హొసూరు (తమిళనాడు): తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా చెక్కినాంపట్టి గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన నాలుగు టన్నుల ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రొంపిచర్లలో మాస్ (35) అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు.
రొంపిచర్ల ఇన్‌స్పెక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు బృందంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చెక్కినాంపట్టి గ్రామంలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అప్పటికే స్మగ్లర్ కృష్ణమూర్తి పరారీ అయ్యాడు. అతని ఇంటి యజమాని రామకృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బాలాజీతో కలిసి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Fri, Jul 15 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement