Dolo 650
-
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదా? ప్రమాదమా?
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా? – సి. వెంకటలక్ష్మి, బిచ్కుంద ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్ టైప్, తీవ్రతను బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్(డోలో, కాల్పాల్, క్రోసిన్) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్ కిల్లర్స్ అంటే Morphine, Tramadol లాంటివి సూచిస్తారు. లేబర్ పెయిన్‌ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?) -
డోలో 650, రూ. వెయ్యికోట్ల ఫ్రీబీస్: ఐపీఏ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: డోలో-650 తయారీదారు మైక్రో ల్యాబ్ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల లంచాలు అందించిందన్న వార్త నిజం కాదా? దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) రిపోర్టు ఇదే తేల్చింది. వెయ్యికోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్ కాదని నేషనల్ ఫార్మా స్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)కి ఐపీఏ సమర్పించిన పరిశోధనా నివేదిక వెల్లడించింది. కంపెనీ వివరణలో సింగిల్ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టే. కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని నివేదించింది. ఒక సంవత్సరంలో (మైక్రో ల్యాబ్స్) 1000 కోట్ల ఖర్చు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేశారని ఐపీఏ పేర్కొంది. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లు, అందులో దాదాపు రూ. 2500 కోట్ల దేశీయ విక్రయాలు. గత నాలుగేళ్లలో దేశీయ విక్రయాలపై (ఏడాదికి ఏడాదికి అన్ని కార్యకలాపాలపై) సగటున రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో ఐపీఏ వెల్లడించింది. ఐపీఏ విచారణకు ప్రతిస్పందనగా మైక్రోల్యాబ్స్ అన్ని కార్యకలాపాలపై ఐదు సంవత్సరాల వ్యయాల రిపోర్టును అందించింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు, మార్కెటింగ్‌పై మొత్తం రూ. 186 కోట్లు వెచ్చించిందని, అందులో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఖర్చులకు రూ. 65 కోట్లు, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సేవలకు రూ. 67 కోట్లు, దాదాపు రూ. 53 కోట్లు వెచ్చించామని వివరించింది. అలాగే 2019-20లో కంపెనీ సేల్స్ అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం రూ.67 కోట్లు వెచ్చించింది. ఈ నివేదిక ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో డోలో 650పై చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి, 2021లో మొత్తం 1152 లక్షలు వెచ్చించింది. 22 విజువల్ యాడ్స్, లిటరేచర్ అండ్ ప్రింట్ ప్రమోషనల్ ఇన్పుట్లు, బ్రాండ్ రిమైండర్స్, ఫిజిషియన్ శాంపిల్స్, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సర్వీసెస్ కలిపి 2020-21లో ఈ ఖర్చు రూ. 712 లక్షలుగా ఉంది. డోలో650 సరైన మోతాదు అవునా కాదా, ధరల నియంత్రణలో ఉందా లేదా అనేదికూడా ఐపీఏ పరిశీలించింది. డోలో-650 ఎంజీ 2018లో ఇండియన్ ఫార్మకోపోయి ఆమోదించిందని తెలిపింది. ఇది జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో ఉందని స్పష్టం చేసింది. కాగా వైద్య సంఘాల ఫిర్యాదులను స్వీకరించిన ఎన్పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యుసిపిఎంపి) కింద దర్యాప్తు చేయాలని ఐపీఎను కోరింది. ఇందుకు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ టాబ్లెట్లను సిఫారసు చేసేందుకుగాను వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్న ఆరోపణలు, డోలో-650 మేకర్ మైక్రో ల్యాబ్స్ జూలైలో పన్ను ఎగవేత ఆరోపణలపై టాప్ మేనేజ్మెంట్ కార్యాలయాలు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది. -
అది అసాధ్యం.. డోలో 650 మేకర్ల కీలక ప్రకటన
ఢిల్లీ/బెంగళూరు: డోలో-650 ప్రమోషన్లో భాగంగా.. వైద్యులకు రూ. వెయ్యి కోట్ల ఉచితాలు పంచిందని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు, ఈ విషయంపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి పదిరోజుల గడువుతో నోటీసులు సైతం జారీ చేసింది. అయితే.. ఈ ఆరోపణలు నిరాధరమైనవంటూ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. కరోనా తారాస్థాయిలో ఉన్న సమయంలోనే డోలో అమ్మకాల ద్వారా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని, అలాంటిది వాటి ప్రమోషన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆరోపణలు రావడం విడ్డూరంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డోలో-650 అనేది NLEM (ధరల నియంత్రణ) పరిధిలోకే వస్తుంది. పైగా కేవలం కొవిడ్ ఏడాదిలోనే రూ. 350 కోట్ల బిజినెస్ జరిగితే.. అలాంటి బ్రాండ్ కోసం వెయ్యి కోట్ల రూపాయలతో మార్కెటింగ్ చేయడం అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు ప్రశ్నిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కేవలం డోలో-650 ట్యాబ్లెట్స్ మాత్రమే కాదని.. విటమిన్ ట్యాబ్లెట్స్ సైతం భారీగానే బిజినెస్ చేశాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే డోలో 650 ప్రమోషన్లో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయాల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎంజీ తయారీ కంపెనీ ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు విన్నవించింది. పారాసెటమాల్ నిర్దిష్ట సూత్రీకరణలు(certain formulations) 500 mgm నియంత్రణలో ఉన్నట్లుగా ధర నియంత్రణలో చూపిస్తుంది. కానీ, 650 mgm పారాసెటమాల్ కిందకు రాదు. కాబట్టి వారు ఎక్కువ ధరలకు మందులను అమ్మవచ్చు అనేది సదరు ఎన్జీవో ఆరోపణ. ఇక దీన్నొక తీవ్ర అంశంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా.. బెంచ్‌లో ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ సైతం తనకు కూడా కరోనా టైంలో వైద్యులు డోలో-650నే రిఫర్ చేయడాన్ని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Dolo-650ని సిఫార్సు చేస్తే.. చాలు!! -
Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకు సంజీవని ఔషధం ఇదేనంటూ తమ మాత్రను సూచించాలంటూ డోలో–650 ఎం.జీ. ట్యాబ్లెట్ల తయారీసంస్థ దేశవ్యాప్తంగా వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎం.జీ ఉత్పత్తిదారుల ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ సంస్థ ఔషధాలు రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. ఈ మేరకు సంస్థ తరఫు లాయర్లు సంజయ్ పారిఖ్, అపర్ణా భట్లు గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘ట్యాబ్లెట్ల 500 ఎం.జీ. పరిమాణం వరకు మార్కెట్ ధర నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకుమించిన ఎం.జీ అయితే ఆ ట్యాబ్లెట్ల తయారీదారుల ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారు. దీంతో అధిక లాభాలను మూటకట్టుకునేందుకు 650 ఎం.జీ డోస్ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారు’ అని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ డోస్ కాంబినేషన్ నిర్హేతుకమైనదని వాదించారు. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తూ పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. కోడ్ ఉన్నప్పటికీ దానికి స్వచ్ఛంద హోదా లేదా చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చట్టాలు రూపొందించాలని పార్లమెంటును ఆదేశించలేమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కోడ్‌కు చట్టబద్ధత వచ్చే వరకు ఔషధ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడానికి కోర్టు మార్గనిర్దేశనం చేయాలని పారిఖ్ కోరారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు పెరిగాయన్నారు. ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించిన ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని ధర్మాసనానికి తెలిపారు. ఫార్మా స్యూటికల్ రంగంలోని అవినీతి.. రోగుల ఆరోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపే ఘటనలు కోకొల్లలు ఉన్నాయని ఉదహరించారు. చదవండి: అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఇది తీవ్రమైన సమస్యే ఎఫ్ఎంఆర్ఏఐ లేవనెత్తిన అంశంపై జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించారు. ‘తనకు కోవిడ్ సోకినప్పుడు ఇదే సందర్భం ఎదురైంది. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పది రోజుల్లో స్పందన తెలపాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్‌ను కోర్టు ఆదేశించింది. తదనంతరం వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలన్న లాయర్ పారిఖ్‌కు సూచించింది. ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. మైక్రోల్యాబ్స్‌పై దాడులు కోవిడ్ కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన డోలో–650 ఎం.జీ ట్యాబ్లెట్ల తయారీదారు అయిన మైక్రో ల్యాబ్స్ సంబంధ కార్యాలయాల్లో ఇటీవల సీబీడీటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించారు. వైద్యులకు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు గుర్తించారు. -
డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్
సాక్షి,ముంబై: కోవిడ్ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్ మైక్రోల్యాబ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్ అండ్ స్పెషల్ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్ పద్ధతులపై కోడ్ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం, కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్సైట్ ప్రకారం మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు!
డోలో-650 టాబ్లెట్ అంటే తెలియని వాళ్లు ఉండరు. ఎందుకంటే కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న సమయంలో ప్రజలకు డోలో కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా ఆదాయపు పన్నుల శాఖ జరిపిన సోదాల అనంతరం డోలో 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్‌పై ఆరోపణలు చేసింది. ఆ సంస్థ అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది. మైక్రోల్యాబ్స్ వారి ఔషదాల ప్రచారం కోసం వైద్య నిపుణులు, డాక్టర్లకు సుమారు రూ.1000 కోట్లను బహుమతుల రూపంలో, వాళ్ల టూర్ల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపింది. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కంపెనీ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సంస్థకు చెందిన 36 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. సోదాల అనంతరం.. కొన్ని డ్యాకుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో ఉన్న పలు సాక్ష్యాలు పరిశీలించగా మైక్రోల్యాబ్స్ సంస్థ అవినీతికి పాల్పడినట్లు తేలింది. వీటితో పాటు రూ. 1.20 కోట్లు లెక్కల్లో చూపించని నగదు, రూ. 1.40 కోట్ల బంగారం, నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 2022 నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే! -
డోలో ట్యాబ్లెట్ అమ్మకంలో అక్రమమార్గాలు అనుసరించిన తయారీదారు
-
డోలో-650 కంపెనీపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు
బెంగళూరు: కోవిడ్-19సంక్షోభంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన డోలో-650 తయారీ సంస్థ మైక్రో లాబ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలతో మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ శాఖ బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా 200 మంది ఐటీ సిబ్బంది పాల్గనడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్స్ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 200 అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆదాయానికి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో సంస్థ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టినట్టు ఐటీ శాఖ. వెల్లడించింది. కాగా 2020లో కరోనా విజృంభణ కాలంనుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. జ్వరాన్ని నియంత్రించే డోలో-650 జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఫలితంగా అమ్మకాల్లో రికార్డుల్ని బ్రేక్ చేసింది. 350 కోట్ల టబ్లెట్ల విక్రయాలతోఏడాదిలో 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 1983లో కుటుంబ వ్యాపారాన్ని స్వీకరించిన సురానా ఫార్మా రంగంలో అనుభవజ్ఞుడు -
డోలో 650 సంచలనం.. సేల్స్‌తో సరికొత్త రికార్డు!
మన ఇంట్లో ఎవరికైన తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వస్తే వెంటనే మనందరికీ డోలో 650 గుర్తుకొస్తుంది ఇప్పుడు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా వాడేస్తునారు ప్రజలు. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన మెడిసిన్‌గా డోలో 650 ఆవిర్భవించింది. ఈ మహమ్మారి కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా ఈ డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతుంది. డోలో 650 అనేది ఒక ప్రసిద్ధ పెయిన్ కిల్లర్, ఇది దాదాపు ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి, జ్వరాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు!. 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి భారతదేశం యాంటీ ఫీవర్ ఔషధం డోలో 650లను 350 కోట్ల మాత్రలకు పైగా విక్రయించింది. ఈ మొత్తం 3.5 బిలియన్ మాత్రలను నిలువుగా పేర్చితే ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 6,000 రెట్లు ఎక్కువ ఎత్తు లేదా ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎత్తుకు 63,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గత రెండు సంవత్సరాలలో డోలో 1.5 సెం.మీ పొడవైన పారాసెటమాల్ టాబ్లెట్, క్రోసిన్ కంటే చాలా ఎక్కువ అమ్ముడైనది. పరిశోధన సంస్థ ఐక్యూవిఏ గణాంకాలప్రకారం.. 2019 లో కోవిడ్-19 వ్యాప్తికి ముందు కంటే భారతదేశంలో సుమారు 75 మిలియన్ స్ట్రిప్‌ల డోలో మాత్రలను విక్రయించింది. ప్రస్తుతం కోవిడ్-19 రోగులకు సిఫారసు చేసిన ఈ డోలో 2021లో రూ.307 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. డోలో ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాంటీ ఫీవర్ మరియు అనల్జెసిక్ టాబ్లెట్. దీని కంటే ముందు వరుసలో Calpol ఉంది. ఈ ట్యాబ్లెట్ కి సంబంధించి మిమ్స్ కూడా ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. #డోలో650 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. 🤣🤣 pic.twitter.com/u983mrmfWx — Bollywoodirect (@Bollywoodirect) January 18, 2022 This is why #dolo650 is trending ? pic.twitter.com/4BywaCnmuc — Nocturnal Soul (@Mirage_gurrl) January 7, 2022 (చదవండి: వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!)