UP Police Raining Lathis On Women And Shouting Abuses - Sakshi
Sakshi News home page

మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ

Published Mon, Nov 7 2022 9:44 AM | Last Updated on Mon, Nov 7 2022 11:53 AM

UP Police Raining Lathis On Women And Shouting Abuses  - Sakshi

పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. ఈ మేరకు మహిళలను లాఠీలతో కొడతూ చెదరగొట్టారు. ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్‌ నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలపై మహిళలు  రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఈ నిరసనలు కారణంగా ఆ విగ్రహం ఉన్న స్థలంపై వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు. 

(చదవండి: అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!’ దళితుణ్ణి ఘోరంగా హింసించి చంపారు)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement