ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్‌ సీపీదే హవా | Tirupati By Election Exit Polls: YSRCP Will Be Win Once Again | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్‌ సీపీదే హవా

Published Thu, Apr 29 2021 7:15 PM | Last Updated on Thu, Apr 29 2021 7:42 PM

Tirupati By Election Exit Polls: YSRCP Will Be Win Once Again - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు వైఎస్సార్‌ సీపీ 65.85%, తెలుగుదేశం పార్టీ 23.10%, బీజేపీ 7.34% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది.

ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయని స్పష్టం చేసింది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించనున్నారని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మే 2వ తేదీ ఆదివారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.



చదవండి: 
మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి
ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement