ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం కనుగొన్నారు. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒకర్ని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం.