
పగిలిన బస్సు అద్దాలను చూపుతున్న డ్రైవర్ బాబా
నవీపేట/భైంసా(ముథోల్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) శివారులో ఆర్టీసీ బస్సుపై దుండగులు దాడికి యత్నించారు. హైదరాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న బస్సుపై శనివారం అర్ధరాత్రి దాటాక.. ప్రధాన రహదారిపైకి చేరిన దొంగలు రాళ్లతో దాడిచేసి, ఆపాలని చూశారు. అప్రమత్తమైన డ్రైవర్ బాబా బస్సు వేగాన్ని పెంచి దుండగుల నుంచి తప్పించారు.
నవీపేట పోలీసులకు సమాచారమిచ్చారు. దుండగుల దాడిలో బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండగా.. ఒకరి కంటికి చిన్న గాయమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు భైంసా డిపో మేనేజర్ అమృత తెలిపారు. ఇది దారిదోపిడీ దొంగల పనేనని ఆమె చెప్పారు. అబ్బాపూర్(ఎం) శివారులో రెండు నెలల క్రితం కూడా భైంసా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుపై దుండగులు ఇలాగే రాళ్ల దాడిచేసి బస్సును ఆపేందుకు యత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment