చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అటవీ అధికారులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వెంటనే ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లదాడి చేశారు.
వారినుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారైనట్టు సమాచారం. పరారైన కూలీల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.