
పవన్ సభ వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన అభిమాని
సాక్షి, ఖమ్మం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. పవన్ సభా ప్రాంగాణానికి రావడంతో ఆయన్ను తాకేందుకు అభిమానులు ఎగబడ్డారు.
దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. చెల్లాచెదురైన పవన్ అభిమానులు ఒకవైపునకు పరుగు తీశారు. దీంతో ఆ వెనుకే మరికొందరిని అదుపు చేస్తున్న ఎస్సై చిరంజీవితో పాటు భద్రాద్రికి చెందిన ఓ అభిమాని కాలూ విరిగింది. పోలీసుల లాఠీ ఛార్జ్‌తో ఓ అభిమాని స్పృహ తప్పి పడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment