శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బస్సులో వెళుతున్న కూలీలను పట్టుకొచ్చి ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో, బస్సులో మిగిలిన కూలీలతో పాటు ఉండి పోలీసులకు చిక్కకుండా తప్పికుంచుకున్న ముగ్గురు కూలీల వాంగ్మూలాల నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న అధికారికి స్పష్టం చేసింది.