lathi charg
-
ఫ్రీ హలీమ్ ఎఫెక్ట్: భారీ జనంతో గందరగోళం
హైదరాబాద్: మలక్పెట్లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మలక్‌పేటలో ఓ హోటల్లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా జనాలు ఎగబడ్డారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. Chaos over free #Haleem in #Hyderabad, police used mild force to disperse the crowd. Marking the first roza of holy #Ramadan month, a famous eatery announced #FreeHaleem for 1 hour today. Hundreds of people gathered outside their outlet, which led to #TrafficJam.#Ramadan2024 pic.twitter.com/NlFYSkSkPL — Surya Reddy (@jsuryareddy) March 12, 2024 -
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్‌లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ
పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. ఈ మేరకు మహిళలను లాఠీలతో కొడతూ చెదరగొట్టారు. ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలపై మహిళలు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఈ నిరసనలు కారణంగా ఆ విగ్రహం ఉన్న స్థలంపై వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు. (చదవండి: అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!’ దళితుణ్ణి ఘోరంగా హింసించి చంపారు) -
నిరుద్యోగిపై డిప్యూటీ కలెక్టర్ దాష్టీకం.. లాఠీతో చితకబాది, ఈడ్చుకెళ్లి..!
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వారని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులపై జల ఫిరంగాలు ప్రయోగించారు. జాతీయ జెండాను పట్టుకున్న ఓ యువకుడిని డిప్యూటీ కలెక్టర్ లాఠీతో కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, అగ్నిపత్ పథకాలను నిరసిస్తూ జన్ అధికార్ పార్టీ లోక్తాంత్రిక్ ఆందోళనకు దిగినట్లు పలువురు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నిరసనల సందర్బంగా పాట్నా డిప్యూటీ కలెక్టర్ ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం, రోడ్డుపై ఈడ్చుకెళ్లటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పాట్నా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కేకే సింగ్.. నిరసనకారులను కిందపడేసి కొట్టారు. జాతీయ జెండా పట్టుకున్న యువకుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 20 लाख नौकरियाँ देने की बात करने वाले नीतीश कुमार की पुलिस ने पटना में प्रदर्शन कर रहे शिक्षक अभ्यर्थी को अमानवीय तरीके से मारा। बिहार की सरकार और उसके अधिकारी ने न सिर्फ शिक्षक के चेहरा को लहूलुहान कर दिया बल्कि तिरंगे का भी अपमान किया। यही है जेडीयू-राजद सरकार का असली चेहरा… pic.twitter.com/7r75xHoOYU — Amit Malviya (@amitmalviya) August 22, 2022 మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కొత్త ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ క్రమంలో నిరుద్యోగులు నిరసనలు దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ అధికార కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేకే నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు బీజేపీ నేత షేహజాద్ పూనావాలా. తన హామీపై ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. #WATCH | Bihar: Jan Adhikar Party Loktantrik holds a protest march against inflation, GST and Agnipath scheme, in Patna. Police used water cannons to disperse the crowd. pic.twitter.com/vJQsrxAqbp — ANI (@ANI) August 22, 2022 ఇదీ చదవండి: బీహార్ సీఎం నితీష్‌కు బిగ్ షాక్.. దాడి చేసిన 13 మంది అరెస్ట్.. వీడియో వైరల్ -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జ్
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు. -
పవన్ రాజకీయ యాత్రలో అపశృతి
సాక్షి, ఖమ్మం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. పవన్ సభా ప్రాంగాణానికి రావడంతో ఆయన్ను తాకేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. చెల్లాచెదురైన పవన్ అభిమానులు ఒకవైపునకు పరుగు తీశారు. దీంతో ఆ వెనుకే మరికొందరిని అదుపు చేస్తున్న ఎస్సై చిరంజీవితో పాటు భద్రాద్రికి చెందిన ఓ అభిమాని కాలూ విరిగింది. పోలీసుల లాఠీ ఛార్జ్‌తో ఓ అభిమాని స్పృహ తప్పి పడిపోయాడు. -
లడ్డూ కోసం వస్తే.. లాఠీ దెబ్బలు!
- ఖైరతాబాద్ గణపతి ప్రసాదం కోసం 30 వేల మంది రాక - సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలో తొక్కిసలాట - లాఠీచార్జి చేసిన పోలీసులు.. పలువురికి గాయాలు - అదనపు బలగాల రాకతో అదుపులోకి వచ్చిన పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ కోసం ఏకంగా 30 వేల మంది భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. దీంతో పలువురు గాయాలపాలయ్యారు. సకాలంలో అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉదయం 4 గంటల నుంచే క్యూ.. శుక్రవారం ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు లడ్డూకు పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం ఆయనకు 50 శాతం లడ్డూ ఇచ్చేందుకు స్థానిక నాయకులు అంగీకరించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని 15 శాతం లడ్డూను లారీలో పెట్టి పంపించారు. మహా ప్రసాదం కోసం ప్రతి ఏటా 5 నుంచి 6 వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి అనూహ్యంగా ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోవడం, దాదాపు 30 వేల మంది భక్తులు రావడంతో రద్దీ పెరిగిపోయింది. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి పంపిణీ మొదలైంది. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ భక్తులు ఎగబడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి స్వయంగా అక్కడకు వచ్చి అదనపు బలగాలను మోహరించారు. ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. దీంతో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో లైబ్రరీ పక్కనున్న బారికేడ్లు కూలిపోయాయి. ఈ గందరగోళంలోనే యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు ప్రసాదాన్ని ప్యాకెట్లలో పట్టుకుపోవడం గమనార్హం. ఆరు వాహనాల్లో లడ్డూ తరలింపు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లడ్డూ పంపిణీకి డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాత్రలో మిగిలిన లడ్డూను ఆరు భాగాలుగా విడగొట్టారు. వాటిని డీసీఎం వాహనాల్లో పెట్టి పోలీసు ఎస్కార్ట్‌తో మంటపం నుంచి తరలించారు. ఈ ప్రసాదాన్ని నగరంలోని వివిధ దేవాలయాల వద్ద ఉంచి పోలీసుల సమక్షంలో స్థానికంగా పంపిణీ చేశారు. ప్రసాదం వద్ద ఎలాంటి తొక్కిసలాట, లాఠీచార్జ్ జరగలేదని, ఊహించని విధంగా భక్తులు రావడమే గందరగోళానికి కారణమైందని కమలాసన్‌రెడ్డి వివరించారు. ప్రసాదం అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఖైరతాబాద్‌లో లడ్డూ కోసం గలాటా జరుగుతుండగానే తన వాటాగా వచ్చిన లడ్డూను మల్లిబాబు నగర శివార్లలో విక్రయించారంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై మల్లిబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రసాదంగా ఇచ్చిన లడ్డూను అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వాటాగా వచ్చిన లడ్డూను లారీలో స్వస్థలానికి తరలిస్తున్నాం. లారీ వెంట నా బంధువు రామకృష్ణ ఉన్నారు. లడ్డూను లారీలోకి ఎక్కించడం కోసం స్థానికంగా 10 మంది కూలీలను మాట్లాడుకున్నాం. వీరిని దారి మధ్యలో దింపాల్సి ఉన్నా.. లారీ ఆపేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో నగర శివార్ల వరకు వారిని తీసుకెళ్లాం. శివారుల్లో లారీ దిగిన కూలీలకు నా బంధువు రూ.2 వేలు చెల్లించారు. ఈలోపు ఎస్కార్ట్ పోలీసులు, వారి వెనుక స్కోడా కారులో వచ్చి మంత్రి సోదరుడిగా చెప్పుకున్న వ్యక్తి ప్రసాదంలో చాలా భాగం కవర్లలో వేసుకున్నారు. ఇది చూసిన ఓ మీడియా ఛానల్ విషయం తెలియక తప్పుగా ప్రసారం చేసింది’ అని పేర్కొన్నారు.