Tirupati by-election
-
తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ..
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలతో జిల్లాలో టీడీపీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ గడిచిన రెండేళ్లుగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా, ఆ పార్టీని ఓడించిన ప్రజలను దూషిస్తూ, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ రాజకీయాలు చేసింది. వీటిని పట్టించుకోని ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోకడలకు మరోసారి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఆ పార్టీ పరిస్థితి “మిడతం బొట్లు’ మాదిరిగా ఉండేది. పోటీలోకి దిగడమే కాక ఎన్నికల ప్రచారంలోనూ ఓటర్లను, ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడంతో మరోసారి కొట్టిన ఓటు దెబ్బ చెంప పెట్టు అయింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో జనాదరణ కోల్పోయింది. నానాటికి పార్టీ క్షీణదశకు చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలతో మొదలైన ఆ పార్టీ పతనం.. తాజాగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలతో సమాధి దశకు చేరుకుంది. రెండేళ్ల క్రితం అధికారంలో ఉన్న ఆ పార్టీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 36 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంటే.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 32 శాతం ఓట్ షేర్‌కు పతనమైంది. సాధారణంగా రెండేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. కానీ ఇందుకు భిన్నంగా అధికార పారీ్టకి ప్రజాదరణ, ఓట్ షేర్ పెరగడం విశేషం. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలకే దిమ్మ తిరిగేలా ఫలితాలు వెలువడ్డాయి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీకి దీటుగా ఓట్లు సాధించలేని పరిస్థితి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వారం రోజులకు పైగా జిల్లాలో మకాం వేసి ప్రతి నియోజకవర్గంలో రోడ్‌షోలు, డోర్‌టు డోర్ క్యాంపెయిన్లు, సమీక్షలతో నానా హడావుడి చేసినా ఓటర్లే కాదు టీడీపీ క్యాడర్ కూడా పట్టించుకోలేదు. పర్యవసానంగా నాలుగు నియోజకవర్గాల్లో పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓట్లు దక్కించుకోలేని స్థితిలోకి ప్రధాన ప్రతిపక్షం పడిపోయింది. ఓటు బ్యాంక్ పతనం దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి జిల్లాలో గట్టి ఓటు బ్యాంక్ ఉండేది. గతంలో అనేక దఫాలుగా ఆ పారీ్టకి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా, ప్రజలను, పార్టీ కేడర్‌ను గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, తన పరిపాలన విధానంతో ప్రతి వర్గాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ఈ పరిణామాలే ఆ పార్టీ శాపంగా పరిణమించారు. గెలుపోటములు ఎన్నికల్లో సర్వసాధారణమే అయినా.. టీడీపీ అధినేత నుంచి క్షేత్ర స్థాయిలో సెకండ్ లీడర్ల స్థాయి వరకు హుందాతనం రాజకీయాలు వదిలేశారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించపోగా, ఓడించారని ప్రజలను దుర్భాషలు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు, కుతంత్రాలు, సీఎంపై వ్యక్తి గత దూషణలకే ప్రాధాన్యత ఇచ్చింది.ఇవే ఆ పార్టీ పతనానికి సమాధి రాళ్లు అయ్యాయి. రెండేళ్ల తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తన పంథాను మార్చుకోకపోవడంతో ప్రజలు దిమ్మదిరిగే షాక్‌ను ఇచ్చారు. ఇన్నాళ్లు ఆ పార్టీ కోసం కష్టపడిన నేతలతో పాటు ఆదరించిన అభిమానులు దూరమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోల్పోతూ వచ్చింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ 2019 ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల నాటికి 69,537 ఓట్లను కోల్పోయింది. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ 32 శాతానికి మించి ఓటింగ్ షేర్ దక్కని పరిస్థి«తి. ఓ వైపు కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి ఏర్పడింది. మరి కొన్నిచోట్ల నాయకుల హడావుడి తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజల ఆదరణ లేకపోవడం టీడీపీ నేతలకు గట్టి షాక్‌ని మిగిల్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సూళ్లూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో టీడీపీకి 2,74,110 ఓట్లు దక్కాయి. సరిగ్గా రెండేళ్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల్లో 2,04,573 ఓట్లు దక్కాయి. అంటే 69,537 ఓట్లు తగ్గడంపై నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీకి 30 వేలు లోపే జిల్లాలో జాతీయ పార్టీ బీజేపీ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆకాశమే హద్దుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో పాటు మతతత్వ రాజకీయాలతో లబ్ధి పొందడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు బలంగా తిప్పి కొట్టారు. పర్యవసానంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం 9 వేల ఓట్లు కూడా రాని పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా తిరిగి మండలాల వారీగా విస్తృత ప్రచారం చేసినా కమలం వైపు ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపినా 29,800 ఓట్లు దక్కాయి. సర్వేపల్లిలో 7,025 ఓట్లు, గూడూరులో 6,613, సూళ్లూరుపేటలో 8,890, వెంకటగిరిలో 7,280 ఓట్లు లభించాయి. జిల్లాలో బీజేపీకి నాయకులు లెక్కకు మించి ఉండడం విశేషం. నేల విడిచి స్వాము చేసినా.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోకి ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నేల విడిచి స్వాము చేసినా ప్రజలు ఆదరించలేదు. ప్రతి నియోజకవర్గంలో రోడ్‌షో, కొన్ని చోట్ల డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడంతో పాటు ప్రతి నియోజక వర్గంలోనూ సమీక్షలు నిర్వహించి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎన్నికల ప్రారంభం నుంచే జిల్లాలో హడావుడి చేసిన టీడీపీ ముఖ్య నేతలంతా ఎన్నికలకు ముఖం చాటేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా మాట్లాడారు. ప్రతి చోటా ఇదే ఫార్మూలా పాటించినప్పటికీ ప్రజల నుంచే కాకుండా టీడీపీ క్యాడర్ నుంచి కూడా స్పందన రాని పరిస్థితి. జిల్లాలో టీడీపీ కీలక నేతలుగా చెలామణి అవుతున్న బీద రవిచంద్ర ఎన్నికలకు పూర్తిగా ముఖం చాటేయగా, జిల్లా అంతా టీడీపీకి తానే అంటూ హడావుడి చేసిన సోమిరెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో మిగిలిన నియోజకవర్గాల కంటే భారీగా ఓట్లకు గండి పడడం విశేషం. 2019లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి వచ్చిన ఓట్లలో 31,957, గూడూరులో 12,619, సూళ్లూరుపేటలో 3,122, వెంకటగిరిలో 21,839 ఓట్లు కంటే తగ్గాయి. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం పేరుతో భారీగా హడావుడి చేసినా కనీసం క్యాడర్ కూడా పట్టించుకోని పరిస్థితి. ఇక గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునిల్‌కుమార్ అంతగా పట్టించుకోకపోవడంతో అభ్యర్థి పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో వారే పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టారు. అయినా కానీ అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ నాలుగు రోజులు హడావుడి చేసి ముఖం చాటేశారు. సూళ్లూరుపేటలోని నేతలది ఇదే పరిస్థితి. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్ తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. తన సిట్టింగ్ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైఎస్సార్ సీపీ 65.85%, తెలుగుదేశం పార్టీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మే 2వ తేదీ ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది?
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీల పరిశీలించగా, చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదు. గాయాలైన వ్యక్తుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు నిర్ధారణ అయ్యింది. చంద్రబాబు సభలో రాయి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపిన సంగతి విదితమే. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు. చదవండి: ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో! నవరత్నాల క్యాలెండర్ విడుదల -
తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వీరంగం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు -
‘టీడీపీ త్వరలో తెరమరుగయ్యే పార్టీ’
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల ఆదరణతో వైఎస్సార్సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సీఎం జగన్ జననేతగా ఎదిగారు. ఏడాదిన్నరకాలంగా సీఎం జగన్ నవరత్నాలతో నవశకాన్ని తెచ్చారు. టీడీపీ త్వరలోనే తెరమరుగయ్యే పార్టీల్లో ఒకటి. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్‌కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి బీజేపీ దిగజారిపోయింది’’ అని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చదవండి: ‘కూన’ గణం.. క్రూర గుణం బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ -
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ వినిపించాలి’
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్‌లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం జగన్‌దన్నారు. మాధవి, నందిగం సురేష్‌లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్‌కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు. చదవండి: కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి -
ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. తిరుపతి, కర్నాటకలోని బెల్గాం లోక్‌సభ స్థానాలు, తెలంగాణ లోని నాగార్జునసాగర్ సహా వివిధ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ షెడ్యూల్లో తెలిపింది. ఈ ఎన్నికలకు మార్చి 23న నోటిఫికేషన్ జారీకానుంది. పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్లను వినియోగించనుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉంటాయో ఆ జిల్లాలో ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గం రాష్ట్ర రాజధాని పరిధిలోగాని, మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోగానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగానీ ఉంటే ఎన్నికల నియమావళి కేవలం ఆ నియోజకవర్గ పరిధికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 2021 జనవరి ఒకటో తేదీ నాటికి ఖరారైన ఓటర్ల జాబితాతో ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 30–03–2021 నామినేషన్ల స్క్రూటినీ: 31–03–2021 నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 03–04–2021 పోలింగ్ తేదీ: 17–04–2021 కౌంటింగ్ తేదీ: 02–05–2021 -
2,94,781 మంది ఓటర్లు
తిరుపతి ఉపఎన్నికలో ఓటు వినియోగానికి అవకాశం తుది జాబితా విడుదల చేసిన ఆర్వో తిరుపతి తుడా: తిరుపతి ఓటర్ల తుది జాబితా ను ఆర్వో వీ.వీరబ్రహ్మయ్య మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో విడుదల చేశారు. 2015 జనవరి 27 నాటికి 2,94,781 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. పురుషులు-1,50,043, మహిళలు-1,44,699, ఇతరులు- 39 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ నెల 13న జరగనున్న తిరుపతి ఉపఎన్నికలో వీరంతా ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లను అధికారులు క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత జాబితాను విడుదల చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లకు ఆదేశం పోలింగ్ దగ్గరకు సమీపిస్తుండటంతో ఆర్వో ఏర్పాట్లపై దృష్టి సారించారు. తిరుపతి అసెంబ్లీలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అవసరమయ్యే ఏర్పాట్లును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లో తాగునీరు, లైటింగ్, బారికేడ్లు స్టేషన్ నంబర్లు కనిపించేలా అతికించడం వంటి వాటిపై దృష్టి సారించాలని పీవో, ఏపీవోలకు ఆదేశాలు జారీ చేశారు.