Rajasthan CM Ashok Gehlot Counter To PM Modi’s Red Diary Comments - Sakshi
Sakshi News home page

ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది.. ఎర్రటి టమాటాలు, సిలిండర్లు, జనాల ముఖాలు కనిపించవా?   

Published Thu, Jul 27 2023 3:46 PM | Last Updated on Thu, Jul 27 2023 3:54 PM

On PMs Red Diary Barb CM Ashok Gehlot Responds - Sakshi

జైపూర్: శిఖర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ శాసనసభలో ఎర్ర డైరీ ఒకటి  హల్‌చల్‌ చేసింది. అది గాని బహిర్గతమైతే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ ఎర్రటి టమాటాలు, సిలిండర్లను వంటగది బడ్జెట్ పెంచేసిన విషయం మాత్రం కానరాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు.   

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఎమ్మెల్యే మంత్రి రాజేంద్ర సింగ్ గుదా రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేసి, ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ ఇది రాజస్థాన్ సీఎం భవిష్యత్తును తేల్చే భవిష్యవాణి అంటూ సంచలనం సృష్టించారు. ఆ డైరీలో 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన లావాదేవాల వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ వేయడంలో తనదైన మార్క్ ప్రదర్శించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శిఖర్ సభలో ఈ ఎర్ర డైరీ గురించి ప్రస్తావించి సీఎం అశోక్ గెహ్లాట్ కు కౌంటర్ వేశారు. 

సభలో ప్రధాని  మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ఎదో కార్యక్రమం చేశారు. అది మొహబ్బత్ కీ దుకాణ్ కాదు "లూటీ కీ దుకాణ్-ఝూటీ కీ దుకాణ్" అని అన్నారు. ప్రజలను లూటీ చేసిన సమాచారం తోపాటు వారు చెప్పిన ఝూటా కబుర్ల గురించిన వివరమంతా ఎర్ర డైరీలో ఉన్నాయి. ఆ నిజాలు బయటకు వస్తే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. 

అసలే దుందుడుకు స్వభావి అయిన సీఎం ఈ కామెంట్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. మీకు ఊహాజనితమైన ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ కళ్ళ  ముందున్న ఎర్రటి టామాటాలు, ఎర్రటి గ్యాస్ సిలిండర్లు కనిపించవు.. వాటి కారణంగా ఎర్రగా మారిన ప్రజల ముఖాలు కూడా కానరావు. చూస్తూండండి వచ్చే ఎన్నికల్లో జనం మీకు ఎర్రటి జెండా చూపించడం ఖాయమని కౌంటర్ వేశారు.       

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కార్యక్రమంలో తన పేరును తొలగించారన్న కారణంతో ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇలా హాటు హాటుగా కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement