Unethical actions
-
అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది. ఫ్లాష్ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది. -
పాలసీల విక్రయాల్లో అనైతిక పోకడ వద్దు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. -
అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. (క్లిక్ చేయండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!) -
డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్
సాక్షి,ముంబై: కోవిడ్ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్ మైక్రోల్యాబ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్ అండ్ స్పెషల్ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్ పద్ధతులపై కోడ్ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం, కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్సైట్ ప్రకారం మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు!
డోలో-650 టాబ్లెట్ అంటే తెలియని వాళ్లు ఉండరు. ఎందుకంటే కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న సమయంలో ప్రజలకు డోలో కాస్త ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా ఆదాయపు పన్నుల శాఖ జరిపిన సోదాల అనంతరం డోలో 650 తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్‌పై ఆరోపణలు చేసింది. ఆ సంస్థ అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది. మైక్రోల్యాబ్స్ వారి ఔషదాల ప్రచారం కోసం వైద్య నిపుణులు, డాక్టర్లకు సుమారు రూ.1000 కోట్లను బహుమతుల రూపంలో, వాళ్ల టూర్ల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపింది. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కంపెనీ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సంస్థకు చెందిన 36 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. సోదాల అనంతరం.. కొన్ని డ్యాకుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో ఉన్న పలు సాక్ష్యాలు పరిశీలించగా మైక్రోల్యాబ్స్ సంస్థ అవినీతికి పాల్పడినట్లు తేలింది. వీటితో పాటు రూ. 1.20 కోట్లు లెక్కల్లో చూపించని నగదు, రూ. 1.40 కోట్ల బంగారం, నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 2022 నుంచి రూపాయి ఎన్నిసార్లు, ఎంత పతనమైందంటే! -
హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సత్ప్రవర్తనకు బాండ్ పేపర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు. -
అసాంఘిక చర్యలకు అడ్డాగా మారిన బాపూఘాట్..
సాక్షి, హైదరాబాద్: అసాంఘిక కార్యకలాపాలకు లంగర్‌హౌస్‌లోని బాపూఫట్ అడ్డాగా వరింది. జాతిపిత మహాత్మాగాంధీని ప్రపంచ దేశ ప్రజలంతా గౌరవిస్త ఆయన సమాధిని పవిత్ర మందిరంగా భావిస్తారు. అయితే దక్షిణాదిలో ఉన్న బాపూజీ ఏకైక సమాధి లంగర్‌హౌస్ త్రివేణి సంగం వద్ద ఉన్నది. ఇంతటి పవిత్రమైన ప్రాంతం మందుబాబులకు అడ్డాగా మారింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. పేకాట, మద్యం, మాంసం.. మామూలుగానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. అయితే పోకిరీలు నిత్యం బాపూ సమాధి ఎదురుగా కూర్చొని మద్యం సేవిస్తున్నారు. ఆ ఖాళీ మద్యం బాటిళ్లు బాపూ సమాధి ప్రాంగణంలోకి విసురుతున్న సంఘటనలు ఉన్నాయి. ఓ వైపు దేవాలయం, మరో వైపు బాపూ సమాధి ఉన్నాయని ఇక్కడ మద్యం సేవించకూడదని చెప్పిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సమాధి ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకున్న తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు కూడా పోకిరీల బెడదను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇక్కడే మాంసాహారం తింటూ పేకాట ఆడుతున్నారు. తాజాగా శనివారం మద్యం సేవిస్త వంసం తింటున్న వారిని స్థానికులు, భక్తులు నిలదీయగా వారిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రివేళల్లో.. పోకిరీలు ఇంతటితో ఆగకుండా రాత్రి వేళ్లలో మరింతగా ర్చెపోతున్నారు. ఏటవాలు ఆకారంలో బాపూ సమాధి నిర్మాణం ఉండటంతో దాని కింద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రయితే చాలు బాపూ సమాధి కింద యథేచ్ఛఫగా వ్యభిచారకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆలయం, బాపూ సవధి ఉన్న ఇంతటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టాలని స్థానికులు, ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. బాపూఫట్ నిర్వహణపై ప్రైవేట్ వ్యక్యులకు, ప్రభుత్వానికి హక్కు ఉండటంతో ఎవర పట్టించుకోవడంలేదని దీంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందిం బాపూ సమాధి, రామాలయాల పవిత్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.... బాపూ సమాధి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. బాపూఫట్ ప్రాంగణానికి కొద్ది దరంలోనే త్రివేణి సంగం ఒడ్డున మహాత్ముని సమాధి నిర్మించారు. దీని నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో వారు నిత్యం బాపూఫట్‌కు తాళం వేసి, సవధి ఉన్న ప్రాంగణాన్ని గాలికి వదిలేస్తున్నారు. వీరితో పాటు పర్యాటక శాఖ అధికారులు కూడా తమకు సంబంధం లేదని దాటవేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాపూ సమాధి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
ఇన్ఫీలో మరో దుమారం!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్ 20న డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోనూ ఫిర్యాదు.. గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు. సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ‘భారీ డీల్స్ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్ టీమ్‌ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్‌వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్‌లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్‌లో పైసా మార్జిన్ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్‌వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్ సిక్కా, ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్... తాజా పరిణామాలతో అమెరికా నాస్డాక్లో లిస్టయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది. -
అడ్డదారిలో అందలం
శ్రీకాకుళం కలెక్టరేట్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. మెజారిటీ మండలాలు దక్కించుకునే స్థితిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరిన్ని స్థానాలు దక్కించుకోవాలన్న యావతో అధికార జులుం ప్రదర్శించింది. అనైతిక చర్యలు, ప్రలోభాలు, బెదిరింపులతో కొన్ని మండలాలను అదనంగా చేజిక్కించుకోగలిగినా.. మరికొన్ని మండలాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు. జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకారం 22 మండలాల్లో టీడీపీ, 16 మండలాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం సాధించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే సహజంగా అధ్యక్ష పీఠాలను సైతం ఇదే సంఖ్యలో గెలుచుకోవాల్సి ఉంది. కానీ అధికార దర్పం, అనైతిక చర్యలతో మరో నాలుగు పీఠాలను అదనంగా చేజిక్కించుకుంది. మొత్తం మీద టీడీపీ 26, వైఎస్ఆర్సీపీ 12 మండలాల్లో విజయం సాధించాయి. తనకు తగిన బలం లేని, అభ్యర్ధులు లేని మండలాల్లో టీడీపీ రెండు రోజులు ముందుగానే వ్యూహం ప్రకారం బలహీనవర్గాలకు చెందిన ఎమ్పీటీసీలను, ఇండిపెం డింట్లను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. రాజాం మండలంలో వైఎస్ఆర్సీపీకి 8, టీడీపీకి 6గురు సభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఉన్నా రు. ఈ లెక్కన ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్న వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష పదవి దక్కాలి. కానీ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌ను బెదిరించి, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకొన్నారు. వారి సహకారంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వంగర మండలంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు ఎంపీపీ ఎన్నికల్లో వెలుగుచూశాయి. కళావెంకటరావు, ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ మండలంలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్ధి విషయంలో ఈ రెండు వర్గాలు చివరకు పరస్పరం పోటీ పడ్డాయి. పలాసలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ఇండిపెండింట్‌ను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీకే ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. హిరమండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్పీటీసీలను టీడీపీ నేతలు బెదిరించారు.ఆమదాలవలసలో టీడీపీ ప్రలోభాలు ఫలించాయి. కొందరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చివరి క్షణంలో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తింంచారు. సమావేశం ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్లు లాక్కున్నారు. అదే పోలీసులు, అధికారులు సమావేశ మందిరంలో నిబంధనలకు విరద్ధంగా టీడీపీ నేతలు ఫోన్లలో మంతనాలు సాగించినా పట్టించుకోలేదు. సీతంపేటలో వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం ఉండగా, ఆ మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఏమాత్రం లొంగలేదు.బూర్జ మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. నిండు గర్భిణితో బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేసి, భంగపడింది. కాంగ్రెస్, టీడీపీలు ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా..చివరకు న్యాయమే గెలిచి..పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జి.సిగడాంలో టీడీపీ ఎమ్పీటీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి అవసరమైన ఎస్సీ అభ్యర్ధి లేకపోవడంతో వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిని సూరీడమ్మను ప్రలోభపెట్టి ఆమె చేత ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. ఆమెకు మద్దతుగా ఓటేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సూరీడమ్మ పోటీ చేసినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.