ఎర్రచందనం కొనుగోలుకు చైనీయుల ఆసక్తి | Chinese interested to purchase Red scandal | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కొనుగోలుకు చైనీయుల ఆసక్తి

Published Sun, Sep 21 2014 3:14 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

Chinese interested to purchase Red scandal

బీజింగ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించే ఎర్రచందనం వేలంలో పాల్గొని పెద్ద మొత్తంలో ఆ దుంగలను కొనడానికి చైనా వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఎర్రచందనం వేలంపై ప్రచారం చేయడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం వెల్లడించింది. ముగ్గురితో కూడిన ఆ బృందం శుక్రవారం బీజింగ్‌లో వంద మంది వ్యాపారులను కలసి ఎర్రచందనం వేలంలో పాల్గొనాల్సిందిగా కోరింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల్లో 8,500 మెట్రిక్ టన్నుల అమ్మకానికి సంబంధించి వచ్చే నెల 8న నిర్వహిస్తున్న ఈ-టెండర్, ఈ-ఆక్షన్‌లో పాల్గొనాలని చైనా వ్యాపారులను కోరామని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.కె.ఝా పీటీఐ్థకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement