డోలో-650 టాబ్లెట్ అంటే తెలియని వాళ్లు ఉండరు. ఎందుకంటే కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న సమయంలో ప్రజలకు డోలో కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా ఆదాయపు పన్నుల శాఖ జరిపిన సోదాల అనంతరం డోలో 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్‌పై ఆరోపణలు చేసింది. ఆ సంస్థ అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది.
మైక్రోల్యాబ్స్ వారి ఔషదాల ప్రచారం కోసం వైద్య నిపుణులు, డాక్టర్లకు సుమారు రూ.1000 కోట్లను బహుమతుల రూపంలో, వాళ్ల టూర్‌ల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపింది. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కంపెనీ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సంస్థకు చెందిన 36 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. సోదాల అనంతరం.. కొన్ని డ్యాకుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో ఉన్న పలు సాక్ష్యాలు పరిశీలించగా మైక్రోల్యాబ్స్ సంస్థ అవినీతికి పాల్పడినట్లు తేలింది. వీటితో పాటు రూ. 1.20 కోట్లు లెక్కల్లో చూపించని నగదు, రూ. 1.40 కోట్ల బంగారం, నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment