్పడగలదని స్ట్రైడ్స్ పేర్కొంది. దేశీయంగాను.. ఇలా కొన్ని ఫార్మా సంస్థలు విదేశీ మార్కెట్‌పై కసరత్తు చేస్తుండగా.. మరికొన్ని సంస్థలు దేశీయంగాను బ్రాండ్ల కొనుగోలుపై దృష్టి పెట్టాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కొన్నాళ్ల క్రితం బెల్జియం బయోఫార్మా సంస్థ యూసీబీ ఎస్ఏకి చెందిన కొన్ని ఉత్పత్తులను దాదాపు రూ. 800 కోట్లకు కొనుగోలు చేసింది. వాటిని భారత్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో విక్రయించే హక్కులను దక్కించుకుంది. అటారాక్స్, జెర్టైక్, జైజాల్ వంటివి వీటిలో ఉన్నాయి. డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇవి తోడ్పడగలవని డాక్టర్ రెడ్డీస్ వర్గాలు పేర్కొన్నాయి. అంతక్రితమే నొవార్టిస్ నుంచి హాబిట్రోల్ అనే ఓటీసీ బ్రాండ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొనుగోలు చేసింది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గతేడాది డిసెంబర్లో ఎంఎస్డీ సంస్థ నుంచి అయిదు బ్రాండ్స్‌ను (న్యాచురోలాక్స్, ల్యాక్టోబాసిల్ మొదలైనవి) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 92 కోట్లు. దేశీయంగా పేరొందిన ఈ బ్రాండ్స్‌ను ఓటీసీ మార్గంలో విక్రయించాలన్నది పిరమాల్ యోచన. భారత ఓటీసీ మార్కెట్ రూ. 15,000 కోట్లు కాగా ఏటా 14 శాతం మేర వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం పిరమాల్‌కి చెందిన ఆరు బ్రాండ్లు టాప్ 100 ఓటీసీల్లో ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకు ముందే బేబీకేర్ బ్రాండ్ లిటిల్స్ను కూడా పిరమాల్ కొనుగోలు చేసింది. -
ఆబ్సెంట్ టీచర్...’
‘అనుపమ’ ‘ప్రెజెంట్ టీచర్’ ‘స్రవంతి’ ‘ప్రెజెంట్ టీచర్’ ‘లావణ్య’ ‘ఆబ్సెంట్ టీచర్’ ‘ఆబ్సెంటా... ఈరోజు యూనిట్ టెస్ట్ ఉంది కదా! ఎందుకు రాలేదు?’ ‘అదీ.....’ ‘బాగా చదువుతుంది కదా! ఎందుకు రాలేదు?’ ‘టీచర్, అదీ... ...’ ‘ఊ... అర్థమయిందిలే...!’ మరి మీకు అర్థమయిందా? అర్థమైతే ఈ వ్యవస్థను గోడకుర్చీ వేయిస్తారు. అమెరికాలోని బోస్టన్ సిటీ... కొలోనియల్ పాత్... హౌస్ నంబర్ 2. ఆ ఇంటి యజమాని మాధవ్. ఆస్ట్రోజెనెక్ డెరైక్టర్. ఆయన భార్య రాధిక దేవలరాజ. స్థానిక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగిని. వీరిద్దరి సంతానం సింధూర. ఎనిమిదవ తరగతిలో వుండగా కూతురు సింధూరని ఇండియాకి తీసుకొచ్చారు ఈ దంపతులు. అమెరికా నుంచి ఓ కొత్త ప్రపంచంలోకి అడుగిడిన సింధూర... మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్తో నెల రోజులు గడిపింది. అదే ఆమెలో ఓ సరికొత్త భావనకి పునాది వేసింది. ఎవరికీ పట్టని, ఎవ్వరూ ఆలోచించని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసింది. అక్కడ చూసిన దృశ్యం! తల్లి రాధిక, పెద్దమ్మ డాక్టర్ పద్మజల నుంచి సేవాదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న సింధూర మూడేళ్ల క్రితం.. తిరుపతిలోని మదర్‌థెరిస్సా బాలికల ఆశ్రమంలోని చిన్నారులకు సేవచేస్తూ తన వేసవి సెలవులను గడపాలన్న ఉద్దేశంతో ఇండియాకి వచ్చింది. ఆ ఆశ్రమంలో.. తన వయసే వున్న బాలికలను రుతుస్రావ సమయంలో ప్రతినెలా మూడు రోజులపాటు బాత్రూమ్లో ఉంచడం చూసి పద్నాలుగేళ్ల సింధూర గుండె తరుక్కుపోయింది. ఆశ్రమం నడిపే వారికి నిబద్ధత వుంది. కానీ నెల నెలా శానిటరీ నాప్కిన్స్ని కొని వాడే ఆర్థిక పరిస్థితి లేదు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండమని ఆ చిన్నారులకు చెప్పినా అర్థంకాదు. అందుకే ప్రతినెలా పీరియడ్స్ సమయంలో మూడు రోజులపాటు అమ్మాయిలను బాత్రూముల్లో ఉంచేవారు. ఇది చూసి చలించిపోయింది సింధూర. కర్తవ్యాన్ని బోధించింది ఈ విషయాన్ని తల్లితో షేర్ చేసుకుంది సింధూర. ఇండియాలో అత్యధిక శాతం మంది అమ్మాయిలకు శానిటరీ నాప్కిన్స్ వాడే స్థోమత ఉండదని, అసలు అలాంటివి ఉంటాయని కూడా చాలా మందికి తెలియదని అమ్మ రాధిక చెప్పిన మాటలు విన్నాక తన కర్తవ్యం బోధపడింది సింధూరకు. అమెరికా వెళ్లగానే తొమ్మిదవ తరగతిలో పూర్తి చేయాల్సిన హెచ్ఐవి సంబంధిత ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేయడమే కాదు, రీజనల్ లెవల్లో సెకండ్ ప్రైజ్నూ గెలుచుకుంది. ఆ ప్రైజ్ మనీని శానిటరీ నాప్కిన్స్ కోసం వెచ్చించింది. టై బోస్టన్ బిజినెస్ కాంపిటీషన్స్‌లో పాల్గొని ఆ డబ్బుని కూడా శానిటరీ నాప్కిన్స్ని కొనేందుకే ఖర్చుపెట్టింది. హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దమ్మ సహకారంతో శానిటరీ నాప్కిన్స్ కొని ఇండియాలోని అనాథాశ్రమాలకు పంచడం మొదలు పెట్టింది. గత మూడేళ్లుగా వేసవి సెలవల్లో ఇండియా వస్తూ అనాథ బాలికలతోనే గడుపుతున్న సింధూర... మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో ైెహ దరాబాద్, అహ్మదాబాద్, తిరుపతిలో ఉన్న బాలికల అనాథాశ్రమాలకు శానిటరీ నాప్కిన్స్ పంచుతూ బాలికలకు తమ శరీరాలపైన ఉన్న హక్కులను బోధిస్తోంది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు అనాథ బాలల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తోంది. మలినమనే భావన తొలగాలి లోదుస్తులు ఆరేయటం దగ్గరే భారతదేశంలో స్త్రీ పురుష వివక్ష మొదలవుతుందన్న ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శోభాడే మాటలు అక్షర సత్యాలంటోంది పదిహేడేళ్ల సింధూర. ‘అమ్మాయిలు వాడే ఇన్నర్స్ని బహిరంగంగా ఆరేయడం ఇక్కడ నేరం. ఆ మాటకొస్తే మహిళలంటే మురికి... మహిళలంటే మలినం... ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీలు కొన్ని చోట్లకీ, కొన్ని సందర్భాలకీ మాత్రమే పరిమితం. ఆ మూడు రోజులు సృష్టికి ఎంత సహజమో, అవే మూడు రోజులు ఆడపిల్లల జీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నాయి. ఆ సమయంలో వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలన్న ఆలోచన, అవగాహన మన సమాజానికి ఎందుకు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ మూడు రోజులూ సమాజానికి ఆవల... వెలివేయబడ్డ అమ్మాయిలకు తామేంటో తెలియజెప్పే మహత్ప్రయత్నంలో ముందుకు సాగుతోంది. నిండు మనసుతో తన ఈడు పిల్లలను గుండెలకు హత్తుకుంటోంది. స్త్రీల శరీరంలో సహజాతి సహజంగా జరిగే ప్రక్రియను పాపమనీ, మలినమనీ స్త్రీలను వెలివేయడం దుర్మార్గమనీ నినదిస్తోంది. అందరికీ నాప్కిన్స్... అదే లక్ష్యం ఇంట్లో తయారు చేసిన నాప్కిన్స్ను వాడటం, అపరిశుభ్రమైన పద్ధతులను ఆచరించడం, లో దుస్తులకు ఎండ కూడా తగలకుండా ఎవరికీ కనపడని చోట్లల్లో ఆరేయడం కారణంగా వ్యాధులకు గురవుతున్న వేలాది మంది బాలికలను చైతన్యపరిచి, వారిని ఆనారోగ్యాల నుండి కాపాడడం సింధూర లక్ష్యం. ట్వెల్త్ గ్రేడ్ చదువుతోన్న ఆమె మన దేశంలోని చిన్నారులందరూ చింకి పేలికలను వదిలి ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్స్ వాడేరోజు రావాలని కోరుకుంటోంది. తన పెద్దమ్మతో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచాలనుకుంటోంది. ‘భారతదేశంలోని ప్రతి బాలికకు ఒక్కొక్కరికి యేడాది అంతా శానిటరీ నాప్కిన్స్ అందించేందుకు కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని సేకరించడం అంత కష్టం కూడా కాదు. స్త్రీల హక్కులను, సమస్య తీవ్రతని, పాలకులు, సమాజం గుర్తించాలంతే’ అంటోంది సింధూర. - అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి ఆ రెండు కారణాలతోనే... భారతదేశంలోని బాలికల్లో 70.2 శాతం మంది పదవ తరగతి పూర్తి కాకుండానే డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంద మంది బాలికలు ఒకటవ తరగతిలో నమోదు చేయించుకుంటే అందులో కేవలం ఒకే ఒక్క బాలిక 12వ తరగతికి చేరుకోగలుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 14 మంది మాత్రమే ఇంటర్‌కి చేరగలుగుతున్నారు. భారత దేశంలో బాలికల డ్రాపౌట్స్ సంఖ్య బాలుర కంటే రెట్టింపుగా వుంది. బాలికల డ్రాపౌట్స్ కి కుటుంబ ఒత్తిడి, స్కూల్లో టాయ్‌లెట్స్ లేకపోవడం ప్రధానమైన రెండు కారణాలు. 2014 సెప్టెంబర్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (ఖీఐ) ఆధ్వర్యంలోని వరల్డ్ ఇండియా గర్ల్స్ ఆరు మంది సభ్యుల కమిటీ ప్రభుత్వానికి నివేదించిన లెక్కలివి. గర్భధారణ కష్టమయ్యే ప్రమాదం ఒకే ప్యాడ్‌ని పదే పదే వాడటం, దానిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అనేక రకాల ఇన్ఫ్క్షన్స్ సోకుతాయి. ఈ ఇన్ఫెక్షన్స్ గర్భసంచిలోకీ పాకి గర్భధారణ కష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. నడుంనొప్పి, కడుపునొప్పీ రావచ్చు. ప్రభుత్వం తక్కువ ధరకి శానిటరీ నాప్కిన్స్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంచగలిగితే వారి ఆరోగ్యానికి ఎంతో మేలుచేసినట్టే. - డాక్టర్ శోభ, గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్ వెనకబడే పరిస్థితి ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బాలికలకే ఈ బాధలు! హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల పీరియడ్స్ సమయంలో చిరాగ్గా ఉంటుంది. దీనికి అపరిశుభ్రత, అననుకూల వాతావరణం తోడైతే కోపం, చిరాకు మరింత పెరిగికాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఈ కారణంగా నలుగురిలో కలవలేరు. పాఠశాలకు వెళ్లలేరు. తద్వారా చదువులో వెనకబడే పరిస్థితి వస్తుంది. - ఎస్.ఆర్.ఆర్.వై శ్రీనివాస్, సైకియాట్రిస్ట్ లేడీ టీచర్‌కు బాధ్యత అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న పిల్లలు ఒక్కసారిగా మూడీగా అయిపోయి ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడుగుతారు. వారి వయసును బట్టి విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఒక లేడీ టీచర్‌కి వాళ్ల బాధ్యతను అప్పజెబుతాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం శానిటరీ నాప్కిన్స్ కూడా పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. కానీ యేడాది నుంచి మాకు ప్యాడ్స్ రావడం బంద్ అయిపోయింది. - పల్లె అనంతరెడ్డి, ప్రిన్సిపల్, మండలపరిషత్ హైస్కూల్, కొండాపూర్ -
జీవీకే బయోతో
స్వీడన్ కంపెనీ జట్టు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషదాల పరిశోధనలో జీవికే బయోతో కలిసి పనిచేయడానికి స్వీడన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మెడ్విర్ ముందుకొచ్చింది. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధులు, క్యాన్సర్ చికిత్స పరిశోధనలో మెడ్విర్కి మంచి పట్టుంది. కొద్ది నెలల క్రితం జీవీకే బయో పరిశోధన నివేదికలపై యూరోపియన్ మెడిసెన్స్ ఏజెన్సీ అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తొలిసారిగా ఒక విదేశీ కంపెనీ కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. -
‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం
- హైకోర్టు తీర్పు నిలుపుదలకు నిరాకరణ - ‘బీఈ’ వివాద పరిష్కార బాధ్యతలు పెద్ద మనుషులకు - ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ (బీఈ) యాజమాన్యపు హక్కు విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. కంపెనీ డెరైక్టర్లుగా ముగ్గురు కుమార్తెల నియామకం చెల్లదని, 81 శాతం వాటాల బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న ఈ వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మేలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌లకు అప్పగించింది. వీరు ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తర్వుల ప్రతి అందుకున్న నాటి నుంచి ఆరు వారాల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ నాగప్పలతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. బీఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్‌రాజు దాట్ల ఇటీవల మరణించడంతో, ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇది హైకోర్టుకు చేరడంతో, సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. డెరైక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమల నియామకం, 81 శాతం వాటాల బదలాయింపు చెల్లదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిమ, పూర్ణిమలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను గత వారం జస్టిస్ గోపాలగౌడ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వివాద పరిష్కార బాధ్యతలను మధ్యవర్తులకు అప్పగించింది. -
తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది
81 శాతం వాటాల బదిలీ చెల్లదు బయోలాజికల్- ఈ కంపెనీ కుటుంబ వివాదంపై హైకోర్టు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న బయోలాజికల్- ఈ (బీఈ) మార్గదర్శకుడి మరణంతో న్యాయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తల్లీకూతుళ్లు హద్దులు గీసుకుని చేస్తున్న ఈ యుద్ధంలో సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వారసులెవరనే విషయంపై కోర్టులో తల్లీ, కూతుళ్లు తమంతట తాముగా దోషులుగా నిలబడి, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ బయోలాజికల్- ఈ (బీఈ) కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిం ది. కంపెనీ డెరెక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమ చట్టబద్ధంగా నియమితులు కాలేదని తేల్చి చెప్పింది. బీఈ చైర్మన్, ఎండీ విజయకుమార్ దాట్ల పేరుతో ఉన్న 81 శాతం వాటాల బదిలీ చెల్లదని ప్రకటించింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి రేణుక దాట్ల, కుమార్తెలు పూర్ణిమ, ఇందిరా, మహిమ.. వివాదాలను పక్కనపెట్టాలని ఆదేశించింది. మూడో వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశమిస్తే, కంపెనీ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిం చింది. తాత్కాలిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లుగా రేణుక, ఆమె ముగ్గురు కుమార్తెలను నియమించిన కోర్టు, వీరిలో రేణుక ఈడీగా, మిగిలినవారు డెరైక్టర్లుగా ఉంటారని తెలిపింది. వారసులెవరనే విషయంపై సివిల్ కోర్టులో ఉన్న వివాదం తేలేంత వరకు ఆయనకున్న 81శాతం వాటాలను బోర్డు ఎవరికీ బదలాయించరాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... బీఈ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ దాట్ల విజయకుమార్‌రాజు ఇటీవల మరణించారు. ఆయన మృతితో ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇదే సమయంలో ముగ్గురు కుమార్తెలు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. విజయకుమార్ రాజు పేరు మీద ఉన్న 81 శాతం వాటాను ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరున బదలాయించుకున్నారు. వీటన్నింటిపై విజయకుమార్‌రాజు సతీమణి రేణుక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, ఇటీవల తీర్పు వెలువరిస్తూ, కంపెనీ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ తల్లీ, కూతుళ్లకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణుక మేనేజింగ్ డెరైక్టర్‌గా, ఏకాభిప్రాయంతో ఈ బోర్డు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోర్డు డెరైక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, కంపెనీ లా బోర్డును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని తెలిపారు. కంపెనీ లా బోర్డులో ఉన్న పిటిషన్‌పై నిర్ణయం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక బోర్డు కొనసాగుతుందని, సివిల్ కోర్టులో వివాదం తేలేంత వరకు తమ వద్ద ఉన్న పిటిషన్‌ను కంపెనీ లా బోర్డు అలానే పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు.