ఎర్ర కండువాతో తప్పిన పెను ప్రమాదం | Two Trackman Save Many Lives | Sakshi
Sakshi News home page

ఎర్ర కండువా ఏం చేసిందో తెలుసా....

Published Thu, Mar 15 2018 1:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Two Trackman Save Many Lives - Sakshi

న్యూ ఢిల్లీ :  ఇద్దరు ట్రాక్‌మెన్ల సమయస్ఫూర్తి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. ప్రియస్వామి(60), రామ్‌ నివాస్‌(55) ఇద్దరు రైల్వే ట్రాక్‌మెన్‌లు. వారు తమ విధుల్లో భాగంగా యమున బ్రిడ్జి, తిలక్‌ బ్రిడ్జ్‌ల మధ్య రైల్వె ట్రాక్‌ను పరిశీలుస్తుండగా... ఒక చోట వారికి 6 అంగుళాల మేర ట్రాక్‌ తొలగిపోయి కనిపించింది. అదే సమయంలో శివగంగా ఎక్స్‌ప్రెస్‌ ఆ ట్రాక్‌ మీద దూసుకొస్తోంది. స్టేషన్‌కు ఫోను చేసి సమాచారం అందిద్దామంటే సమయానికి వారి దగ్గర ఫోను కూడా లేదు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. మరోవైపు వారికి ఎదురుగా రైలు వస్తున్న శబ్ధం వినిపిస్తోంది. ఇంతలోనే ప్రియస్వామికి ఏదో గుర్తుకు వచ్చింది. టక్కున తన ఎర్ర కండువాను గాలిలో ఊపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తాడు. మరొక ట్రాక్‌మాన్‌ రామ్‌ నివాస్‌ కూడా ఎర్రజెండాను తీసుకుని పరిగెత్తుకు వచ్చాడు. వారి ప్రయత్నం ఫలించి అదృష్టం కొద్ది రైలు విరిగిన ట్రాక్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది ఆ రైల్‌. వీరి సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది.

కార్లు, బైక్‌లు, బస్సులు వంటి వాటిని సడెన్‌ బ్రేక్‌ చేసి ఆపవచ్చు. కానీ రైళ్లకు అది సాధ్యపడదు. గంటకు సుమారు 50-60 కిమీ వేగంతో వెళ్తున్న రైలు ఆగాలంటే ఆ రైలు100 మీటర్ల దూరాన ఉంటే తప్ప సా​ధ్యం కాదు. కానీ సకాలంలో రైల్వే ట్రాక్‌మెన్లు తీసుకున్న నిర్ణయంతో వందల మంది ప్రాణాలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. వీరు ఎ‍ర్ర కండువా, ఎర్రజెండా పరుగెత్తుకుని వచ్చేది గమనించిన రైలు డ్రైవర్‌ ఇంజిన్‌ను స్లో చేశాడు. దీంతో తొలిగిపోయిన ట్రాక్‌కు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. జరిగిన విషయం తెలుసుకుని రైలు డ్రైవర్‌ పెను ప్రమాదం నుంచి బయట పడినందుకు ఊపిరి పీల్చుకుని, వారిని అభినందించాడు.  వందలమందిని కాపాడిని ఈ ఇద్దరు ట్రాక్‌మెన్‌లను సత్కారించాలనుకుంటున్నామని ఉత్తర రైల్వే డిప్యూటి మేనేజర్‌ ఆర్‌ ఎన్‌ సంగ్‌ తెలిపారు.

గతంలోనూ....

రామ్‌ నివాస్‌కు గతంలోనూ ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ట్రాక్‌ వెంట 500 మీటర్లు పరిగెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీని గురించి రామ్‌ నివాస్‌ను అడగ్గా ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం. నా చిన్నతనంలో మా స్వస్థలం బీహార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ ప్రమాదానికి గల కారణాలు నాకు తెలుసు. అందుకే నేను సర్వీసులో ఉన్నంత కాలం అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement