
వాషింగ్టన్: హాంకాంగ్‌కు చెందిన ఓ 24ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించాడు. వివరాల్లోకి వెళ్తే సైనో బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీ పింగ్, చేంగ్ లింగ్ చెంగ్‌ల కుమారుడు ఎరిక్ త్సేకు కంపెనీలో ఐదవ వంతు మూలదన షేర్లను అంటే సుమారు 3.8బిలియన్ డాలర్ల రూపాయలు లభించాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫోర్బ్స్ ప్రకటించిన 550 అత్యంత ధనవంతుల జాబితాలో చోటు లభించడం విశేషం.
అయితే, సంపన్న జాబితాలో ఇతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రఖ్యాత దర్శకుడు స్పీల్‌బర్గ్‌ల కంటే కూడా ముందు వరుసలోకి వచ్చేశాడు. ఎరిక్ త్సే సయోటల్‌లో జన్మించాడు. తన విద్యాభ్యాసాన్ని బీజింగ్, హాంగ్‌కాంగ్‌లో పూర్తి చేశాడు. ఇతడికి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కమిటీలో చోటు లభించింది. కాగా, సంవత్సరానికి ఐదు లక్షల డాలర్లను బోనస్‌గా పొందనుండడం విశేషం. మరోవైపు ఎరిక్ త్సేకు కుబేరుల జాబితా పట్ల పెద్దగా ఆసక్తి లేదట.
Comments
Please login to add a commentAdd a comment