మరో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ | PD act filed on another two red scandal smugglers | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్

Published Sat, Aug 22 2015 9:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్‌లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్‌లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో ఇరువరానికి చెందిన షేక్ అబ్దుల్ మజీబ్(36), రొంపిచెర్ల మండలం గానుగులచింతకు చెందిన కె.పురుషోత్తంరెడ్డి(28)లపై పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి.

ఆ ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతించాలని గతేడాది డిసెంబర్ 20న చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఆ ఇద్దరూ తమకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం లేదని, పీడీ చట్టాన్ని ప్రయోగించవద్దని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై విచారించిన పీడీ యాక్ట్ సలహా మండలి ఆ ఇద్దరి దరఖాస్తులను దోచిపుచ్చింది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement