
జైపూర్: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై సూటి ప్రశ్నలు సంధించిన తన కేబినెట్ మంత్రి రాజేంద్ర సింగ్ గుధాను పదవి నుంచి తప్పించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అటు తర్వాత ప్రధాని అనుచిత వ్యాఖ్యలపైన స్పందిస్తూ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి తన పోర్ట్ ఫోలియోలోని హోంశాఖను వేరెవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భూతద్దంలో చూపిస్తున్నారు..
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజేంద్ర సింగ్ మణిపూర్ తరహాలో రాజస్థాన్ లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పోర్ట్ ఫోలియో లోని హోంశాఖను ఎవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజస్థాన్ లో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై స్పందిస్తూ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో శాంతి భద్రతల అమలు విషయమై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముందు మీరు తప్పుకోండి..
దీనిపై రాజస్థాన్ సీఎం స్పందిస్తూ.. మీ వైఫల్యాలను, అసమర్ధతను ఎదుటివారిపై రుద్దటం సరైన పధ్ధతి కాదు. ప్రచార ఆర్భాటాల కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా. మణిపూర్లో అన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళారా? మణిపూర్ కూడా మన దేశంలో భాగమే కదా. అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ముందు అక్కడి ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ పదవి నుండి తప్పుకోవాలి. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలో ఉండి ఉంటే ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో మాకు. ముందు మీ పోర్ట్ ఫోలియోలో హోంశాఖను ఎవరైనా సమర్ధుడికి అప్పగించండి.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జైల్లో పెట్టినా తగ్గేదే లేదు..
మంత్రి పదవి నుండి తప్పించబడ్డ రాజేంద్ర సింగ్ పదవీచ్యుతులైన తర్వాత ముఖ్యమంత్రికి మరోసారి చురకలంటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. మన ఆడబిడ్డలకు ఇక్కడ భద్రత లేదు. కేబినెట్ సమావేశాల్లో కూడా నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను. పోలీసులు మామూళ్లు వసూలు చెయ్యడంలో చాలా బిజీగా ఉన్నారు. దీని పరిష్కారం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది. మంత్రి పదవి పోయినా, నన్ను జైల్లో పెట్టినా నేను మాత్రం ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటానన్నారు.
Press Conference at CM residence | July 22 https://t.co/wxGUzUujum
— Ashok Gehlot (@ashokgehlot51) July 22, 2023
ఇది కూడా చదవండి: విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి..