![Aurobindo Pharma channelising efforts to commercialise COVID-19 vaccine - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/6/AUROBINDO.jpg.webp?itok=4_pm0HnN)
న్యూఢిల్లీ: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. యూఎస్‌లో కొత్త ప్లాంటు నిర్మాణం పూర్తి చేసింది. మరో కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫెసిలిటీ పూర్తి కావడానికి 15–18 నెలల సమయం పడుతుందని 2020–21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘కోవిడ్–19 వ్యాక్సిన్ వాణిజ్యీకరణకై సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత కోవిడ్–19 వ్యాక్సిన్ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యీకరణ, తయారీ కోసం యూఎస్‌కు చెందిన వ్యాక్సినిటీతో ప్రత్యేక లైసెన్స్ ఒప్పందం చేసుకున్నాం. తైవాన్‌లో వ్యాక్సినిటీ చేపట్టిన వ్యాక్సిన్ రెండవ దశ ఔషధ ప్రయోగాలు సెప్టెంబరుకల్లా పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడవ దశ ఔషధ పరీక్షలకు ఈ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ల తయారీ ప్లాంటు సిద్ధం అయింది’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment