సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీల పరిశీలించగా, చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదు. గాయాలైన వ్యక్తుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు నిర్ధారణ అయ్యింది. చంద్రబాబు సభలో రాయి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
కాగా, తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి విదితమే. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు.
చదవండి:
ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో!
నవరత్నాల క్యాలెండర్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment