Private Medical
-
వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులపై 10% మేర పెంపుదల చేసి కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఎంబీబీఎస్ కన్వనర్ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బీ కేటగిరికి రూ.13.20 లక్షలు, సీ కేటగిరి (ఎన్ఆర్ఐ కోటా)కు రూ.39.60 లక్షలు చొప్పున ఫీజులు ఉన్నాయి. బీడీఎస్ కన్వనర్ కోటాకి రూ.14.300..బీ కేటగిరీకి రూ.4.40 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు. 2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు చేపట్టారు. నీట్ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. వ్యాయామ కళాశాలల్లో కోర్సులకు ఇలా.. ప్రైవేట్, అన్–ఎయిడెడ్ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కన్వనర్ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా డిప్లొమో (డీపీఈడీ)కు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, బ్యాచ్‌లర్ (బీపీఈడీ)కు రూ.15 వేల నుంచి రూ.24,500, మాస్టర్స్ (ఎంపీఈడీ)కు రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్ చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. -
ఆలోచింపజేస్తున్న... ఆ హెచ్చరిక!
కరోనా పేరిట మందుల కంపెనీలతో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేక దేశాలు రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజలకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు ఇటీవల హెచ్చరించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీ ఎత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరఫున బెదిరింపులు రావడం ప్రమాదకర పరిణామమని డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కావాలి. ప్రపంచంలో దఫదఫాలుగా ఇప్పటిదాకా దేశాల్ని చుట్టుముట్టిన వైరస్‌లన్నీ మనం భావిస్తున్నట్టుగా అంత త్వరగా అంతరించిపోలేదు. అలాగే కరోనా వైరస్ కూడా తొందరగా వదిలించుకోగలిగింది కాదని, ఎన్ని లాక్డౌన్లు ప్రకటించుకున్నా అది తొలగిపోయేది కాదనీ రుజువయింది. అందుకనే మా ప్రజలు నిరం తరం లాక్డౌన్లకు నిరసనగా వేలాదిగా వీధులలో ఊరేగింపులు తీయ వలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై అణచివేత చర్యల వల్ల లాభం లేదనేది రుజువైంది. ఇతర దేశాల అనుభవం కూడా ఇదే. – న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రకటన, వెల్లింగ్టన్ (04–10–2021) ఇప్పుడు న్యూజిలాండే కాదు, కరోనా వైరస్ పేరిట జరుగుతున్న రకరకాల సవాలక్ష మందుల కంపెనీల మోసాల మూలంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా రకరకాల అనుభవాలను వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ పేరిట భారీ ఎత్తున ప్రజారోగ్యంపై సాగుతున్న దోపిడీ గురించి, సాక్షాత్తు టీకాల వ్యాపారం వల్ల ప్రజలకు జరుగుతున్న కష్ట నష్టాలను అధికార స్థాయిలో ఏకరువు పెడుతూ అఖిల–అమెరికా మెడికల్ బోర్డు ప్రపంచ ప్రజలకు ఒక హెచ్చరికను (సెప్టెంబర్ 9న) విడుదల చేసింది. ఈ బోర్డు అఖిల అమెరికా కుటుంబ వైద్యసంస్థ, అమెరికా ఇంటర్నల్ మెడిసిన్ బోర్డు, అమెరికా శిశువైద్యాధికారుల బోర్డుల సంయుక్త సంస్థ. జబ్బు స్వభావంతో, దాని లక్షణాలతో నిమిత్తం లేకుండా అమె రికాలో నేడు ‘ఫ్లూ’ పేరిట, కోవిడ్–19 పేరిట మూకుమ్మడిగా ప్రజ లకు వ్యాక్సిన్లు వేస్తున్నారని అఖిల అమెరికా మెడికల్ బోర్డు హెచ్చ రించింది. ఈ వ్యాక్సిన్ల వ్యాపారాన్ని 80కి మించి ప్రైవేట్ గుత్త కంపెనీలు సాగిస్తున్నాయి. ఇదే సందర్భంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సంయుక్త ఫెడరేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్లూ, కరోనా టీకాలకు సంబం ధించి కంపెనీల తరపున సమాచారాన్ని ప్రచారంలో పెడుతున్నారని ప్రొఫెషనల్స్‌ను హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం వృత్తిరీత్యా వైద్యులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వైద్య సేవకుల నైతిక విలు వలకు, ధర్మానికే విరుద్ధమని రాష్ట్రస్థాయి మెడికల్ బోర్డుల సమాఖ్య హెచ్చరించవలసి వచ్చింది. ఈ హెచ్చరికను అభిల భారత మెడికల్ బోర్డు సమర్పించింది. కోవిడ్ నైతిక విలువలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విచ్చలవిడిగా ప్రయోగించేవారిని అంతర్జాతీయ వైద్య నిపుణులు నిలదీశారు. ‘ముందుగా ప్రజలకు భారీయెత్తున టీకాలు వేద్దాం. ఆ తర్వాతనే టీకాలపై రీసెర్చ్ మొదలుపెడదాం’ అనే వైఖరిని తప్పుబట్టారు. అంతేకాదు ఇంతవరకూ శాస్త్రీయ నిరూపణలేని టీకాలను విచ్చల విడిగా ‘ఫ్లూ’ పేరిట కరోనా (కోవిడ్) ఇంజక్షన్ల పేరిట అమ్మడంగానీ, వాటిని కోట్లాది ప్రజలకు ఇవ్వచూపడంగానీ న్యూరెంబర్గ్ నిబంధన లను (న్యూరెంబర్గ్ కోడ్) ఉల్లంఘించడమేనని కూడా అఖిల అమెరికా మెడికల్ బోర్డ్‌ల సంయుక్త ఫెడరేషన్ (సెప్టెంబర్ 9)న ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పే అమెరికన్ డాక్టర్ల మెడికల్ లైసెన్స్‌లను రద్దుచేస్తామని కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటానికి దిగిన బడా ప్రైవేట్ మందుల కంపెనీల తరపున బెదిరింపులు వెలు వడ్డాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామమంటూ కోవిడ్ టీకాల సామర్థ్య వైఫల్యాన్ని ఎండగడుతూ డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (7–9–2021) రాసిన ప్రత్యేక సమాచారాన్ని సుప్రసిద్ధ ‘లా యాని మేటెడ్ జర్నల్’ ప్రచురించింది. అంతేగాదు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండానే ఫ్లోరిడా అంతటా కరోనా పేరిట వైద్య వ్యాపార కేంద్రాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ ఎలా తెరిచారో వెల్లడించాల్సి వచ్చింది. అదే తంతు భారతదేశంలో కూడా ప్రారంభమై కొనసాగుతోం దని భారత బార్ అసోసియేషన్ వెల్లడించాల్సి వచ్చింది. మన దేశంలో ‘ఫ్లూ’ను పోలిన కరోనా వైరస్‌ను అదుపు చేయడానికి దేశీయ ‘హైడ్రోక్లోరోక్విన్’, ఐవర్‌మెక్టిన్‌లను వాడకుండా పక్కన పెట్టేశారు. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ భారతదేశంలో లక్షలమంది మరణానికి కారకురాలని మన ఇండియన్ బార్ అసోసియేషన్ అభిశంసించింది. పై రెండు దేశీయ ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడగల ‘హైడ్రో క్లోరోక్విన్’, ‘ఐవర్‌మెక్టిన్’లను వాడడం వల్ల ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో కోవిడ్ కేసులు దాదాపు 94 – 98 శాతం తగ్గిపోయాయని బార్ అసోసియేషన్ ఉదాహరించింది. ఈ దేశీయ ప్రయోగం సత్ఫలితాలను యావత్తు దేశ ప్రజలకూ చేరకుండా చేసే బాధ్యతను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఏఎంఎ, బైడెన్, స్కూమర్, పెలోసీ వగైరా కుట్రదారులు తలెత్తుకున్నారని బార్ అసోసియేషన్ పేర్కొంది. ఈ కుట్రను డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్ మరిం తగా వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్లకు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేస్తూ వస్తున్న డాక్టర్ ఫాసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళను అనుసరించి అనుకూల వార్తలు వండే పత్రికలూ, వాటిని భుజాన వేసుకుతిరిగే రాజకీయవేత్తలూ, కోవిడ్ పేరుతో భారీ సంఖ్యలో బడా ప్రైవేట్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ల ద్వారా లాభాలు గుంజుకోవడానికి అల్లిన పెద్ద కుట్రగా డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ ప్రపంచానికి వెల్లడించారు (‘లా ఏనిమేషన్ వరల్డ్’ 31.08.2021). ఫ్లూ సంబంధిత కోవిడ్ లాంటి వైరస్ల నివారణకు తక్షణోపాయంగా విధిగా ప్రయోగించాల్సిన హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్‌లను అడ్డుకొని. వాడకంలోకి రాకుండా పనిగట్టుకొని నిషేధించడం ద్వారా లక్షలాది ప్రజల మరణానికి కారకులయ్యారని డాక్టర్ రాబర్ట్స్ సాధికారికంగా తన విశ్లేషణలో ఆరోపించారు! పైగా తక్షణ ప్రాణరక్షణ æమందుల్ని నిషేధించిన డాక్టర్లను శిక్షించకుండా, ప్రాణాల్ని కాపాడటానికి తోడ్పడే మందుల్ని ఉపయోగించే వైద్యుల్ని శిక్షించ బూనడం దుర్మార్గమనీ,ఈ విషయంలో పశ్చిమ రాజ్యాల ప్రవర్తన అత్యంత ప్రజాస్వామ్య వ్యతిరేకమూ, పారదర్శకతకు విరుద్ధమని డాక్టర్ రాబర్ట్స్ తన విశ్లేషణలో వివరించారు. ఈ విషాదకర పరిణామాల్ని చూస్తుంటే షేక్స్పియర్ రాసిన ‘టెంపెస్ట్’ నాటకంలోని ‘నరకలోకం ఖాళీ అయింది. ఇక దెయ్యాలన్నీ ఇక్కడనే తిష్ఠ వేస్తా’యన్న సూక్తి గుర్తుకొస్తుంది. రకరకాల రూపాలతో వ్యాపిస్తున్న ఆ కోవిడ్ వైరస్‌కు పరిష్కారం ఏమిటి? అంటే గడచిన ప్రపంచ చరిత్రను కల్లోలపరిచిన 300 వైరస్ల నిరోధానికి 15–16 శతాబ్దాల నుంచి ఈ క్షణం దాకా జరుగుతోన్న ప్రయత్నాలలో భాగంగానే, కరోనా వైరస్‌కు కూడా అంతిమ పరిష్కారం లభిస్తుందని తీర్మానించుకొనక తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం, దాని ఫలితాలు మానవాళికి అందుబాటులోకి రావడానికి ఇప్పుడు సాధ్యమవుతున్నంత వేగంగా గతంలో అంతిమ ఇంజెక్షన్లు సాధ్యం కాకపోయి ఉండవచ్చు. కానీ నేటి సాంకేతిక దశలో కూడా పరిష్కారంలో ఇది ఆఖరి మాట అని నిర్ధారించడం అంత సులభం కాకపోవచ్చు. ఈలోగా ప్రజలకు ఏర్పడే తాత్కాలిక కష్టాల్ని సాకుగా తీసుకుని దాన్ని ప్రజల పౌరహక్కుల్ని అణచడానికి ఒక సదవకాశంగా భావించే పాలకులు ఉంటారు. బహుశా అందుకనే, అమెరికా రాజ్యాంగ పితామహులలో ఒకరూ, ప్రజల హక్కుల పత్రానికి జనకుడైన జేమ్స్ మాడిసన్ చేసిన హెచ్చరిక అన్ని దేశాలకూ, ప్రజలకూ పాఠంగా నిలిచిపోతుంది. ఏదో ఒక పరిణామం పేరిట ప్రజా స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పాలకులు ఎక్కుపెట్టజూసే తొలి ప్రయోగానికే ప్రజలు అప్రమత్తులై పోవాలని మాడిసన్ చెప్పారు. ఇది చరిత్రాత్మక చిరకాల హెచ్చరిక! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నీట్–2017కు రంగం సిద్ధం..విజయానికిదే మార్గం
జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)–2017కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీ సైతం వెల్లడైంది. ఈ పరీక్ష ద్వారా 2017–18లో జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నీట్ – 2017 పూర్తి ప్రకటన విడుదలకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్–2017లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ.. నీట్‌ను 2013లో తొలిసారి.. 2016లో పూర్తి స్థాయిలో మరోసారి నిర్వహించినా.. అప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్‌లు ముగియడంతో విద్యార్థులకు 2016లో నీట్ నుంచి ఉపశమనం లభించింది. అయితే.. 2017 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించాలంటే నీట్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు. నీట్ విషయంలో గతంలో ఎదురైన వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో పరీక్ష మాధ్యమం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నీట్–2017 ను ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో కూడా రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆందోళన వీడి.. నీట్‌కు సంబంధించి పరీక్ష స్వరూపం, సిలబస్ విషయంలో తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కారణం.. మారిన ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్ ప్రకారం.. నీట్లో పేర్కొన్న అంశాలను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. అదే విధంగా పరీక్షలోనూ ఎంసెట్‌తో పోల్చితే అదనంగా ఇరవై ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి నుంచే విజయం దిశగా అడుగులు వేయాలి. ఏఐపీఎంటీ పరీక్ష మాదిరిగానే.. నీట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ముందుగా గత ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరీక్షలు, వాటిలో అడిగిన ప్రశ్నలు, వెయిటేజీ లాంటి అంశాలను పరిశీలించాలి. కారణం.. నీట్‌ను కూడా ఏఐపీఎంటీ విధానంలోనే నిర్వహిస్తారు. ఇక నీట్ సిలబస్, పరీక్షలో వెయిటేజీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాది నీట్–2లో ఇంటర్మీడియెట్ రెండేళ్ల టాపిక్స్‌కు సంబంధించి సమాన వెయిటేజీ కల్పించారు. బోటనీ, జువాలజీలతో సంయుక్తంగా పేర్కొనే బయాలజీ నుంచి బోటనీకి కొంత ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఒకవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలు.. మరోవైపు నీట్ నేపథ్యంలో ఈ రెండు పరీక్షలకు ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్‌లో ఎలక్ట్రో మాగ్నటిజం, ఏసీ సర్క్యూట్స్, రే ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఈథర్స్ అండ్ నార్మన్క్లేచర్, క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ యాక్షన్స్, బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, ఎస్–బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. బయాలజీలో.. హ్యూమన్ ఫిజియాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ట్యాక్సానమీ, నెర్వస్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ, బయోటెక్నాలజీ అప్లికేషన్స్, ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్/ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌పై పట్టు సాధించాలి. నీట్–2017 పరీక్ష విధానం అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో గ్రూప్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 –25 ఏళ్లు ఉండాలి. పరీక్ష విధానం: ఇందులో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ). మొత్తం ప్రశ్నల సంఖ్య – 180 (ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు). ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి: మూడు గంటలు. పరీక్ష తేది: మే 7, 2017 ఫిజిక్స్ ప్రశ్నలను న్యూమరికల్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రశ్నలు గణాంక సహిత సమాచారం ఆధారంగా పరిష్కరించేలా ఉంటాయి. వీటి విషయంలో న్యూమరికల్ అప్రోచ్ కలిసొస్తుంది. అదేవిధంగా కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించి అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం వల్ల మరిన్ని మార్కులు సొంతం చేసుకోవచ్చు. – డా. సీహెచ్ రామకృష్ణ, ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్ -
నీట్ - పీజీ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్).. జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష. ఇప్పటికే నీట్‌యూజీ ద్వారా2016 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా నీట్-పీజీ 2017 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధివిధానాలు.. నీట్ పీజీ ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-పీజీ నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. నీట్-పీజీ అర్హత వివరాలు ఎంబీబీఎస్, ఎంసీఐ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 2017, మార్చి 31 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2017, ఏప్రిల్ 15 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఆ ఆరు మినహా.. దేశంలోని ఆరు ఇన్స్టిట్యూట్లు నీట్ పీజీ పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చారు. అవి.. ఎయిమ్స్-న్యూఢిల్లీ; పీజీఐఎంఈఆర్-చండీగఢ్, జిప్మర్ -పుదుచ్చేరి, ఎస్జీపీజీఐఎంఎస్-లక్నో, నిమ్హాన్స్-బెంగళూరు, శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ- తిరువనంతపురం. ఈ ఇన్స్టిట్యూట్లు తమ పరిధిలోని సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు సైతం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఇలా నీట్ పీజీ పరీక్షను 300 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులుండవు. మొత్తం 300 ప్రశ్నలు ఉండే పరీక్షలో ఎంబీబీఎస్ స్థాయిలోని 15 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి.. ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి పది ప్రశ్నలు ఠి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పీడియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలు ఠి పాథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఆబ్స్ట్రెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఠి మెడిసిన్, డెర్మటాలజీ, వెరనాలజీ విభాగాల నుంచి 37 ప్రశ్నలు ఠి సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా విభాగాల నుంచి 46 ప్రశ్నలు ఠి రేడియో డయాగ్నసిస్, రేడియో థెరపీ విభాగాల నుంచి 12 ప్రశ్నలు ఠి ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు. కనీస అర్హత మార్కులు సాధిస్తేనే నీట్ -పీజీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం కనీస మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. కౌన్సెలింగ్ ఇలా.. ఠి ఆల్ ఇండియా కోటాలో 50 శాతం: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశానికి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. వీరు ఆన్లైన్ విధానంలో సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 50 శాతం మేరకు అందుబాటులో ఉండే సీట్లకు ఐదింతలు ఎక్కువగా మాత్రమే అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అంటే ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టేట్ కోటాలో 50 శాతం: ఆల్ ఇండియా కోటాకు 50 శాతం సీట్లు పోగా మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలో ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. ఏపీ, టీఎస్‌లకు వర్తించని ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడే అర్హత లేదు. వీరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కళాశాలలకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2016. ఆన్లైన్ పరీక్ష తేదీలు: డిసెంబర్ 5 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉమ్మడి పరీక్ష ప్రయోజనకరం పీజీ స్థాయిలో నీట్ పేరుతో జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు ప్రయోజనకరం. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో పోటీ పడే అవకాశం లేకపోయినా.. బహుళ ఎంట్రెన్సులు రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశించాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఏపీపీజీమెట్, నిమ్స్ నిర్వహించే పీజీ మెట్లు రాయాల్సి ఉండేది. ఎంబీబీఎస్ స్థాయిలో బేసిక్స్, ప్రివెంటివ్ మెడిసిన్‌పై అవగాహన ఉన్నవారు మెరుగైన మార్కులు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్. నంద కిశోర్, ఎంసీఐ సభ్యులు -
రేపు రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
- ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లకు.. - 27వ తేదీ మధ్యాహ్నం సీట్ల కేటాయింపు..అదే రోజు చేరికకు గడువు - ముగిసిన ప్రైవేటు బీ కేటగిరీ కౌన్సెలింగ్..ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరగనుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆన్లైన్లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సుంది. మొదటి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో మిగిలిన సీట్ల లెక్క తేలుతుంది. ఈ మిగిలిన సీట్లకే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు 27 మధ్యాహ్నంలోగా సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. అదే రోజు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే 28 మధ్యాహ్నం వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్సీసీ, ఆర్మీ కోటా సీట్లకు 26వ తేదీనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు అదేరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆప్షన్లు ఇవ్వాలని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ముగిసిన బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. సాయంత్రానికి ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఆ తర్వాత మిగిలిన బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. రాష్ట్రంలో 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 713 బీ కేటగిరీలో శుక్రవారం 384 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 329 ఎంబీబీఎస్ సీట్లు రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.వి.రావు ‘సాక్షి’కి తెలిపారు. ‘నీట్’లో 1,12,390వ ర్యాంకు విద్యార్థి చివరి ఎంబీబీఎస్ సీటు పొందాడు. సీటు పొందిన వారు ఈనెల 27 కల్లా కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అదేరోజు ఏడాది గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సీటును వదులుకోవాలనుకుంటే చెల్లించిన ఫీజులో 10% మినహాయించుకొని మిగతా సొమ్మును కాలేజీ యాజమాన్యాలు వెనక్కు ఇస్తాయి. ఎవరైనా బీ కేటగిరీ సీట్లల్లో చేరకుంటే వాటికి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు కాలేజీలకు మెమో జారీ చేస్తామని వైద్య మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
‘బీ కేటగిరీ’లో స్కామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణానికి తెరలేపాయి! ఈ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందే కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని యాజమాన్యాలు ఆ సీట్లను ‘కొనుగోలు’ చేసిన వారికే కట్టబెట్టేందుకు వీలుగా ఎన్నారై కోటాలోకి మార్చుకునేందుకు కుట్రకు రంగం సిద్ధం చేశాయి!! కౌన్సిలింగ్లో ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులను సైతం తప్పించేందుకు తెగించాయి. ఏదైనా కారణంతో కాలేజీ యాజమాన్యం సీటు కోల్పోతే ఆ సీటును ఎన్నారై కోటాలోకి మార్చుకోవచ్చన్న ప్రభుత్వ ఉత్తర్వును అనుకూలంగా మలచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఎక్కువ మంది మధ్య తరగతి విద్యార్థులే ఉన్నప్పటికీ వారి స్తోమతకు మించి ఎంబీబీఎస్‌కు మొదటి ఏడాది ఫీజు రూ. 9 లక్షలతోపాటు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి తెస్తున్నాయి. పన్నురెండ్రోజుల క్రితం ప్రభుత్వం నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీని ఏడాదికి కుదిస్తూ జీవో జారీచేసినా అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ నెలాఖరుకే గ్యారంటీ గడువు ముగుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపింది కొందరే... రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ కింద ఉన్న 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 బీడీఎస్ సీట్లకు ఇటీవల ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో ఎంబీబీఎస్ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ బీడీఎస్‌లో మాత్రం 200కుపైగా సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు సీటు సాధించినప్పటికీ బ్యాంకు గ్యారంటీ వారికి అడ్డుగా మారింది. ఈ నెలాఖరు నాటికి నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు ఉంటుందని లేకుంటే వదులు కోవాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన ‘ఏడాదికి బ్యాంకు గ్యారంటీ’ జీవోతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నాయి. దీంతో 505 ఎంబీబీఎస్ సీట్లల్లో చేరిన విద్యార్థుల్లో శుక్రవారం నాటికి కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపినట్లు తెలిసింది. యాజమాన్యాల నిబంధన వల్ల కనీసం 300 ఎంబీబీఎస్ సీట్లకు చెందిన విద్యార్థులు నాలుగేళ్ల బ్యాంకు చూపని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. వీటిని ఎన్నారై కోటా కింద మార్చుకోవాలన్న కుట్రలో ప్రైవేటు మెడికల్ యాజమాన్నాలు ఉన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. బ్యాంకు గ్యారంటీకి వచ్చే నెల 4 వరకు అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా బహిరంగ ప్రకటన ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. సవరణ జీవో ఏకపక్షం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకెక్కాయి. యాజమాన్య కోటా కింద ప్రవేశం పొందే తేదీ లోపు మొదటి ఏడాది ఫీజుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు తమకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సర్కారు సవరించడాన్ని సవాల్‌చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరాయి. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సాధారణ పద్దతిలోనే పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, సవరణ జీవో మేరకు ఓ ఏడాదికి బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు తమకూ గడువునివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారికి వారం గడువునిచ్చింది. -
బీ కేటగిరీ సీట్లకు ‘బ్యాంక్ గ్యారంటీ ఏడాదే’
నాలుగేళ్ల నుంచి ఏడాదికికుదిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీ కేటగిరీ వైద్య సీట్లు పొందిన విద్యార్థులకు ఊరట లభించింది. మొదటి ఏడాది ఫీజుతోపాటు ఎంబీబీఎస్‌కు నాలుగేళ్లు, బీడీఎస్‌కు మూడేళ్లు బ్యాంకు గ్యారంటీ చూపాలని ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుగుణంగా గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో జీవో జారీ చేసింది. ఒక ఏడాదికి మాత్రమే గ్యారంటీ చూపితే సరిపోతుందని తాజా జీవోలో స్పష్టం చేసింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే. దీంతో ఈ విషయంపై వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీ కేటగిరీ సీట్ల భర్తీ సందర్భంగా గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేయాల్సిన అవసరముందని అధికారులు తెలపడంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అత్యవసరంగా ‘ఏడాదికే బ్యాంకు గ్యారంటీ’ని కుదిస్తూ సవరింపు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో బుధవారం రాత్రి ‘ప్రతి ఏడూ వచ్చే ఏడాది ట్యూషన్ ఫీజును వైద్య కళాశాలలు బ్యాంకు గ్యారంటీగా స్వీకరించొచ్చు’ అని సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రైవేటు యాజమాన్యాల నేతృత్వంలో కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వ డానికి గడువు విధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీకి పెట్టిన గడువు తేదీని పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వారంలో సెలవులు ఉండటంతో బ్యాంకు గ్యారంటీ తీసుకోవడం కష్టమని అంటున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడతానని చెప్పారు. -
ప్రైవేటు వైద్య ఫీజులు యధాతథం
హైదరాబాద్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత వైద్య పీజీ కోర్సుల ఫీజులను 2015-16 విద్యా సంవత్సరానికి యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సులకు సంబంధించి కన్వినర్ కోటా(50శాతం), మేనేజ్మెంట్ కోటా(50శాతం)ల సీట్లకు ప్రస్తుతం అమలులో వున్న ఫీజులే వచ్చే విద్యా సంవత్సరంలో కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంజక్షన్ వికటించి రైతు మృతి
కొత్తూరు : ఇంజెక్షన్ వికటించి ఓ రైతు మృతి చెందగా అందుకు కారణమైన పీంఎంపీని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఐదు గంటలపాటు నిర్బంధించారు. చివరకు పోలీసుల జోక్యంతో విడుదల చేసి ఆపై అదుపు లోకి తీసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం... కొత్తూరు మండలం మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నసురుల్లాబాద్‌కు చెందిన బోడ యాదయ్య (45) వృత్తిరీత్యా వ్యవసాయదారు. ఈయనకు భార్య నర్సమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సమీపంలో తమకున్న రెండెకరాల పొలంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి ఆస్తమాతో బాధ పడుతున్నాడు. దీంతో అప్పుడప్పుడు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇది లాఉండగా ఐదు నెలలుగా ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాలకు చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ) యాదగిరి శ్రీనివాసులుగూడ, మజీద్మామిడిపల్లి, నసురుల్లాబాద్‌లో పర్యటిస్తూ అనారోగ్యానికి గురైన వారికి ప్రథ మ చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నసురుల్లాబాద్‌కు రాగా యాదయ్య తన వద్ద ఉన్న ఇంజక్షన్ (వాయిల్) ను ఇవ్వాల్సిందిగా పీఎంపీని కోరాడు. అది ఇచ్చిన పది నిమిషాల్లోనే మృతి చెందగా, ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు అతనిపై దాడి చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అనంతరం ఎస్ఐ సీహెచ్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి పీఎంపీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పీఎంపీని వివరణ కోరగా బాధితుడు అంతకుముందు అదే ఇంజక్షన్ తీసుకున్నట్లు తెలపడంతో మళ్లీ ఇచ్చానని, అంతేతప్పా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. -
కామెడ్-కేలో తెలుగు తేజం
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశం కోసం గత నెల నిర్వహించిన కన్సోర్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్-కే) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన కొండవీటి ధరన్ మొత్తం 180 మార్కులకు గాను 164 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. కామెడ్-కేకు మొత్తం 90,264 (మెడికల్ విభాగంలో 47,085 ఇంజనీరింగ్ విభాగంలో 43,179) విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 23,794 మంది వైద్య, దంత వైద్య విభాగంలో ప్రవేశానికి అర్హత సాధించగా, ఇంజనీరింగ్ కోర్సులో 43,179 మంది అర్హత సాధించారు. కాగా, కామెడ్ కే పరిధిలో 17,698 ఇంజనీరింగ్, 835 వైద్య, 766 దంత వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. కామెడ్-కే కౌన్సిలింగ్ షెడ్యూల్లు త్వరలోనే వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ డాక్టర్ ఎస్.కుమార్ తెలిపారు. ఫలితాలు సంస్థ వెబ్సైట్ www.comed k.org లో అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు 08041228992లో సంప్రదించవచ్చని సూచించారు. కాగా, ఇంజనీరింగ్‌లో మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది మంది కర్ణాటకకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అదే విధంగా మెడికల్‌లో మూడు ర్యాంకులను కర్ణాటకకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకోగా మిగిలిన ఏడు ర్యాంకులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సీఈటీలో మొదటి ర్యాంకు సాధించిన గిరిజా అగర్వాల్ కామెడ్-కేలోనూ మొదటి ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 1. టీ. దినేష్రాం కుమార్ (కర్ణాటక-బెంగళూరు) 2. కొండవీటి థరణ్ (ఆంధ్రప్రదేశ్-రాజమండ్రి) 3. టీ.ఎం ప్రజ్వల (కర్ణాటక-బెంగళూరు) మొడికల్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు పొందిన విద్యార్థులు 1. గిరిజా అగర్వాల్ (కర్ణాటక-బెంగళూరు) 2. ఆదిత్యా అగర్వాల్ (గుజరాత్-పాలన్పూర్) 3. శివాని వశిష్ట్ (న్యూ ఢిల్లీ-మాయాపురి) ఈ ఏడాది ఫీజుల వివరాలు (ఏడాదికి) వైద్య విద్య - రూ.3,57,500 దంత వైద్య - రూ.2,53,000 ఇంజినీరింగ్ - రూ.50,000