Red scandal
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
హొసూరు (తమిళనాడు): తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా చెక్కినాంపట్టి గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన నాలుగు టన్నుల ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రొంపిచర్లలో మాస్ (35) అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. రొంపిచర్ల ఇన్స్పెక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు బృందంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చెక్కినాంపట్టి గ్రామంలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అప్పటికే స్మగ్లర్ కృష్ణమూర్తి పరారీ అయ్యాడు. అతని ఇంటి యజమాని రామకృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బాలాజీతో కలిసి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
తమిళ కూలీల కోసం కూంబింగ్
లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్‌జిల్లా): ఎర్రచందనం తరలించడానికి భారీ ఎత్తున తమిళ కూలీలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు విసృత స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు ప్రవేశించారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
గుత్తిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా టౌన్‌ప్లాజా వద్ద బెంగళూరుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. అది గమనించిన 30 ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారైనట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కూలీలను వెంటాడి వారిలో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం లోడ్‌తో (కెఎ 07 7939) నెంబర్ గల లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల రాళ్లదాడి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అటవీ అధికారులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వెంటనే ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లదాడి చేశారు. వారినుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారైనట్టు సమాచారం. పరారైన కూలీల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఇక ఎంతకాలమైనా భూముల లీజు
-
ఇక ఎంతకాలమైనా భూముల లీజు
- 33 సంవత్సరాల గరిష్ట కాలపరిమితి ఎత్తివేత - ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎన్నేళ్లకైనా లీజుకిచ్చేలా విధానంలో సవరణ - రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు - మినుము, పెసరకు అదనంగా రూ.వెయ్యి మద్దతు ధర - కరువు మండలాలపై పునఃపరిశీలన - ఇసుక, ఎర్రచందనం అక్రమరవాణా నిరోధానికి సీసీ కెమెరాలు - ప్రభుత్వ మద్యం షాపులూ ప్రైవేటు వ్యక్తులకే.. సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల లీజు విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల లీజుకు సంబంధించి 33 సంవత్సరాల గరిష్ట కాల పరిమితిని ఎత్తివేయనుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంతకాలమైనా భూములను లీజుకు తీసుకునేందుకు (ఫ్రీ హోల్డింగ్) వీలుగా విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు సీఎం చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులు మీడియాకు వెల్లడించారు. 33 సంవత్సరాల లీజు పరిమితి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విధానాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఇతర నిర్ణయాలు.. ► నవంబర్ నెలలో కేజీ కందిపప్పును.. రూ.140 మార్కెట్ రేటులో మూడో వంతును సబ్సిడీగా ఇచ్చి సరఫరా చేయాలి. ► రూ.5,100 ఉన్న మినుము, రూ.5,850 పెసర పంటల మద్దతు ధరను మరో వెయ్యి రూపాయలు పెంచాలి. ► రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాల ఎంపికపై పునఃపరిశీలన జరపాలి. 13 జిల్లాల్లో ఇంకా ఎక్కడ వర్షాభావం ఉందో చూసి అవసరమైతే కరువు మండలాల సంఖ్యను పెంచి అక్కడ 150 రోజుల పని దినాలను కల్పించాలి. ► రెవెన్యూ శాఖ ఇప్పటివరకు జారీ చేస్తున్న 67 సర్టిఫికెట్లను గణనీయంగా త గ్గించాలి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారికి ఇకపై ఆధార్, రేషన్ కార్డును బట్టి సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. ► మార్చిలోపు సాధ్యమైనంతమంది ఉద్యోగులను రాజధానికి తీసుకురావాలి. జూన్‌లోపు అందరినీ తరలించాలి. మేథా టవర్స్‌లో కొన్ని కార్యాలయాలు, విజయవాడ బందరు రోడ్డులోని 1.5 ఎకరాల ఆర్ అండ్ బీ స్థలంలో నాలుగు నెలల్లో భవనాలు నిర్మించి కొన్ని శాఖలు తరలించాలి. ఉద్యోగులకు వసతిపై కేబినెట్ సబ్‌కమిటీ జూన్ లోపు నిర్ణయం తీసుకుంటుంది. ఏప్రిల్‌లోపు రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించాలి. ► ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు శేషాచలం అడవుల్లో రూ.18 కోట్లతో 299 సీసీ కెమెరాల ఏర్పాటు. ► ఇసుక రీచ్‌లలో అక్రమాల నివారణకు 370 సీసీ కెమెరాల ఏర్పాటు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ఆర్డీఓ హైమావతిని ప్రత్యేక అధికారిగా నియమించాలి. ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి. ► కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 25న పది లక్షల మొక్కలు నాటాలి. ► 110 మున్సిపాల్టీల్లో అనధికారికంగా ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న అర్హులైన పేదలకు పట్టాలివ్వాలి. ► ఎక్సైజ్ విధానాన్ని మార్చాలి. ప్రభుత్వం నిర్వహించాలనుకున్న 438 షాపులకు కూడా వేలం నిర్వహించి ప్రైవేటు వారికి అప్పగించాలి. వారంలో వేలం నోటిఫికేషన్ విడుదలకు చర్యలు. 7వ తేదీలోగా కాపు కార్పొరేషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఈ కమిషన్ సమగ్రంగా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వాలి. నవంబర్ ఏడో తేదీలోపు రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి. ► జలవనరుల యూనివర్సిటీ ఏర్పాటు గురించి సమగ్ర వివరాలను సేకరించాలి. వచ్చే సోమవారం దీనిపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి. ► 9, 10 తేదీల్లో హెచ్ఎంఎస్ ఫేజ్-2, గాలేరు-నగరి ప్రాజెక్టుల వద్ద సీఎం బస కార్యక్రమం. ► ఆత్మహత్య చేసుకున్న నాగార్జునవర్సిటీ విద్యార్థిని కుటుంబానికి మోరంపూడి శాటిలైట్ టౌన్షిప్లో రూ.500 గజాల స్థలం మంజూరు. ► మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు 183 ఎకరాల కేటాయింపు. ► చిత్తూరు రేణిగుంట సమీపంలోని కుకివాకం దగ్గర ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 1.5 ఎకరాలను ఎకరం రూ.80 లక్షల చొప్పున కేటాయింపు. -
‘ఎర్ర’ స్మగ్లర్‌కు యువనేత రక్షణ!
- శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దారి తప్పిన దర్యాప్తు - ఒత్తిళ్లకు తలొగ్గిన ‘సిట్’ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు దారి తప్పిందా? విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) యువనేత ఒత్తిళ్లకు తలొగ్గిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎర్ర చందనం వృక్షాలను నరికే కూలీలను తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు రప్పించిన కీలక స్మగ్లర్‌ను సిట్ అధికారులు ఇప్పటికీ విచారించలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన అధికార టీడీపీ కీలక నేత ఒకరు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దిట్ట. యువనేతకు సన్నిహితుడైన ఆ నాయకుడు.. ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పచ్చ స్మగ్లర్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. ఆయనే తమిళనాడు నుంచి దళారీల ద్వారా ఏప్రిల్ 6న కూలీలను రప్పించారు. వారిని చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అదే రోజున అదుపులోకి తీసుకుని.. ఏప్రిల్ 7న ఎన్కౌంటర్ చేశారని తమిళనాడు ప్రజా సంఘాలు ఆరోపించాయి. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే తనకు సన్నిహితుడైన స్మగ్లర్‌కు ఇక్కట్లు తప్పవని భావించిన యువనేత ‘సిట్’ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దాంతో సిట్ అధికారులు స్మగ్లర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. -
మరో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో ఇరువరానికి చెందిన షేక్ అబ్దుల్ మజీబ్(36), రొంపిచెర్ల మండలం గానుగులచింతకు చెందిన కె.పురుషోత్తంరెడ్డి(28)లపై పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతించాలని గతేడాది డిసెంబర్ 20న చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఆ ఇద్దరూ తమకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం లేదని, పీడీ చట్టాన్ని ప్రయోగించవద్దని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై విచారించిన పీడీ యాక్ట్ సలహా మండలి ఆ ఇద్దరి దరఖాస్తులను దోచిపుచ్చింది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చింది. -
‘ఆర్’.. అంటే హడలే!
ఒకప్పుడు మావోయిస్టుల పేరు చెబితే ఉలిక్కిపడే పోలీసులు ప్రస్తుతం ‘ఆర్’ అక్షరానికి సంబంధించిన అంశాలంటే హడలిపోతున్నారట. ఏప్రిల్ నుంచి వరుసగా ఎదురవుతున్న సవాళ్ళే దీనికి కారణం. ‘ఎర్ర’దొంగల ఎన్కౌంటర్, రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు ఇష్యూ, రాజమండ్రి తొక్కిసలాట.. ఇలా ‘ఆర్’ అక్షరంతో ప్రారంభమైనవన్నీ పోలీసుల పీక మీదికి కత్తి తీసుకువచ్చినవే. శేషాచలం అడవుల్లో ఏప్రిల్ 7న ఎర్రచందనం దొంగల వేటకు ఏర్పాటైన యాంటీ టాస్క్‌ఫోర్స్ చేసిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడు కూలీలు చనిపోయారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పోలీసులపై కేసులు, న్యాయస్థానాల్లో విచారణ వరకూ వెళ్ళింది. ఈ ఎన్కౌంటర్ చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందో కూడా తెలియదు. ఈ వేడి చల్లారకముందే మే 31న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారం మరో కుదుపు కుదిపింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ఇస్తూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం, ‘ఓటుకు కోట్లు’లో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో వెలుగులోకి రావడం.. వెరసి రాష్ట్ర నిఘా విభాగం అధిపతిపై వేటు పడేవరకూ వెళ్ళింది. ఇక గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు చనిపోవడం పోలీసు విభాగానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది. పుష్కరాల అనంతరం కొందరు పోలీసు అధికారులపై వేటు తప్పదని తెలుస్తోంది. ఈ వరుస ఉదంతాల నేపథ్యంలో ‘ఆర్’తో కూడిన వ్యవహారాలంటేనే పోలీసు అధికారులు హడలిపోతున్నారని సమాచారం. -
రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: సిద్ధవటం అటవీప్రాంతంలో మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు సిద్ధవటం అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ ముగ్గురి వాంగ్మూలాలు తీసుకోండి
-
ఆ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను నమోదుచేయండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బస్సులో వెళుతున్న కూలీలను పట్టుకొచ్చి ఎన్కౌంటర్లో కాల్చి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో, బస్సులో మిగిలిన కూలీలతో పాటు ఉండి పోలీసులకు చిక్కకుండా తప్పికుంచుకున్న ముగ్గురు కూలీల వాంగ్మూలాల నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న అధికారికి స్పష్టం చేసింది. తరువాత ఆ వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తమిళనాడు వచ్చే ఈ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు తిరుపతిలో నమోదు చేయాలని, ఈ సందర్భంగా వారికి తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సులో వెళుతున్న వారిని పట్టుకుని వచ్చుంటే ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరే అవుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బస్సులో వెళుతున్న వారిని పట్టుకొచ్చారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆ ముగ్గురు వాంగ్మూలాల నమోదుకు ఆదేశాలు ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే మృతులకు రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన ధర్మాసనం, గత విచారణ సమయంలో ఈ కేసు దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారంతో 60 రోజుల గడువు పూర్తయిన నేపథ్యంలో తాజాగా ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఏం చేశాం.. ఇక ఏం చేయాలని భావిస్తున్నాం.. తదితర వివరాలను పొందుపరుస్తూ ఓ నివేదికను అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును పూర్తి చేసేందుకు తమకు మరింత గడువునివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది రఘునాథ్ జోక్యం చేసుకుంటూ, ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక ధర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించిన ప్రస్తావనే ఉందే తప్ప, కూలీలను కూల్చి చంపిన ఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించిన ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సిట్ ఏర్పాటు జీవోను పరిశీలించిన ధర్మాసనం, కూలీల ఎన్‌కౌంటర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అదనపు ఏజీని ప్రశ్నించింది. ఎన్కౌంటర్ ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేకపోయినా కూడా మూడు కేసుల్లోనూ సిట్ దర్యాప్తు చేస్తుందని శ్రీనివాస్ సమాధానమిచ్చారు. అసలు ఈ ఘటనకు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులున్నారా..? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఎన్కౌంటర్ జరిగినప్పుడు చూసిన వారెవ్వరూ లేరని రఘునాథ్ తెలిపారు. అయితే ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీలు బస్సులో వెళుతున్నప్పుడు వారిని పోలీసులు పట్టుకుని వచ్చి కాల్చి చంపారని, బస్సులో మిగిలిన కూలీలతో ఉన్న వారిలో ముగ్గురు తప్పించుకున్నారని. వెనుక ఆడవాళ్ల పక్కన కూర్చోవడంతో బతికిపోయారని వివరించారు. అయితే వారి వాంగ్మూలాలను నమోదు చేశారా..? అని ధర్మాసనం అదనపు ఏజీని ప్రశ్నించింది. లేదని, విచారణకు వారు సహకరించడం లేదని చెప్పడంతో, అయితే వారిని వాంగ్మూలాలు ఇవ్వాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. బస్సులో నుంచి పట్టుకొచ్చారన్న ఆరోపణలు నిజమైతే, ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని, వాంగ్మూలాల నమోదు సమయంలో ఆ న్యాయవాది ఏ విధంగా జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. నమోదు చేసిన వాంగ్మూలాలను తమ ముందుంచాలంటూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది. -
ఎర్రచందనం డంప్ స్వాధీనం
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం కనుగొన్నారు. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒకర్ని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం. -
దొంగలెవరు?
ఒంటిమిట్ట పోలీసుస్టేషన్లో దొంగల దర్జా 18 ఎర్రచందనం దుంగలు చోరీ చోరీపై నోరు మెదపని పోలీసులు ఎవరికైనా ఏదైనా కష్టమొస్తే వెంటనే పోలీసుస్టేషన్‌కు పరుగెత్తుకొస్తారు. అలాంటి పోలీసుస్టేషన్‌కే దిక్కు లేకుండా పోయింది. ఒక ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలో ఉన్న ఎర్రచందనం దుంగలను దొంగలెత్తుకుపోయారంటే జనం నోట మాట రావడం లేదు. వాళ్లు.. వాళ్లు.. కలిసిపోయారా లేక భయపడి మిన్నకుండిపోయారా అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదే. ఒంటిమిట్ట : సాక్షాత్తు ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలో ఉంచిన ఎర్రచందనం దుంగలను గురువారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లడం జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల భద్రతపై సందేహాలు రేకెత్తించింది. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పట్టుకున్న సుమారు 200 ఎర్రచందనం దుంగలను పోలీసుస్టేషన్ ఆవరణంలో భద్రపరిచారు. ఇటీవల టీడీపీ నేత, స్మగ్లర్ బోడె వెంకటరమణ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వంద దుంగ లు సైతం ఇందులో ఉన్నాయి. ఈ దుంగల్లోని 18 దుంగలు గురువారం రాత్రి అపహరణకు గురయ్యాయని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. అంతకు మించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుస్టేషన్లోనే దొంగతనం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుస్టేషన్ వెనుక వైపు నుంచి దొంగలు దుంగలను తీసుకెళ్లారు. రాత్రి సమయంలో ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఎన్ని సార్లు స్టేషన్‌కు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుంగలను దొంగలు ఎత్తుకెళ్తుండగా చూసిన కొందరు స్మగ్లర్ల దెబ్బకు భయపడి అక్కడికి వెళ్లలేకపోయినట్లు సమాచారం. జైల్లో ఉన్న బడా స్మగ్లర్ బొడ్డె వెంకటరమణను విచారణ నిమిత్తం ఒంటిమిట్ట పోలీసుస్టేషన్‌కు రెండు రోజుల క్రితం తీసుకొచ్చారు. తిరిగి అతన్ని సెంట్రల్ జైల్లో అప్పగించిన గురువారం రాత్రే ఈ దొంగతనం జరగడంతో అతనిపై అనుమానాలు బలపడుతున్నాయి. అతన్ని కలిసేందుకు వచ్చిన కొంత మంది నాయకుల సమాచారంతో స్మగ్లర్లు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతకు ముందు దాదాపు ఒక వారం పాటు బొడ్డె వెంకటరమణతో పాటు పలువురు స్మగ్లర్లు ఒంటిమిట్ట పోలీసుస్టేషన్లోనే బస చేశారు. ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ పరిస్థితుల గురించి బొడ్డె వెంకటరమణ, అతనితో పాటు ఉన్న వారు బయట వారికి వివరించి ఈ చోరీ జరిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పెద్ద సంఖ్యలో దుంగలు బయటకు తరలివెళ్లాయని సమాచారం. పోలీసులు మాత్రం 18 దుంగలే అని చెబుతున్నారు. బొడ్డె వెంకటరమణ కారులో తిరిగే మండలానికి చెందిన ఓ నాయకున్ని విచారిస్తే అసలు విషయాలు బయట పడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో పలుకుబడి ఉన్న అతన్ని విచారించేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్ కారులో దొరికిన రోజునే ఆ నాయకున్ని అదుపులోకి తీసుకుని విచారించి ఉంటే మరిన్ని వివరాలు లభించేవని కొందరు పోలీసులు భావిస్తున్నారు. దుంగల చోరీపై కేసు నమోదు చేశామని, ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ అశోక్‌కుమార్ చెప్పారు. -
'షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ కావాలి'
ఆయుధాలతో సంచరిస్తూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను అడ్డుకోవాలంటే పోలీసులకు కాల్పులు జరిపే అధికారం ఉండాలని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు అన్నారు. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తమకు ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చిని పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వ సహకారం లభించడంలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 75 మంది పోలీసులు, 16 మంది అటవీశాఖ సిబ్బందితో టాస్క్ఫోర్సు బృందం పనిచేస్తోందని, దీనిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసోం రాష్ట్రంలో స్మగ్లర్లు పోలీసులపై తిరగబడితే కాల్చేసే అధికారం ఉందని, దీనిపై ఎలాంటి కేసు కూడా ఉండదన్నారు. ఆ తరహా అనుమతి కోసం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసి, స్పందన కోసం నిరీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయలసీమతో పాటు మొత్తం ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత టాస్క్‌ఫోర్సుపై ఉందని, మొత్తం 463 పోస్టులు మంజూరయితే ఇప్పటి వరకు 91 మందినే కేటాయించారని వివరించారు. -
ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణించాలి
ట్రైనీ ఎఫ్ఆర్ఓల సదస్సులో అడిషనల్ పీసీసీఎఫ్ సారంగి కడప అర్బన్ : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్ల పరిధిలో అపారంగా విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్త్రీయంగా గణన చేయాలని అటవీశాఖ ప్రణాళిక విభాగం రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి అన్నారు. సోమవారం కడప నగరంలోని పశుసంవర్దకశాఖ జేడీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ట్రైనీ ఎఫ్ఆర్ఓల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి, ఇన్‌ఛార్జి వర్కింగ్ ప్లాన్ సీసీఎఫ్ రాజేశ్వరి, అధికారులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ట్రైనీ ఎఫ్ఆర్ఓలు 43 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎర్రచందనంపై సమగ్రంగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా అడిషనల్ పీసీసీఎఫ్ పీకే సారంగి మాట్లాడుతూ జిల్లాలో 3.14 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందన్నారు. ప్రతి ఎఫ్ఆర్ఓ 0.1 హెక్టారు నుంచి తమ పరిధిలో విస్తరించిన ఎర్రచందనాన్ని శాస్తీయంగా గణన చేయాలన్నారు. ఎంత మేరకు ఎర్రచందనం విస్తరించి ఉంది? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ కేటగిరికి చెందినవి? అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గణన చేయాలన్నారు. మూడు రోజులపాటు ఈనెల 24 నుంచి 26వ తేది వరకు సమగ్రంగా గణన చేసిన తర్వాత ఆయా డీఎఫ్ఓలకు నివేదిక పంపాలన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడప డీఎఫ్ఓ నాగరాజు, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి, బద్వేలు సబ్ డీఎఫ్ఓ వెంకటేశు, జిల్లాలోని ఎఫ్ఆర్ఓలు, ట్రైనీ ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. -
నిఘా కళ్లకు గంతలు
రాజంపేట: స్మగ్లర్లు నిఘా కళ్లకు గంతలు కట్టి ఎర్రచందనం రవాణాలో సరికొత్త మార్గం ఎంచుకున్నారు. ఇన్నాళ్లుగా దుంగల రూపంలో విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి స్వస్తి చెప్పి... బొమ్మల రూపంలో ఎర్రబంగారంను తరలిస్తున్నారు. బెంగళూరు పోలీసులు తాజాగా పలువురిని అరెస్టు చేయడంతో ఎర్రబొమ్మల స్మగ్లింగ్ వెలుగు చూసింది. దీంతో ఎపీ పోలీసులు అప్రమత్తమయ్యూరు. బొమ్మల రూపంలో భారీగా బరువు కలిగిన దుంగలను తరిలించడం వల్ల లబ్ధి పొందవచ్చునని స్మగ్లర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అటవీ నిఘా వర్గాలు గుర్తించారుు. నాణ్యత కలిగిన దుంగలతో బొమ్మలను తయారుచేసి రూ50వేల నుంచి రూ.1లక్షదాకా అమ్ముతున్నారు. చైనాలో కిలోబరువు ఉన్న బొమ్మ రూ.2లక్షలు దాకా పలుకుతుంది. గ్రేడ్-1 దుంగలను కిలో రూ7వేల వంతను కొనుగోలు చేయడం ద్వారా బొమ్మల బిజినెస్ నిర్వహిస్తున్నారు. చైనా నుంచి బెంగళూరు, చెన్నై, గోవా తదితర పర్యాటక ప్రదేశాలకు వచ్చే విదేశీయులతో బొమ్మసైజు, బరువుపై ఆర్డర్లు తీసుకోవడం జరుగుతోంది. బెంగుళూరులోని హొసకోట వద్ద ఓ గోడౌన్ తీసుకుని అక్కడి నుంచి ఆర్డర్లు విదేశాలకు వెళుతున్నాయని అటు కర్నాటక, ఇటు ఆంద్రప్రదేశ్ పోలీసులు దృష్టి సారించారు. పట్టుబడిన వారి నుంచి సమాచారం రాబేట్టందుకు రంగంలోకి యాంటీ రెడ్ శ్యాండిల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు అటవీ వర్గాల సమాచారం. అయితే అధికారికంగా రాజంపేట ఫార్టెసు డివిజన్ పరిధిలో శెట్టిగుంట, లక్ష్మింగారిపల్లెలో కొయ్య బొమ్మల తయారీతో జీవనం సాగిస్తున్నారు. లే పాక్షికి ఈ బొమ్మలు సరఫరా చేస్తున్నారు. ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులకు గతంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందచేసిన సంగతి విధితమే. ఇప్పుడైతే ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. అటవీమార్గాల్లో నిఘానేత్రాలు.. శేషాచలం అటవీ మార్గాల్లో నిఘానేత్రాలు ఏర్పాటుచేసే దిశగా అటవీశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కడప, రాజంపేట ప్రాంతాల పరిధిలో విస్తరించిన శేషాచల అటవీ ప్రాంతాల్లో సీసీ కెమారాలు పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా హైదరాబాదులో ఇదే విషయంపై పీసీసీఎఫ్ జోసెఫ్ ఇతర అధికారులతో సమీక్షించారు. శేషాచలం అటవీ పరిధిలో రాజంపేట డివిజన్లో 57వేల హెక్టార్లు, కడప డివిజన్ పరిధిలో 20వేల హెక్టార్లలో, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 48వేల హెక్టార్లలో విస్తరించి ఉందని అటవీ రికార్డులు చెపుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పరిరక్షించుకునేందుకు అటవీశాఖ దృష్టి సారించింది. ఎర్రచందనం చెట్లను లెక్కించే ప్రక్రియను కూడా ఇది వరకే చేపట్టారు. ఎర్రచందనం లెక్కతేల్చేందుకు ఇంటర్నేషనల్ ప్రమాణాలు కలిగిన కన్సల్టెంట్‌ను నియమించేందుకు సన్నాహాలు అటవీశాఖ చేస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి శేషాచలంఅటవీ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి పెట్టింది. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశం పరిశీలిస్తున్నారు. చెక్‌పోస్టులలో కొయ్యబొమ్మలు వెళుతున్నా పట్టుకోవడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో చిన్న, పెద్దచెట్లను లెక్కిస్తున్నాం. వెంకటేశ్, డీఎఫ్ఓ, రాజంపేట నిఘా కళ్లు, ఎర్రచందనం, విదేశాలకు ఎగుమతి, Surveillance eyes, red scandal, exported -
రక్షిస్తారా.. శిక్షిస్తారా..
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముద్దనూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయ పరిధిలో సుమారు 140 ఎర్రచందనం దుంగలు మాయమైన విషయం తెలిసిందే. అయితే కార్యాలయంలో పని చేసే సిబ్బందే కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో వేరే దుంగలను ఉంచారు. అంతకు ముందు దుంగలు పోయిన సంఘటనపై అధికారులు విచారణ జరుపగా సుమారు 140 దుంగలు కనిపించలేదని తేలింది. దీంతో ఆగమేఘాల మీద సిబ్బంది కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో మరో చోట నుంచి తెచ్చి గోడౌన్లో గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారు. అయితే ముద్దనూరులో ఉన్న ఎర్రచందనాన్ని ప్రొద్దుటూరు గోడౌన్‌కు తరలించే క్రమంలో కొలతల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ప్రొద్దుటూరు డీఎఫ్ఓ ఎఫ్ఆర్ఓను నియమించారు. ఆ అధికారి దుంగల కొలతలను పరిశీలించారు. రెండు రోజుల క్రితమే అధికారి పూర్తి స్థాయిలో కొలతలు, తూకం వేసి డీఎఫ్‌ఓకు నివేదిక ఇచ్చారు. దుంగలు ఉన్నాయి.. కొలతల్లో భారీ తేడా ప్రొద్దుటూరు గోడౌన్లో ఉన్న ముద్దనూరుకు సంబంధించిన చందనం దుంగులన్నీ ఉన్నప్పటికీ వాటి కొలతల్లో భారీ తేడా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అయితే గతంలో ఉన్న కొలతల కంటే ఎక్కువ ఉన్నాయని, తూకం విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. పోయిన దుంగల సంఖ్య అయితే సరిపోయింది కానీ.. అంతే తూకం, కొలతలు కలిగిన దుంగలను మాత్రం ఇంటి దొంగలు సమకూర్చలేక పోయారు. నివేదికను పరిశీలించిన తర్వాత డీఎఫ్ఓ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దుంగలు మాయమైనట్లు దాదాపుగా నిర్ధారణ అయినట్లే. మరి ఉన్నతాధికారులు ఇంటి దొంగలను రక్షిస్తారా లేక వేటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది తమకు ముప్పు రాకుండా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇంటి దొంగల వింత వాదన.. అధికారి విచారణ చేసిన తర్వాత దుంగల కొలతల్లోనూ. తూకంలో వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. 140 దుంగల్లోనూ వ్యత్యాసం కనిపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఉన్న వాటి కంటే కొలతలు, తూకం ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలడంతో ఇంటి దొంగలు వింతగా వాదిస్తున్నారు. కావలసిన దానికంటే తక్కువగా ఉంటే ఆలోచించాలి కానీ ఎక్కువగా ఉంటే అటవీశాఖకు మేలే కదా అని వాదిస్తున్నారు. ఇందులో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వారు అధికారులతో అన్నట్లు తెలిసింది. ఇప్పుడే నివేదిక అందింది.. ముద్దనూరు అటవీ కార్యాలయ పరిధిలో ఉన్న ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంలో విచారణ నివేదిక వచ్చిందని డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి అన్నారు. ఇంకా నివేదిక చూడలేదని, చూశాక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
దొంగ .. దొంగా దొరకవేం..!
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తాం... అటు అటవీశాఖ అటు పోలీసులు రోజుకొక్కసారైనా చెబుతున్న మాట. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి స్మగ్లింగ్ నిరోధిస్తామని పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన.. ఎవరెన్ని చెప్పినా... దొరికితే కదా దొంగలం అనే తరహాలో పలువురు స్మగ్లర్లు దర్జాగా తిరిగుతున్నారు. నిత్యం వందలాది కేసులు నమోదు అవుతుండగా పొట్టకూటికోసం వచ్చిన కూలీలు, చిన్నచిన్న దొంగలు తప్ప బడా దొంగలను పట్టుకున్నది తక్కువే. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొంద మంది మీద అసలు కేసులు ఉన్నట్లే అధికారులు మరిచిపోయూరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో త్వరలో పట్టుకుంటామనే ప్రకటనలు తప్ప వాస్తవం అందుకు విరుద్ధం. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న నిందితుల్లో అటవీశాఖ అధికారులు కొందరిని అదుపులోకి తీసుకున్నా పలువురు పారిపోయూరు. ఒక్క ప్రొద్దుటూరు డివిజన్‌లోనే ఇలా కేసులు నమోదైన సుమారు 40 మంది నిందితులను అధికారులు ఏళ్లుగా చేయలేదు. అటవీశాఖ అధికారులు వారిపై కనికరం చూపిస్తున్నారో.. లేక విశ్వాసం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల ప్రొద్దుటూరు డీఎఫ్ఓ కార్యాలయానికి వచ్చిన కర్నూల్ కన్జర్వేటర్ శాంతిప్రియాపాండే రికార్డుల్లో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇంత వరకూ అధికారులు పాత నిందితులను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ప్రొద్దుటూరు బీట్‌లోనే 40 మంది స్మగ్లర్లు.. ప్రొద్దుటూరు ఫారెస్ట్ బీట్‌లో 2006 నుంచి 2014 వరకూ 121 మందిపై సుమారు 30 ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. వారిలో కేవలం 81 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. మిగిలిన వారిలో ఒక్కరిని కూడా గత 7-8 ఏళ్ల నుంచి అరెస్ట్ చేయలేదు. ఉన్నతాధికారులు ఎన్నిమార్లు దీనిపై ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదు. అడపాదడపా బీట్ల తనిఖీలు, శాఖాపరమైన సమావేశాలకు హాజరు కావడంతో సరిపెడుతున్నారు. మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్లు సునీల్, రామనాథ్‌రెడ్డి.. అంతర్జాతీయ స్మగ్లర్ రామనాథరెడ్డి, ఇటీవల పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న కిడ్నాపర్ మండ్ల సునీల్‌లపై ఎర్రచందనం కేసులు ఉన్నాయి. 2010లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా సునీల్ గ్యాంగ్ రూరల్ పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న వారిలో దొర్నిపాడు శివ, రేవనూరు రామిరెడ్డి ఉన్నారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించగా అటవీశాఖ అధికారులు 82/2010-11 ఓఆర్ నెంబర్ కింద కేసు నమోదు చేశారు. అలాగే 2012లో మడూరు రోడ్డులో పోలీసులు రామనాథరెడ్డి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. ప్రధాన స్మగ్లర్ అయిన రామనాథరెడ్డితో పాటు బద్వేల్ శ్రీను, మునెయ్య, చెండ్లూరు ప్రసాద్, శంకర్ దొరకలేదు. దీనిపై అటవీశాఖ అధికారులు 24-ఎ/2012-13 ఓఆర్ నెంబర్ కింద కేసు నమోదు చేశారు. 2012లో కూడా రామనాధరెడ్డిపై ఎర్రచందనం కేసు నమోదు అయింది. ఓఆర్ నెంబర్ 60/2011-12 కేసులో రామనాథరెడ్డితో పాటు ప్రొద్దుటూరులోని కొంపలపుల్లన్న వీధిలో ఉంటున్న నవాబ్బాషాలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవలే రామనాథరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా వివిధ కేసుల్లో రిమాండులో ఉన్న మండ్ల సునీల్‌ను అధికారులు ఇంత వరకూ పిటి వారెంట్‌పై తీసుకు వచ్చి కోర్టులో హాజరు పరచిన దాఖలాలు లేవు. గత ఏడాది ముద్దనూరు రేంజ్లో కేసు నమోదు కాగా అక్కడి అటవీశాఖ అధికారులు పీటీ వారెంట్‌పై సునీల్‌ను కోర్టులో హాజరు పరిచారు. కానీ ఇక్కడి అధికారులు సునీల్‌పై కేసు ఉన్న విషయాన్నే మరచిపోయారనిపిస్తోంది. దర్జాగా తిరుగుతున్న స్మగ్లర్లు.. పరారీలో ఉన్న పలువురు అధికారులకు దొరకకుండా దర్జాగా బయట తిరుగుతూ చందనం దందా కొనసాగిస్తున్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుగుతుండగా, మరి కొందరు అధికారుల ఆశీస్సులతోనే నేరాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు వ్యాపార వేత్తలుగా చలామణి అవుతూ చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన నవాజ్‌బాషా అలియాస్ లిబర్టీ బాషా, వన్‌టౌన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమీర్, వల్లపు ఆదినారాయణ, ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన దస్తగిరి, ప్రాఫిట్వల్లి, కొండపల్లి మస్తాన్‌లతో పాటు చాలా మంది ఎర్రదొంగలు అటవీశాఖ అధికారులకు దొరకకుండా తిరుగుతున్నారు. నవాజ్‌బాషా, మస్తాన్, దస్తగిరి తరచూ ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొందరు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. వీరికి నిత్యం అటవీశాఖలోని కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల కదలికలు, నాకా బంది ఎక్కడ చేస్తారు, ఏ రోజు చేస్తారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మగ్లర్లకు చేరవేస్తున్నారు. 15 రోజుల్లో 20 మందిని పట్టుకుంటాం.. కేసులు నమోదై తప్పించుకొని తిరుగుతున్న వారిని 15 రోజుల్లో పట్టుకుంటామని డిప్యూటి రేంజ్ అధికారి లక్ష్మీనరసయ్య న్యూస్‌లైన్‌తో అన్నారు. ఇప్పటికే 20 మందిని గుర్తించామన్నారు. మండ్ల సునీల్, రామనాథరెడ్డిలపై కేసులు ఉన్నట్లు ఇన్ని రోజుల నుంచి తనకు తెలియదని అన్నారు. వాళ్లిద్దరిని పీటీ వారెంట్‌పై తీసుకుని వచ్చి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. -
ఎర్రచందనం ‘ఎ’ గ్రేడ్ టన్ను ధర 1.95 కోట్లు
ఈ-వేలానికి భారీ స్పందన తొలిరోజు పాల్గొన్నవారు 267మంది సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. 4,160 టన్నుల ఎర్రచందనం విక్రయించడానికి ప్రభుత్వం ఈ-వేలంలో భాగంగా తొలి రోజు సోమవారం 30 లాట్లకు వేలం నిర్వహించారు. టన్ను ఎర్రచందనం ఎ-గ్రేడ్‌కు గరిష్టంగా రూ. 1.95 కోట్లు, బి-గ్రేడ్‌కు గరిష్ట ధర రూ. 1.55 కోట్లు, కనిష్ట ధర రూ.56.65 లక్షల ధర పలికింది. సి-గ్రేడ్‌కు రూ. 16.51 లక్షల నుంచి రూ. 35.16 లక్షల వరకు ధరలు కోట్ చేశారు. తిరుపతి డిపోలో ఉన్న 30 లాట్లుగా విభజించిన 862 టన్నుల ఎర్రచందనం విక్రయానికి ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలం వివరాలను మంగళవారం అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఏవీ జోసెఫ్‌తో కలిసి పీకే ఝా వెల్లడించారు. -
28మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
చిత్తూరు: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యద్ధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న 28మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నుంచి బాకరాపేటకు వస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
కానూరులో 30 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. వీరి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనేవుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్ గోడౌన్లో సోమవారం దాడులు జరిపారు. అక్కడి గోడౌన్లో అక్రమంగా దాచి ఉంచిన 30 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 50 కోట్ల విలువ ఉండవచ్చునని అంచనా. కాగా, కడప జిల్లా రాయచోటికి చెందిన నరేష్ రెడ్డి అనే వ్యక్తిని తిరుపతిలో పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకు ఓ సంచలనమైన విషయాన్ని వెల్లడించాడు. విజయవాడలో దాచిన ఎర్రచందనం డంప్ విషయాన్ని చెప్పాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు డంప్ దాచిపెట్టిన కానూరు గోడౌన్‌పై దాడులు జరిపి విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం కొనుగోలుకు చైనీయుల ఆసక్తి
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించే ఎర్రచందనం వేలంలో పాల్గొని పెద్ద మొత్తంలో ఆ దుంగలను కొనడానికి చైనా వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఎర్రచందనం వేలంపై ప్రచారం చేయడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం వెల్లడించింది. ముగ్గురితో కూడిన ఆ బృందం శుక్రవారం బీజింగ్‌లో వంద మంది వ్యాపారులను కలసి ఎర్రచందనం వేలంలో పాల్గొనాల్సిందిగా కోరింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల్లో 8,500 మెట్రిక్ టన్నుల అమ్మకానికి సంబంధించి వచ్చే నెల 8న నిర్వహిస్తున్న ఈ-టెండర్, ఈ-ఆక్షన్‌లో పాల్గొనాలని చైనా వ్యాపారులను కోరామని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.కె.ఝా పీటీఐ్థకు తెలిపారు. -
గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ఇతడిపై ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌తో అదే నెల 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.