ప్రతీకాత్మక చిత్రం
కరోనా పేరిట మందుల కంపెనీలతో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేక దేశాలు రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజలకు వ్యాక్సిన్‌లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు ఇటీవల హెచ్చరించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్‌లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీ ఎత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరఫున బెదిరింపులు రావడం ప్రమాదకర పరిణామమని డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కావాలి.
ప్రపంచంలో దఫదఫాలుగా ఇప్పటిదాకా దేశాల్ని చుట్టుముట్టిన వైరస్‌లన్నీ మనం భావిస్తున్నట్టుగా అంత త్వరగా అంతరించిపోలేదు. అలాగే కరోనా వైరస్ కూడా తొందరగా వదిలించుకోగలిగింది కాదని, ఎన్ని లాక్‌డౌన్‌లు ప్రకటించుకున్నా అది తొలగిపోయేది కాదనీ రుజువయింది. అందుకనే మా ప్రజలు నిరం తరం లాక్‌డౌన్‌లకు నిరసనగా వేలాదిగా వీధులలో ఊరేగింపులు తీయ వలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై అణచివేత చర్యల వల్ల లాభం లేదనేది రుజువైంది. ఇతర దేశాల అనుభవం కూడా ఇదే.
– న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రకటన, వెల్లింగ్టన్ (04–10–2021)
ఇప్పుడు న్యూజిలాండే కాదు, కరోనా వైరస్ పేరిట జరుగుతున్న రకరకాల సవాలక్ష మందుల కంపెనీల మోసాల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ పేరిట భారీ ఎత్తున ప్రజారోగ్యంపై సాగుతున్న దోపిడీ గురించి, సాక్షాత్తు టీకాల వ్యాపారం వల్ల ప్రజలకు జరుగుతున్న కష్ట నష్టాలను అధికార స్థాయిలో ఏకరువు పెడుతూ అఖిల–అమెరికా మెడికల్ బోర్డు ప్రపంచ ప్రజలకు ఒక హెచ్చరికను (సెప్టెంబర్ 9న) విడుదల చేసింది. ఈ బోర్డు అఖిల అమెరికా కుటుంబ వైద్యసంస్థ, అమెరికా ఇంటర్నల్ మెడిసిన్ బోర్డు, అమెరికా శిశువైద్యాధికారుల బోర్డుల సంయుక్త సంస్థ. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమె రికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజ లకు వ్యాక్సిన్‌లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు హెచ్చ రించింది. ఈ వ్యాక్సిన్‌ల వ్యాపారాన్ని 80కి మించి ప్రైవేట్ గుత్త కంపెనీలు సాగిస్తున్నాయి. ఇదే సందర్భంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సంయుక్త ఫెడరేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లూ, కరోనా టీకాలకు సంబం ధించి కంపెనీల తరపున సమాచారాన్ని ప్రచారంలో పెడుతున్నారని ప్రొఫెషనల్స్‌ను హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం వృత్తిరీత్యా వైద్యులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వైద్య సేవకుల నైతిక విలు వలకు, ధర్మానికే విరుద్ధమని రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సమాఖ్య హెచ్చరించవలసి వచ్చింది. ఈ హెచ్చరికను అభిల భారత మెడికల్ బోర్డు సమర్పించింది.
కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్‌లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీయెత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. అంతేకాదు ఇంతవరకూ శాస్త్రీయ నిరూపణలేని టీకాలను విచ్చల విడిగా ‘ఫ్లూ’ పేరిట కరోనా (కోవిడ్) ఇంజక్షన్ల పేరిట అమ్మడంగానీ, వాటిని కోట్లాది ప్రజలకు ఇవ్వచూపడంగానీ న్యూరెంబర్గ్ నిబంధన లను (న్యూరెంబర్గ్ కోడ్) ఉల్లంఘించడమేనని కూడా అఖిల అమెరికా మెడికల్ బోర్డ్‌ల సంయుక్త ఫెడరేషన్ (సెప్టెంబర్ 9)న ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దుచేస్తామని కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటానికి దిగిన బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరపున బెదిరింపులు వెలు వడ్డాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామమంటూ కోవిడ్ టీకాల సామర్థ్య వైఫల్యాన్ని ఎండగడుతూ డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (7–9–2021) రాసిన ప్రత్యేక సమాచారాన్ని సుప్రసిద్ధ ‘లా యాని మేటెడ్ జర్నల్’ ప్రచురించింది. అంతేగాదు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండానే ఫ్లోరిడా అంతటా కరోనా పేరిట వైద్య వ్యాపార కేంద్రాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ ఎలా తెరిచారో వెల్లడించాల్సి వచ్చింది.
అదే తంతు భారతదేశంలో కూడా ప్రారంభమై కొనసాగుతోం దని భారత బార్ అసోసియేషన్ వెల్లడించాల్సి వచ్చింది. మన దేశంలో ‘ఫ్లూ’ను పోలిన కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి దేశీయ ‘హైడ్రోక్లోరోక్విన్’, ఐవర్‌మెక్టిన్‌లను వాడకుండా పక్కన పెట్టేశారు. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ భారతదేశంలో లక్షలమంది మరణానికి కారకురాలని మన ఇండియన్ బార్ అసోసియేషన్ అభిశంసించింది. పై రెండు దేశీయ ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడగల ‘హైడ్రో క్లోరోక్విన్’, ‘ఐవర్‌మెక్టిన్’లను వాడడం వల్ల ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో కోవిడ్ కేసులు దాదాపు 94 – 98 శాతం తగ్గిపోయాయని బార్ అసోసియేషన్ ఉదాహరించింది. ఈ దేశీయ ప్రయోగం సత్ఫలితాలను యావత్తు దేశ ప్రజలకూ చేరకుండా చేసే బాధ్యతను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఏఎంఎ, బైడెన్, స్కూమర్, పెలోసీ వగైరా కుట్రదారులు తలెత్తుకున్నారని బార్ అసోసియేషన్ పేర్కొంది. ఈ కుట్రను డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్ మరిం తగా వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్‌లకు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేస్తూ వస్తున్న డాక్టర్ ఫాసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళను అనుసరించి అనుకూల వార్తలు వండే పత్రికలూ, వాటిని భుజాన వేసుకుతిరిగే రాజకీయవేత్తలూ, కోవిడ్ పేరుతో భారీ సంఖ్యలో బడా ప్రైవేట్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ల ద్వారా లాభాలు గుంజుకోవడానికి అల్లిన పెద్ద కుట్రగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ ప్రపంచానికి వెల్లడించారు (‘లా ఏనిమేషన్ వరల్డ్’ 31.08.2021). ఫ్లూ సంబంధిత కోవిడ్ లాంటి వైరస్‌ల నివారణకు తక్షణోపాయంగా విధిగా ప్రయోగించాల్సిన హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్‌లను అడ్డుకొని. వాడకంలోకి రాకుండా పనిగట్టుకొని నిషేధించడం ద్వారా లక్షలాది ప్రజల మరణానికి కారకులయ్యారని డాక్టర్ రాబర్ట్స్ సాధికారికంగా తన విశ్లేషణలో ఆరోపించారు! పైగా తక్షణ ప్రాణరక్షణ æమందుల్ని నిషేధించిన డాక్టర్లను శిక్షించకుండా, ప్రాణాల్ని కాపాడటానికి తోడ్పడే మందుల్ని ఉపయోగించే వైద్యుల్ని శిక్షించ బూనడం దుర్మార్గమనీ,ఈ విషయంలో పశ్చిమ రాజ్యాల ప్రవర్తన అత్యంత ప్రజాస్వామ్య వ్యతిరేకమూ, పారదర్శకతకు విరుద్ధమని డాక్టర్ రాబర్ట్స్ తన విశ్లేషణలో వివరించారు.
ఈ విషాదకర పరిణామాల్ని చూస్తుంటే షేక్స్‌పియర్ రాసిన ‘టెంపెస్ట్’ నాటకంలోని ‘నరకలోకం ఖాళీ అయింది. ఇక దెయ్యాలన్నీ ఇక్కడనే తిష్ఠ వేస్తా’యన్న సూక్తి గుర్తుకొస్తుంది. రకరకాల రూపాలతో వ్యాపిస్తున్న ఆ కోవిడ్ వైరస్‌కు పరిష్కారం ఏమిటి? అంటే గడచిన ప్రపంచ చరిత్రను కల్లోలపరిచిన 300 వైరస్‌ల నిరోధానికి 15–16 శతాబ్దాల నుంచి ఈ క్షణం దాకా జరుగుతోన్న ప్రయత్నాలలో భాగంగానే, కరోనా వైరస్‌కు కూడా అంతిమ పరిష్కారం లభిస్తుందని తీర్మానించుకొనక తప్పదు.
సాంకేతిక పరిజ్ఞానం, దాని ఫలితాలు మానవాళికి అందుబాటులోకి రావడానికి ఇప్పుడు సాధ్యమవుతున్నంత వేగంగా గతంలో అంతిమ ఇంజెక్షన్‌లు సాధ్యం కాకపోయి ఉండవచ్చు. కానీ నేటి సాంకేతిక దశలో కూడా పరిష్కారంలో ఇది ఆఖరి మాట అని నిర్ధారించడం అంత సులభం కాకపోవచ్చు. ఈలోగా ప్రజలకు ఏర్పడే తాత్కాలిక కష్టాల్ని సాకుగా తీసుకుని దాన్ని ప్రజల పౌరహక్కుల్ని అణచడానికి ఒక సదవకాశంగా భావించే పాలకులు ఉంటారు. బహుశా అందుకనే, అమెరికా రాజ్యాంగ పితామహులలో ఒకరూ, ప్రజల హక్కుల పత్రానికి జనకుడైన జేమ్స్ మాడిసన్ చేసిన హెచ్చరిక అన్ని దేశాలకూ, ప్రజలకూ పాఠంగా నిలిచిపోతుంది. ఏదో ఒక పరిణామం పేరిట ప్రజా స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పాలకులు ఎక్కుపెట్టజూసే తొలి ప్రయోగానికే ప్రజలు అప్రమత్తులై పోవాలని మాడిసన్ చెప్పారు. ఇది చరిత్రాత్మక చిరకాల హెచ్చరిక!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment