
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ కంపెనీ బ్లూ జెట్ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు అక్షయ్ భన్సారీలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా దాదాపు 2.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా రూ. రూ. 1,800– 2,100 కోట్ల మధ్య సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
ముంబై కంపెనీ బ్లూ జెట్ ప్రధానంగా స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ సంబంధ ఇన్‌గ్రెడియంట్స్, ఇంటర్మీడియట్‌లను రూపొందిస్తోంది. ఇన్నోవేటర్ ఫార్మాస్యూటికల్, మల్టీనేషనల్ జనరిక్ కంపెనీలకు ప్రత్యేకతరహా ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. గతేడాది(2021–22) ఆదాయం 37 శాతం ఎగసి రూ. 683 కోట్లను అధిగమించింది. నికర లాభం 34 శాతం జంప్‌చేసి దాదాపు రూ. 182 కోట్లకు చేరింది. కంపెనీ రుణరహితంకాగా.. మహారాష్ట్రలోని షహద్, అంబర్‌నాథ్, మహద్‌లలో మూడు ప్లాంట్లను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment