Rajendra Singh
-
ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్
జైపూర్: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై సూటి ప్రశ్నలు సంధించిన తన కేబినెట్ మంత్రి రాజేంద్ర సింగ్ గుధాను పదవి నుంచి తప్పించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అటు తర్వాత ప్రధాని అనుచిత వ్యాఖ్యలపైన స్పందిస్తూ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. మణిపూర్‌లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి తన పోర్ట్ ఫోలియోలోని హోంశాఖను వేరెవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూతద్దంలో చూపిస్తున్నారు.. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజేంద్ర సింగ్ మణిపూర్ తరహాలో రాజస్థాన్ లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పోర్ట్ ఫోలియో లోని హోంశాఖను ఎవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజస్థాన్ లో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై స్పందిస్తూ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో శాంతి భద్రతల అమలు విషయమై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందు మీరు తప్పుకోండి.. దీనిపై రాజస్థాన్ సీఎం స్పందిస్తూ.. మీ వైఫల్యాలను, అసమర్ధతను ఎదుటివారిపై రుద్దటం సరైన పధ్ధతి కాదు. ప్రచార ఆర్భాటాల కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా. మణిపూర్‌లో అన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళారా? మణిపూర్ కూడా మన దేశంలో భాగమే కదా. అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ముందు అక్కడి ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ పదవి నుండి తప్పుకోవాలి. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలో ఉండి ఉంటే ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో మాకు. ముందు మీ పోర్ట్ ఫోలియోలో హోంశాఖను ఎవరైనా సమర్ధుడికి అప్పగించండి.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెట్టినా తగ్గేదే లేదు.. మంత్రి పదవి నుండి తప్పించబడ్డ రాజేంద్ర సింగ్ పదవీచ్యుతులైన తర్వాత ముఖ్యమంత్రికి మరోసారి చురకలంటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. మన ఆడబిడ్డలకు ఇక్కడ భద్రత లేదు. కేబినెట్ సమావేశాల్లో కూడా నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను. పోలీసులు మామూళ్లు వసూలు చెయ్యడంలో చాలా బిజీగా ఉన్నారు. దీని పరిష్కారం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది. మంత్రి పదవి పోయినా, నన్ను జైల్లో పెట్టినా నేను మాత్రం ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటానన్నారు. Press Conference at CM residence | July 22 https://t.co/wxGUzUujum — Ashok Gehlot (@ashokgehlot51) July 22, 2023 ఇది కూడా చదవండి: విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి.. -
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్ సత్వర చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని చెప్పారు. డ్యాం సమీప నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. -
అక్రమ నిర్మాణాల తొలగింపు సబబే
ఆరిలోవ (విశాఖ తూర్పు)/లక్కవరపుకోట (శృంగవరపుకోట): కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నది సరైన నిర్ణయమేనని వాటర్‌మేన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో పలు జలాశయాలను పర్యవేక్షించేందుకు మూడ్రోజుల కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలోని జలవనరుల పరిరక్షణ సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని ముడసర్లోవ రిజర్వాయరును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించడం అభినందనీయమన్నారు. మిగిలిన వాటిని కూడా తొలగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సంఘం నుంచి తనవంతు సహకారం వైఎస్ జగన్‌కు అందిస్తానన్నారు. పర్యటనలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, జల సంఘం జాతీయ కన్వీనరు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కర్మాగారాలతో పర్యావరణానికి విఘాతం అనంతరం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం, రెల్లిగౌరమ్మపేట, కొత్తపాలెం గ్రామాల సమీపంలో ఉన్న స్టీల్ ఎక్సే్చంజ్ ఇండియా లిమిటెడ్, మహామాయ కర్మాగారాలను సందర్శించిన రాజేంద్రసింగ్ బృందం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి ఈ ఫ్యాక్టరీలను నిర్మించారన్నారు. ఈ గ్రామాల్లో చెరువులు, రహదారులు, గెడ్డలను కబ్జా చేసిన వైనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు తమ ఇబ్బందులను బృంద సభ్యుల ముందు ఏకరువు పెట్టారు. అనంతరం కొత్తపాలెంలో జరిగిన సభలో రాజేంద్రసింగ్ మాట్లాడారు. ఇక్కడి ప్రజలు మేల్కొని ఉద్యమాలు చేయకపోతే మరికొన్నేళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్నారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి శర్మ మాట్లాడుతూ.. కాలుష్యం కారణంగా ఇక్కడి వారు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్ సంఘర్‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. -
రాళ్ల దాడిలో జవాన్ మృతి
శ్రీనగర్: కశ్మీర్లో అల్లరి మూకలు విసిరిన రాళ్ల దాడిలో గాయపడిన ఓ జవాన్ శుక్రవారం చనిపోయాడు. మృతుడు సిపాయ్ రాజేంద్రసింగ్ క్విక్ రియాక్షన్ బృందంలో సభ్యుడని అధికారులు తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) కాన్వాయ్‌కు రక్షణగా వెళ్తున్న జవాన్లపై గురువారం అనంత్‌నాగ్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన రాజేంద్రసింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్రసింగ్ 2016లో సైన్యంలో చేరారు. -
ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్య
మోతిహరి(బిహార్) : ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. తూర్పు చంపారన్‌లోని మత్‌బన్వారీ చౌక్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన రాజేంద్ర సింగ్‌పై శత్రువులు ఇప్పటికే మూడుసార్లు దాడి చేశారు. ఈ విషయమై తనకు భద్రత పెంచాల్సిందిగా రాజేంద్ర సింగ్ పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు విఙ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్ ప్రాసెసింగ్‌లో ఉండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు... నితీశ్ కుమార్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శించింది. రాజేంద్ర సింగ్ హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేసింది. ఎన్డీయే కూటమి- నితీశ్ కుమార్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లు అర్థాంతరంగా తనువు చాలించాల్సి వస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత అలోక్ మెహతా ఆరోపించారు. కాగా పోలీసు, ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, గృహ, మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి పలు అంశాల గురించి ఎన్నో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో రాజేంద్ర సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన వెలుగులోకి తెచ్చిన కుంభకోణాలకు సంబంధించిన పలు కేసులు ప్రస్తుతం విచారణకు వచ్చిన నేపథ్యంలో హత్యకు గురికావడం గమనార్హం. -
ఏపీలో ఇసుక మాఫియాపై పీఎంఓకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు లేఖ రాశారు. అధికార టీడీపీ నేతల అండతో ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ‘కృష్ణ, గోదావరిలో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇసుక మాఫియాతో అన్ని స్థాయిల అధికారులు కుమ్మక్కు అయ్యారు. అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. టీడీపీ నేతల అరాచకాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలి’ అని రాజేంద్ర సింగ్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. -
‘ఏపీ సర్కారువి వికృత పోకడలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయం వల్ల రసాయనిక అవశేషాలు, పోషకాల లోపంతో కూడిన ఆహారోత్పత్తి జరుగుతోందని ప్రముఖ శాస్త్రవేత్త, దేశీ విత్తన పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనాశివ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆహారం తినడం వల్లే జీవనశైలి వ్యాధులు మానవాళికి పెనుముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) సదస్సులో వందనాశివ ప్రారంభోపన్యాసం చేశారు. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తున్న పంటల వల్ల ప్రకృతి వనరులు 70% ఖర్చవుతూ కేవలం 30% ఆహారోత్పత్తి అవుతోందని వందన తెలిపారు. ప్రజలు కేన్సర్, షుగర్, గుండెజబ్బుల వంటి జీవనశైలి వ్యాధుల బారినపడటానికి 75% రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణమన్నారు. మరోవైపు చిన్న, సన్నకారు రైతులు కేవలం 30% వనరులను ఉపయోగిస్తూ 70% ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారన్నారు. రసాయనిక వ్యవసాయం, బీటీ పత్తి వంటి జన్యుమార్పిడి పంటల వల్ల రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పారు. రసాయనిక వ్యవసాయం కొనసాగితే మరో వందేళ్లలో తిండి కూడా దొరకదన్నారు. బహుళజాతి కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే సాంకేతికతలను అభివృద్ధి పేరుతో రైతులపై రుద్దుతున్న బిల్‌గేట్స్ వంటి వ్యక్తులు పర్యావరణ అజ్ఞానులని ఆమె విమర్శించారు. అటువంటి వారి అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులుండటం దురదృష్టకరమని పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకృతి/శాశ్వత వ్యవసాయ పద్ధతుల వల్లే సాగు సంక్షోభం శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఏపీ సర్కారువి వికృత పోకడలు: రాజేంద్రసింగ్ నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం, సారవంతమైన వ్యవసాయ భూములను రైతుల నుంచి లాక్కోవడం వంటి వికృత పోకడలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, జలయోధుడు రాజేంద్రసింగ్ విమర్శించారు. పాలకులు, ప్రజలు జల చైతన్యంతో వ్యవహరించినప్పుడే నీటి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఎండిపోయిన నదులను దశాబ్దాల తర్వాత పునరుజ్జీవింపజేయడం సాధ్యమేనని తాము రాజస్తాన్‌లో రుజువు చేశామన్నారు. పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు విఠల్ రాజన్ ప్రసంగిస్తూ జీవ వైవిధ్యానికి పెద్దపీట వేసే వ్యవసాయ సంస్కృతికి భారత్ పెట్టింది పేరన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పర్మాకల్చర్ ఉద్యమ నేత రోజ్మేరో, భారతీయ సేంద్రియ వ్యవసాయదారుల సంఘం నేతలు డా. క్లాడ్ అల్వారిస్, డా. సుల్తాన్ ఇస్మాయిల్, అర్ధేందు చటర్జీ, ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ తదితరులు ప్రసంగించారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ వ్యవస్థాపకులు కొప్పుల నరసన్న అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు 65 దేశాల నుంచి సుమారు 800 మంది ప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది రైతులు హాజరయ్యారు. సదస్సులో పాల్గొనే తెలుగు రైతుల కోసం ప్రత్యేక అనువాద సదుపాయం కల్పించడం విశేషం. -
హైకోర్టు నోటీసులు బాబుకు చెంపపెట్టు
►సామాజికవేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా.రాజేంద్రసింగ్ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలోని కృష్ణానది కరకట్ట లోపల అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయలేదో చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీచేయడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా.రాజేంద్రసింగ్ చెప్పారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటని ధ్వజమెత్తారు. నదులను పరిరక్షించాలి.. అంటూ అందరిచే ప్రతిజ్ఞలు చేయిస్తున్న చంద్రబాబు చేతల్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరకట్టపై అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో డిమాండ్‌చేసిన ముఖ్యమంత్రే ఇప్పుడు వాటినే ఆవాసాలుగా చేసుకున్నారని విమర్శించారు. రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్న చంద్రబాబు నీతిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ కట్టడాల విషయంలో హైకోర్టు స్పందించి నోటీసులు జారీచేయడం నదికి ప్రాణంపోయడం వంటిదని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ద్వంద్వ నీతి ఎల్లవేళలా సాగదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అక్రమ కట్టడాలను తొలగించాలని రాజేంద్రసింగ్ డిమాండ్ చేశారు. -
'ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో మోసం'
సాక్షి, అమరావతి: నదీ పరిరక్షణ చట్టానకి విరుద్ధంగా కృష్ణానది గర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారని వాటర్‌మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మండిపడ్డారు. నదుల అనుసంధానం ప్రకృతికి విరుద్ధమైన చర్య అని, పెను విధ్వంసానికి కారణం అవుతుందని హెచ్చరించారు. ఈషా ఫౌండేషన్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీలో నదుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి.. నదీ తీరంలో అక్రమ కట్టడాలను ఎందుకు ఆపడంలేదని మండిపడ్డారు. నదీ గర్భ ప్రాంతం నివాసానికి అనుకూలం కాదని, అయినా సీఎం అక్కడే నివాసం ఉండటం చట్ట విరుద్ధం అన్నారు. ఈషా ఫౌండేషన్పైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. జగ్గీవాస్‌దేవ్ ఉద్యమం వెనుక కార్పొరేట్ రాజకీయ లబ్ధి ఉందని విమర్శించారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘించడం సరికాదని రాజేంద్రసింగ్ అన్నారు. -
డంపింగ్‌యార్డులా కృష్ణానది
హైదరాబాద్: కృష్ణానదిలో కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు. ఏపీలో కృష్ణానది డంపింగ్‌యార్డులో మారిందని తన లేఖలో పేర్కొన్నారు. కృష్ణానది పరిరక్షణను ఏపీ ప్రభుత్వం అసలేమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కర్నూలు నుంచి వస్తున్న మురుగునంతా కృష్ణానదిలో కలుపుతున్నారని పేర్కొన్నారు. కృష్ణాతీరంలో భారీ భవనాలకు అనుమతి ఇచ్చారని, తీరంలో బహుళ అంతస్తుల నిర్మాణం అక్రమమని ప్రభుత్వానికి తెలిసి కూడా ఇలా చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా తీరంలోని ఎంపీ టీజీ వెంకటేశ్ ఇంటి సమీపంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మురుగు వ్యవస్థను పట్టించుకోకపోవడంతో నీళ్లు పూర్తిగా కలుషితమయ్యాయని చెప్పారు. పాలకులారా ఇప్పటికైనా కళ్లు తెరువండి, కృష్ణా, తుంగభద్ర నదులను కాపాడాండి అంటూ రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ నదుల పరిరక్షణను పట్టించుకోకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న తుంగభద్ర పుష్కరాలను బహిష్కరించాలని పిలుపునిస్తామని రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. -
‘కరకట్ట’ ఇంటిని బాబు ఖాళీ చేయాలి
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే తన నివాసాన్ని ఖాళీ చేయాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసె అవార్డ్ గ్రహీత రాజేంద్రసింగ్ డిమాండ్ చేశారు. అమరావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు కట్టారని, సీఎం చంద్రబాబు కూడా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు. కృష్ణానది బచావో పేరిట...కృష్ణానది పరిరక్షణ యాత్ర బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ...‘చంద్రబాబు మా మాటలు వినడం లేదు...జగ్గీ వాసుదేవ్ చెబితే వింటారేమో. ఆయన సింగపూర్ మాటలనే ఇష్టపడుతున్నారు. వాళ్లు గాలిలో ఎగురుతారు. మనం భూమి మీద నడుస్తాం.’ అని అన్నారు. కృష్ణానదీ బచావో పాదయాత్ర దేశ వ్యాప్త ఉద్యమం అవుతుందని, ఇది స్థానిక ఉద్యమం కాదని, దేశంలోని అన్ని రాజకీయ పక్ష నేతలను కలుపుకొని కృష్ణానది పరిరక్షణకు చేసే యాత్ర అని అన్నారు. నదుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని రాజేంద్ర సింగ్ కోరారు. ప్రొఫెసర్ విక్రమ్ సోనీ మాట్లాడుతూ.. నదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయని, వాటిని నాశనం చేస్తే మానవ మనుగడే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కృష్ణానది పరిరక్షణ యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనుంది. మద్దురు, పాపవినాశనం, హంసలదీవి, పెనుముడి, కొల్లూరు మీదగా బీజాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. -
రివర్స్ లింకింగ్ ప్రకృతి విరుద్ధం
-
నీటి యోధుడికి జేజేలు!
నీటి కరువు బాధ అందరికన్నా రైతులకే ఎక్కువ తెలుసు. రైతులకు అంతకుమించిన జీవన్మరణ సమస్య. మంచి నీరు 70% వ్యవసాయం కోసమే ఖర్చవుతోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే 95% నీరు వ్యవసాయానికే ఖర్చవుతోంది (ఎఫ్.ఎ.ఓ.). అందుకే ఆయుర్వేద వైద్యంలో పట్టా పుచ్చుకున్న రాజేంద్రసింగ్ వైద్యశాలలు తెరవడానికి 35 ఏళ్ల క్రితం ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో మారుమూల పల్లెలకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను కోరిందేమిటంటే.. అయ్యా మాకు వైద్యం కన్నా ముందు కావాల్సింది నీరు. తాగు నీటి కోసం, సాగు నీటి కోసం ఏదైనా చేసి పుణ్యం కట్టుకోండని బతిమాలారు. అప్పటి నుంచి రాజేంద్రసింగ్, ఆయన మిత్రబృందం నీటి భద్రత సాధనే ధ్యేయంగా పెట్టుకొని స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. రైతులు, గ్రామీణులను కూడగట్ట గలిగితే ఎడారి ప్రాంతంలో ఎండిపోయిన నదులను కూడా నిక్షేపంగా పునరుజ్జీవింపజేసుకొని పంటకు, ఇంటికి నీటి కరువు లేకుండా చేయొచ్చని లోకానికి నిరూపించారు. తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. సంప్రదాయక మట్టి ఆనకట్టలు (జొహాద్లు) కట్టించడానికి విశేష కృషి చేశారు. పారే వాన నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేయడానికి 8,600 జొహాద్లను నిర్మించారు. రాజస్థాన్‌లో కొద్ది సంవత్సరాల్లోనే వెయ్యి గ్రామాలకు జల కళ తిరిగి వచ్చింది. ఈ కృషి వల్ల రాజస్థాన్‌లో పూర్తిగా ఎండిపోయిన అనేక నదులు మళ్లీ నీటి పారుదలను కళ్ల జూశాయి. చెట్టు చేమ పచ్చబడింది. అడవి విస్తరించింది. తాగడానికే నీరు దొరకని ఆ గ్రామాల్లో ఇప్పుడు సేద్యానికి కూడా సంపూర్ణ నీటి భద్రత చేకూరింది. అందుకే ‘భారతీయ నీటి యోధుడు’గా రాజేంద్రసింగ్ ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు. ‘స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015’ ఆయనను వరించింది. ప్రపంచ నీటి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా రేపు (ఆగస్టు 26న) రాజేంద్రసింగ్ ఈ అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు. ‘వాన నీటిని చెక్‌డామ్‌లు, కందకాల ద్వారా ఒడిసిపట్టుకొని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేసుకుంటే నీటి భద్రత కలుగుతుంది. ప్రతి గ్రామంలోనూ ఈ పని చేస్తే ప్రపంచవ్యాప్తంగా కరువు, వరద బాధలు ఉండవ’ని రాజేంద్ర సింగ్ అన్నారు. నీటి యోధుడికి జేజేలు!