హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి జినోమ్ వ్యాలీలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఫెరింగ్ ఫార్మాసూటికల్ కంపెనీకి శనివారం ఆ సంస్థ సీఈఓ సురేశ్ పట్టతిల్‌తో కలసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు.
జినోమ్ వ్యాలీలో అనేక బయోటెక్ పరిశ్రమలు ఉన్నాయని, ఫెరింగ్ ఫార్మాసూటికల్స్‌ను ఇక్కడ నిర్మించడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు లార్స్ పీటర్ బ్రూన్స్, వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, సర్పంచ్ కిశోర్‌యాదవ్, ఎంపీటీసీ ఎండీ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment