
ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు.
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు.
చదవండి:
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వీరంగం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు