red flag
-
జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్
జైపూర్: శిఖర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ శాసనసభలో ఎర్ర డైరీ ఒకటి హల్చల్ చేసింది. అది గాని బహిర్గతమైతే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ ఎర్రటి టమాటాలు, సిలిండర్లను వంటగది బడ్జెట్ పెంచేసిన విషయం మాత్రం కానరాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఎమ్మెల్యే మంత్రి రాజేంద్ర సింగ్ గుదా రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేసి, ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ ఇది రాజస్థాన్ సీఎం భవిష్యత్తును తేల్చే భవిష్యవాణి అంటూ సంచలనం సృష్టించారు. ఆ డైరీలో 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన లావాదేవాల వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ వేయడంలో తనదైన మార్క్ ప్రదర్శించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శిఖర్ సభలో ఈ ఎర్ర డైరీ గురించి ప్రస్తావించి సీఎం అశోక్ గెహ్లాట్ కు కౌంటర్ వేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ఎదో కార్యక్రమం చేశారు. అది మొహబ్బత్ కీ దుకాణ్ కాదు "లూటీ కీ దుకాణ్-ఝూటీ కీ దుకాణ్" అని అన్నారు. ప్రజలను లూటీ చేసిన సమాచారం తోపాటు వారు చెప్పిన ఝూటా కబుర్ల గురించిన వివరమంతా ఎర్ర డైరీలో ఉన్నాయి. ఆ నిజాలు బయటకు వస్తే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. लाल डायरी..... अब अच्छे-अच्छे निपट जाएंगे! लाल डायरी का नाम सुनते ही कांग्रेसियों के मुंह में दही जम जाता है?#Rajasthan #AshokGehlot #congrees #NarendraModi#sikar #RajendraGuda pic.twitter.com/fafANrlwlp — Priti charan (@CharanPriti) July 27, 2023 అసలే దుందుడుకు స్వభావి అయిన సీఎం ఈ కామెంట్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. మీకు ఊహాజనితమైన ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ కళ్ళ ముందున్న ఎర్రటి టామాటాలు, ఎర్రటి గ్యాస్ సిలిండర్లు కనిపించవు.. వాటి కారణంగా ఎర్రగా మారిన ప్రజల ముఖాలు కూడా కానరావు. చూస్తూండండి వచ్చే ఎన్నికల్లో జనం మీకు ఎర్రటి జెండా చూపించడం ఖాయమని కౌంటర్ వేశారు. "PM को लाल टमाटर, महंगाई से हुए लोगों के लाल चेहरों पर बात करनी चाहिए" ◆ राजस्थान CM अशोक गहलोत का बयान @ashokgehlot51 #AshokGehlot pic.twitter.com/1F4wdPPlVV#राजस्थान_में_मोदी_मोदी — Nemi saini (@NemiSainiINC) July 27, 2023 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కార్యక్రమంలో తన పేరును తొలగించారన్న కారణంతో ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇలా హాటు హాటుగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం -
ఎర్ర కండువాతో తప్పిన పెను ప్రమాదం
న్యూ ఢిల్లీ : ఇద్దరు ట్రాక్మెన్ల సమయస్ఫూర్తి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. ప్రియస్వామి(60), రామ్ నివాస్(55) ఇద్దరు రైల్వే ట్రాక్మెన్లు. వారు తమ విధుల్లో భాగంగా యమున బ్రిడ్జి, తిలక్ బ్రిడ్జ్‌ల మధ్య రైల్వె ట్రాక్‌ను పరిశీలుస్తుండగా... ఒక చోట వారికి 6 అంగుళాల మేర ట్రాక్ తొలగిపోయి కనిపించింది. అదే సమయంలో శివగంగా ఎక్స్‌ప్రెస్ ఆ ట్రాక్ మీద దూసుకొస్తోంది. స్టేషన్‌కు ఫోను చేసి సమాచారం అందిద్దామంటే సమయానికి వారి దగ్గర ఫోను కూడా లేదు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. మరోవైపు వారికి ఎదురుగా రైలు వస్తున్న శబ్ధం వినిపిస్తోంది. ఇంతలోనే ప్రియస్వామికి ఏదో గుర్తుకు వచ్చింది. టక్కున తన ఎర్ర కండువాను గాలిలో ఊపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తాడు. మరొక ట్రాక్‌మాన్ రామ్ నివాస్ కూడా ఎర్రజెండాను తీసుకుని పరిగెత్తుకు వచ్చాడు. వారి ప్రయత్నం ఫలించి అదృష్టం కొద్ది రైలు విరిగిన ట్రాక్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది ఆ రైల్. వీరి సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. కార్లు, బైక్‌లు, బస్సులు వంటి వాటిని సడెన్ బ్రేక్ చేసి ఆపవచ్చు. కానీ రైళ్లకు అది సాధ్యపడదు. గంటకు సుమారు 50-60 కిమీ వేగంతో వెళ్తున్న రైలు ఆగాలంటే ఆ రైలు100 మీటర్ల దూరాన ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ సకాలంలో రైల్వే ట్రాక్మెన్లు తీసుకున్న నిర్ణయంతో వందల మంది ప్రాణాలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. వీరు ఎర్ర కండువా, ఎర్రజెండా పరుగెత్తుకుని వచ్చేది గమనించిన రైలు డ్రైవర్ ఇంజిన్‌ను స్లో చేశాడు. దీంతో తొలిగిపోయిన ట్రాక్‌కు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. జరిగిన విషయం తెలుసుకుని రైలు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి బయట పడినందుకు ఊపిరి పీల్చుకుని, వారిని అభినందించాడు. వందలమందిని కాపాడిని ఈ ఇద్దరు ట్రాక్మెన్లను సత్కారించాలనుకుంటున్నామని ఉత్తర రైల్వే డిప్యూటి మేనేజర్ ఆర్ ఎన్ సంగ్ తెలిపారు. గతంలోనూ.... రామ్ నివాస్‌కు గతంలోనూ ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ట్రాక్ వెంట 500 మీటర్లు పరిగెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీని గురించి రామ్ నివాస్‌ను అడగ్గా ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం. నా చిన్నతనంలో మా స్వస్థలం బీహార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ ప్రమాదానికి గల కారణాలు నాకు తెలుసు. అందుకే నేను సర్వీసులో ఉన్నంత కాలం అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నారు. -
ఎర్రజెండాలకు కాలం చెల్లింది
* కార్మికులు టీఎంయూకు మద్దతు తెలపాలి * సంఘం రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మహబూబ్‌నగర్ క్రైం : ప్రస్తుతం ఎర్రజెండాలకు కాలం చెల్లిందని, భవిష్యత్‌లో ఆర్టీసీ గులాబీమయం అవుతుందని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. వచ్చే నెలలో గుర్తింపు సంఘాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్ బస్టాండులో ఆయన ప్రచారం చేశారు. తమ సంఘానికి సంపూర్ణ మద్దతు తెలపాలని కార్మికులను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాటం చేసి 44శాతం ఫిట్మెంట్ సాధించామన్నారు. ఇటీవల కాలంలో 4,300మంది సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించారని, కారుణ్య నియామకాలకు కృషి చేశామన్నారు. కార్మికులకు రూ.ఆరు కోట్ల ఆర్బీసీ, అలవెన్స్ వచ్చేలా పోరాటం చేశామన్నారు. ఈ ఎన్నికల్లో గుర్తులతో సంబంధం లేకుండా వ్యక్తులను చూసి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర నాయకులు రాజసింహుడు, జి.ఎల్.గౌడ్, డి.ఎస్.చారి, బి.వి.రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో వివాదాన్ని వెంటతీసుకెళ్లిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళితే వివాదాలు వెంట తీసుకెళతారేమో అనిపిస్తోంది. గతంలో అమెరికా పర్యటనలో లక్షల విలువైన కోటు ధరించి 'సూట్ బూట్' వివాదానికి తెర తీసిన మోదీ ప్రస్తుత పర్యటనలో మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈసారి మోదీ జాతీయ పతాకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారట. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ పతాకంపై మోదీ సంతకం చేశారట. సంతకంతో కూడిన పతాకాన్ని మిషెలిన్ మాస్టర్ చెఫ్ వికాస్ వర్మకు అందచేసి బరాక్ ఒబామాకి చేర్చాల్సిన బాధ్యతను అప్పగించారు. అమెరికాలోని 40 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు మోదీ ఏర్పాటు చేసిన విందులో భారత వంటకాలను వడ్డించే బాధ్యత వికాస్ వర్మ చేపట్టారు. మోదీ సంతకంతో కూడిన జాతీయ పతాకం ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ట్విట్టర్లో వివాదం మొదలైంది. భారత జాతీయ పతాకం ఐదవ నియమాన్ని మోదీ ఉల్లంఘించారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే స్థాయిలో తప్పేముందని ప్రశ్నించిన వారూ ఉన్నారు. జాతీయ పతాకం నియమాలని మార్చాలని, సరళతరం చేయాలని కూడా సూచనలు వచ్చాయి. ఈ వివాదం ముదురుతోందని గమనించిన అధికారులు వికాస్ వర్మ నుండి జాతీయ పతాకాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం. ఏదేమైనా మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక వివాదం మాత్రం ఖాయమన్నమాట. -
భారత్‌కు వర్షాభావ గండం..
రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరిక - 2015-16 వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 7శాతానికి కోత - సంస్కరణల నత్తనడకా కారణం - వచ్చే ఏడాది వృద్ధి జోరందుకుంటుందని అంచనా న్యూఢిల్లీ: ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ భారత్ వృద్ధి వేగానికి సంబంధించి ‘రెడ్ ఫ్లాగ్’ ఎగరవేసింది. దేశాభివృద్ధి వేగానికి వర్షాభావ పరిస్థితులు అడ్డంకయ్యే అవకాశం ఉందని అంచనావేసింది. దీనికితోడు సంస్కరణల అమలు ఆలస్యం ప్రతికూలతలూ ఆర్థిక రంగంపై ఉంటాయని పేర్కొంది. ఆయా అంశాలను కారణంగా చూపుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) వృద్ధి రేటును ఇంతకుముందు ప్రకటించిన 7.5 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ధోరణులపై మూడీస్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ముఖ్యాంశాలను మూడీస్ విశ్లేషకులు అత్సీ సేథ్ తెలిపారు. మూడు అంశాల ప్రాతిపదిక: మూడు ప్రమాణాల ప్రాతిపదికన తాజా అంచనాలను లెక్కించడం జరిగింది. మొదటి విషయానికి వస్తే- ఇటీవలి స్థూల ఆర్థిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి గణాంకాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. మందగమన ధోరణికి అద్దం పడుతున్నాయి. ఇక రెండవ విషయానికి వస్తే- వర్షపాతం. తగిన వర్షపాతం నమోదయితే- గ్రామీణ ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇది వృద్ది రేటుకు ప్రతికూలాంశమే. ఇక మూడవది అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... - పలు సంస్కరణల అమల్లో ఆలస్యం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ), భూ సేకరణ వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనాంశం. కేవలం రాజకీయ గందరగోళం వల్ల వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ కీలక బిల్లులకు ఆమోదం లభించలేదు. - 7 శాతం వృద్ధి సాధించినా... ఇంత స్థాయిలో ఏ దేశమూ వృద్ధి సాధించే పరిస్థితి లేదు. అందువల్ల వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారత దేశమే కొనసాగుతుంది. - అయితే వచ్చే ఏడాది మాత్రం భారత్ వృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. భారత్ వృద్ధి క్రియాశీలత పటిష్టత కొనసాగుతుంది. క్రమంగా సంస్కరణల అమలు, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగే అవకాశాలు దీనికి ప్రధాన కారణం. - కమోడిటీ ధరలు తక్కువగా ఉన్న పరిస్థితుల వల్ల రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండడం వల్ల వాస్తవ ఆదాయాలకు, వ్యయాలకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో ఇది సానుకూల అంశమే. - 2015లో బ్రెంట్ ఆయిల్ ధర బేరల్‌కు సగటున 55 డాలర్లు ఉంటే ఇది 2016లో 57 డాలర్లకు చేరే అవకాశం ఉంది. సంస్కరణల ప్రక్రియ ఒక రోజులో జరిగే వ్యవహారం కాదు: కేంద్రం భారత్ వృద్ధి రేటును మూడీస్ తగ్గించడంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పందించారు. సంస్కరణల ప్రక్రియ ఒక్కరోజులో జరిగిపోయే వ్యవహారం ఏదీ కాదని ముంబైలో వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను జాగరూకతతో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ దిశలో కేంద్రం ముందడుగు ఉపాధి సృష్టికి తద్వారా దేశాభివృద్ధికి దారితీస్తుందని అన్నారు. రేటింగ్ ఏజెన్సీలు దీనిని గుర్తించాలని సూచించారు. -
పట్టాలపై ఎర్రజెండా.. నిద్రపోయిన గేట్‌మ్యాన్
ఓపక్క రైలుప్రమాదాలు ఎన్ని సంభవిస్తున్నా, నిర్లక్ష్యం మాత్రం వీడట్లేదు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మోషంపూర్‌లో ఓ గేట్‌మ్యాన్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఏకంగా రైలు పట్టాల మీద ఎర్రజెండాను పాతి నిద్రపోయాడు. దాంతో అటువైపుగా వెళ్తున్న కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. ఎర్రజెండా ఉండటంతో ముందు ఏమైనా ప్రమాదం ఉందేమోనన్న అనుమానంతో డ్రైవర్లు రైలును నిలిపివేశారు. ఏమైందో తెలియక ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీరా చూస్తే, అక్కడకు సమీపంలోనే గేట్ మ్యాన్ నిద్రపోతూ కనిపించడంతో అతడిని లేపి అడిగితే అసలు విషయం తెలిసింది. -
కామ్రేడ్ల రాంగ్ మార్చ్
రంగు వెలుస్తున్న ఎర్రజెండా.. దేశవ్యాప్తంగా కుదేలైన సీపీఎం, సీపీఐ వామపక్షాలు. ఒకప్పుడు అధికార కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను గజగజ వణికించిన పార్టీలు. ప్రత్యామ్నాయ పార్టీలుగా నీరాజనాలందుకున్న శక్తులు. సామ్రాజ్యవాదుల గుండెల్లో పరుగెత్తిన రైళ్లు. సామ్యవాద ఉద్యమాలకు కొత్త ఊపిరులు. ముఖ్యంగా సీపీఐ, సీపీఎం అయితే చాలాకాలం పాటు తాడిత, పీడిత, బాధిత ప్రజానీకానికి ఏకైక ఆశాకిరణాలుగా నిలిచాయి. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే తమ బతుకుల్లో శాశ్వతంగా వెలుగులు నిండుతాయని ఆశించిన వారు ఎందరో! ఇదంతా గతం. మూల సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగలేక, అలాగని మారుతున్న కాలానికి అనుగుణంగా మారనూ లేక.. గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ... ఒకదాని వెంట ఒకటిగా చారిత్రక తప్పిదాలు చేస్తూ, ఆనక తీరిగ్గా అందుకు విచారిస్తూ, గతుకుల దారిలో వెనక్కూ ముందుకూ ఊగిసలాడుతూ పయనిస్తూ... ఇదీ వామపక్షాల వర్తమాన దైన్యం. జాతీయ పార్టీలుగా ఒక వెలుగు వెలిగిన రోజుల నుంచి ఎక్కడికక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన చేరకుంటే వాటి ఉనికే కనాకష్టంగా మారిన దుస్థితి. చివరికి బెంగాల్, కేరళ వంటి కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం. సైద్ధాంతిక పునాదులను నేల మీద కాకుండా ఊహల్లో నిర్మించుకోవడం. భారత సామాజిక వ్యవస్థను, కుల సమీకరణాలను సరిగా అర్థం చేసుకోకపోవడం... ఈ దుస్థితికి కారణాలెన్నో. ఏదేమైనా భారత్‌లో వామపక్షాల లాంగ్‌మార్చ్‌కు రెడ్‌లైట్ పడింది. గత దశాబ్ద కాలంలో సీపీఎం, సీపీఐ ఉత్థాన పతనాలపై ఫోకస్... నాంచారయ్య మెరుగుమాల: భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వావ్యు పంథాను ఆమోదించిన సీపీఎం, సీపీఐ తొలిసారిగా లోక్‌సభలో 50 సీట్ల కన్నా ఎక్కువ సాధించింది ఒక్క 2004 ఎన్నికల్లోనే. అప్పుడు సీపీఎం 43, సీపీఐ 10 స్థానాలు గెలుచుకున్నారుు. కానీ ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థారుులో బలాన్ని కోల్పోయి కేవలం 20 సీట్లకే పరిమితవుయ్యూయి. ఇలా కవుూ్యనిస్టులు ఒక లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చూడని విజయూన్ని సాధించి, ఆ తర్వాతి ఎన్నికల్లోనే అత్యంత అధ్వాన స్థితికి చేరుకోవడం విచిత్రం! ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైతే సీపీఎం, సీపీఐ వురింత నీరసించి కన్పిస్తున్నాయి. ప్రస్తుతమున్న 20 సీట్లను కూడా నిలబెట్టుకోలేని దుస్థితికి చేరుకున్నాయి... ఆరేళ్ల ఎన్డీఏ పాలనలో వుతతత్వం పెరిగిపోరుుందని, 2002 గుజరాత్ ఊచకోతకు కారణమైన బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని నినాదమిస్తూ కవుూ్యనిస్టులు 2004లో పోరాడారు. తోటి వావుపక్షాలైన ఫార్వర్డ్ బ్లాక్ (3), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆరెస్పీ-3)తో కలిసి సీపీఎం, సీపీఐ తొలిసారిగా దాదాపు 60 లోక్‌సభ సీట్లు కైవసం చేసుకున్నారుు. కాంగ్రెస్ నాయుకత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుూపీఏకు బయుటి నుంచి వుద్దతిచ్చాయి. అయితే 2008లో వున్మోహన్సింగ్ సర్కారు అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి నిరసనగా ఎన్నికలకు దాదాపు ఏడాది వుుందు యుూపీఏ సర్కారుకు వుద్దతు ఉపసంహరించుకున్నారుు. ఎస్పీ వంటి పార్టీల వుద్దతుతో యుూపీఏ నిలబడింది. సింగూరు, నందిగ్రాం దెబ్బలు 2009 ఎన్నికల్లో అంతకు వుుందు తవుకు అత్యధిక స్థానాలు లభించిన పశ్చివుబెంగాల్, కేరళల్లో ఉభయు కవుూ్యనిస్టు పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. దాంతో వాటి స్కోరు 20కి పడిపోరుుంది. అప్పటికి ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కవుూ్యనిస్టులపై జనంలో నెలకొన్న వ్యతిరేకత ఆ ఎన్నికల్లో వాటిని కోలుకోలేనంతగా దెబ్బ తీసింది. అదీగాక, 1977 నుంచి పశ్చివుబెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలో అప్పటికి 32 ఏళ్లుగా అధికారంలో ఉన్న కవుూ్యనిస్టు ప్రభుత్వంపై ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెరిగాయి. ఇందుకు బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలో 2006లో రెండోసారి వచ్చిన కవుూ్యనిస్టు సర్కారు పారిశ్రామికీకరణ పేరుతో చేసిన రెండు ప్రయుత్నాలు ప్రధానంగా కారణమయ్యాయి. సింగూరులో టాటా మోటర్స్ తలపెట్టిన నానో కారు ప్రాజెక్టుకు దాదాపు 10,000 ఎకరాల పంట భూవుులను రైతుల నుంచి బలవంతంగా సేకరించి కట్టబెట్టడం, మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రాం లోనూ ఇదే తరహాలో ఇండొనేసియూకు చెందిన కంపెనీకి వేలాది ఎకరాలు బలవంతంగా జనం నుంచి సేకరించడానికి ప్రయుత్నించి ప్రాణనష్టానికి కారణం కావడంతో సీపీఎం ప్రతిష్ట వుసకబారింది. ప్రజలకు భూమి పై ఉన్న హక్కును కాపాడే పేదల మిత్రులనే పేరు గాల్లో కలిసిపోరుుంది. దాంతో 2011లో కేరళ, బెంగాల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు 2009 లోక్‌సభ ఎన్నికలనే ప్రతిబింబించారుు. బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తృణవుూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయుం సాధించి అధికారంలోకి వచ్చింది. బుద్ధదేవ్ సైతం ఓడిపోయూరు. కేరళలోనూ పరాజయుం తప్పలేదు. గత వుూడేళ్లలో వువుతా బెనర్జీ నాయుకత్వంలోని తృణవుూల్ సర్కారు ఏలుబడిలో శారదా చిట్‌ఫండ్స్ వంటి కుంభకోణాలు, సర్కారీ నియుంతృత్వ ధోరణల వంటివి కొనసాగుతున్నా జనం ఇంకా పాలకపక్షం వైపే ఉన్నారని ఇటీవలి సర్వేలు తెలుపుతున్నారుు. ఈ పరిస్థితుల్లో బెంగాల్లో సీపీఎం బలం ఈసారి వురింత తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నారుు. 2004లో బెంగాల్లో సీపీఎం 26, సీపీఐ 3 సీట్లు కైవసం చేసుకున్నారుు. 2009లో మాత్రం సీపీఎం బలం 9 సీట్లకు, సీపీఐది 2 సీట్లకు పడిపోయాయి. తృణవుూల్ 19 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి అది 28 సీట్ల దాకా పెరగవచ్చంటున్నారు. అదే జరిగితే ఉభయ కవుూ్యనిస్టులూ కలిపి ఆరేడు సీట్లకే పరిమితవుయ్యే ఆస్కారముంది. ఇక కేరళలో వూత్రం అవి పుంజుకోకపోరుునా మరీ ఎక్కువగా దెబ్బ తినే ఆస్కారం కూడా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 2009 లో ఇక్కడ మొత్తం 20 సీట్లకు గాను సీపీఎం కేవలం 4 సీట్లు గెలవగా సీపీఐ ఖాతా కూడా తెరవలేదు! 2004 ఎన్నికల్లో కేరళలో సీపీఎం 12 సీట్లు, సీపీఐ 3 సీట్లు గెలుచుకున్నాయి. స్కాంలు వెలికితీసినా 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని బయట పెట్టింది సీపీఎం నేత సీతారాం ఏచూరే. యుూపీఏ-1 హయూంలోనే దీన్న ఆయన వెలగులోకి తీసుకొచ్చారు. అంతేగాక కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సహజవాయుువు ధర నిర్ణయుంలో రిలయున్స్ ఇండస్ట్రీస్‌కు బాగా లాభించేలా యుూపీఏ సర్కారు నిర్ణయూలు తీసుకుంద తొలుత లేవనెత్తింది కూడా సీపీఐ అగ్రనేత, ప్రవుుఖ పార్లమెంటేరియున్ గురుదాస్ దాస్గుప్తాయే. ఈ రెండు కుంభకోణాలు యుూపీఏ ప్రతిష్టను దెబ్బ తీశాయి. ఫలితంగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో రెండంకెలకు దిగజారనుందని అంటున్నారు. కానీ ఇలాంటి కుంభకోణాలను బయట పెట్టిన ప్రయోజనం కవుూ్యనిస్టులకు కాకుండా బీజేపీకి, దాని మిత్రపక్షాలకు లభించేలా పరిస్థితులు వూరిపోయూరుు. మరోవైపు అవినీతి వ్యతిరేకోద్యవుం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా కేంద్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఆశ్రీత పక్షపాత పెట్టుబడిదారీ విధానాలపై కవుూ్యనిస్టుల బాటలో ఎప్పటికప్పుడు పోరాడుతూ వాటి స్థానాన్ని నెవ్ముదిగా ఆక్రమించేలా కన్పిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో వుుందుకొచ్చిన ఆప్‌తో కమ్యూనిస్టులు పోటీ పడలేని స్థితికి చేరుకున్నారు. కేరళ, బెంగాల్ కన్నా వుుందు కవుూ్యనిస్టు పార్టీ వేళ్లూనుకున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోనైతే ఈసారి సీపీఎం, సీపీఐ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవడం అసాధ్యంగా కనిపిస్తోది. అవి రెండూ కలిసి ఐదారు లోక్‌సభ సీట్లు గెలిచిన సందర్భాలున్న బీహార్‌లో కూడా ఈసారి సున్నా చుట్టేయడం ఖాయమే. బెంగాల్లోనూ దిగాలే ఎవుర్జెన్సీ తొలగించాక 1977లో బెంగాల్లో 17 సీట్లు గెలిచిన సీపీఎం, తర్వాత వుూడు నెలలకు రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంది. అంతేగాక ఆ తర్వాత అక్కడ జరిగిన ఏ ఎన్నికల్లోనూ వెనకబడలేదు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 28 (1980), 18 (1984), 26 (1989), 27 (1991), 23 (1996), 23 (1998), 21 (1999), 26 (2004) చొప్పున సీట్లు గెలుస్తూ వచ్చింది. కానీ బెంగాల్లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన వామపక్షాల పతనం (సీపీఎం 9, సీపీఐ 2)... 2011 అసెంబ్లీ ఎన్నికలతో వేగం పుంజుకుంది. ఈసారి వాటి బలం మరింత తగ్గడం ఖాయువునే దాదాపు అన్ని ఎన్నికల సర్వేలూ చెబుతున్నారుు. చీలిక తర్వాతా బలపడి కూడా... 1964లో ఉవ్ముడి కవుూ్యనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిపోయూక 1967 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ 23, సీపీఎం 19 సీట్లు సాధించారుు. తర్వాత 1971 నుంచి 2004 దాకా జరిగిన తొమ్మిది లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి బలం ఎప్పుడూ పాతిక సీట్లకు తగ్గలేదు. అలాంటిది 2009లో 20 స్థానాలకు దిగజారింది!