
పట్నా/బక్సార్: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బక్సార్ జిల్లా డుమ్రావ్ వైపు వెళ్తుండగా నందన్ గ్రామం దగ్గర్లో దళితవాడలో తాము పడుతున్న ఇబ్బందులను గమనించేందుకు రావాలని కేకలు వేస్తూ కొందరు సీఎం వాహన శ్రేణిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎంసహా ఎవరూ గాయపడలేదు. రాళ్లను ఎవరు, ఎందుకు విసిరారో తెలియాల్సి ఉంది. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ అధికార జేడీయూ.. ఆర్జేడీపై విమర్శలు చేసింది.